ETV Bharat / sports

'నువ్వు లేని ఐపీఎల్​ మునుపటిలా ఉండదు' - మలింగపై బుమ్రా

ఫ్రాంచైజీ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్​ ప్రకటించిన​ లసిత్ మలింగకు అభినందనలు తెలిపాడు పేసర్​ బుమ్రా. మలింగ లేని ఐపీఎల్​ ఇకపై మునుపటిలా ఉండదని చెప్పాడు.

IPL won't be the same without you: Bumrah to Malinga
'నువు లేని ఐపీఎల్​ మునుపటిలా ఉండదు'
author img

By

Published : Jan 22, 2021, 5:21 AM IST

ఫ్రాంఛైజీ క్రికెట్​ నుంచి రిటైర్మెంట్​ ప్రకటించిన​ లసిత్ మలింగను అభినందించాడు భారత​ పేసర్​ జస్ప్రీత్​ బుమ్రా. మలింగ లేని ఐపీఎల్​ ఇకపై మునుపటిలా ఉండదని అభిప్రాయపడ్డాడు. అతడితో కలిసి ఆడడం గౌరవంగా భావిస్తున్నానని అన్నాడు. మలింగ నుంచి చాలా విషయాలు నేర్చుకున్నట్లు చెప్పాడు బుమ్రా.

"కొన్నేళ్లుగా ముంబయి ఇండియన్స్​ జట్టులో మీతో కలిసి బౌలింగ్ చేయడం అదృష్టంగా భావిస్తున్నా. అద్భుతమైన కెరీర్​కు ముగింపు పలికినందుకు అభినందనలు. మీరు లేకుండా ఐపీఎల్​ మునుపటిలా ఉండదు," అని బుమ్రా ట్వీట్​ చేశాడు.

ఫ్రాంఛైజీ క్రికెట్ నుంచి మలింగ తప్పుకోవాలనుకున్నాడు. అందుకే ఐపీఎల్-2021 కోసం జట్టులో అతనికి స్థానం కల్పించడంలేదని ముంబయి ఇండియన్స్ వెల్లడించింది.

ఇదీ చదవండి: 'టీమ్​ఇండియాకు క్వారంటైన్​ తప్పనిసరి కాదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.