ETV Bharat / sports

ఐపీఎల్​: దుబాయ్​లో తొలిరోజు క్వారంటైన్​ ఇలా - ఐపీఎల్​ కొత్త వార్తలు

ఐపీఎల్​ కోసం యూఏఈ చేరుకున్న ఫ్రాంచైజీలు.. తొలిరోజు క్వారంటైన్​ అనుభవాలను పంచుకున్నాయి. ఈ క్రమంలోనే బీసీసీఐ మార్గదర్శకాలను పాటిస్తూ.. ఆటగాళ్లంతా తమ కార్యకలాపాలను సాగించారు.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Aug 21, 2020, 8:19 PM IST

క్రికెట్​ అభిమానులంతా ఎప్పుడెప్పుడా అని ఎదురు చూస్తున్న ఐపీఎల్​ కోసం ఫ్రాంచైజీలు ఒక్కొక్కొటిగా యూఏఈకి చేరుకుంటున్నాయి. రాజస్థాన్​ రాయల్స్​, కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఆటగాళ్లు దుబాయ్​కి చేరుకోగా.. కోల్​కతా నైట్​రైడర్స్​ బృందం అబుదాబిలో అడుగుపెట్టింది. కరోనా నిబంధనల మేరకు వీరంతా ఆరురోజుల పాటు గదికే పరిమితం కానున్నారు. ఈ క్రమంలోనే తొలిరోజు బీసీసీఐ మార్గదర్శకాలను అనుసరించిన క్రికెటర్లు, తమ కార్యకలాపాలు సాగించారు.

బీసీసీఐ నిబంధనలు(ఎస్​ఓపీ) ప్రకారం రాయల్స్​ బృందం మొదటి రోజు కరోనా పరీక్షలను పూర్తి చేసుకోగా.. కింగ్స్​ఎలెవెన్​ పంజాబ్​ శుక్రవారం మరోసారి టెస్టులకు వెళ్లింది. బోర్డు మార్గదర్శకాల మేరకు ఆటగాళ్లకు 1,3,6 రోజులలో కరోనా పరీక్షలు నిర్వహించనున్నారు. వీటన్నింటినీ దాటుకుని వచ్చిన జట్లు శిక్షణ ప్రారంభించనున్నాయి.

ఈ ఆరురోజుల పాటు ఎవరూ తమకు కేటాయించిన గది నుంచి బయటికి వెళ్లేందుకు అనుమతి లేదు. ఈ నేపథ్యంలోనే ఆటగాళ్లు బాల్కనీ నుంచి ఒకరినొకరు పలకరించుకున్నారు. మరికొంత మంది వ్యాయామాలు చేస్తూ నెట్టింట్లో పోస్టు చేశారు. రాయల్స్​ పేసర్​ జయ్​దేవ్​ ఉనద్కత్​ దుబాయ్​లో తొలిరోజు మొదటి అనుభవాన్ని పంచుకున్నాడు. వ్యాయామం కోసం గదిలో నియమించుకున్న ఓ ఎయిర్​ సైకిల్​తో పాటు, యోగా ప్రాక్టీస్​ చేస్తున్న వీడియోను పోస్టు చేశాడు.

మరోవైపు చెన్నై సూపర్​ కింగ్స్​, రాయల్​ ఛాలెంజర్స్​, ముంబయి ఇండియన్స్​ జట్లు శుక్రవారం యూఏఈకి చేరుకున్నాయి. దిల్లీ క్యాపిటల్స్​, సన్​రైజర్స్​ హైదరాబాద్​ ఆటగాళ్లు ఈ వారాంతంలో ఐపీఎల్ ఆతిథ్య దేశానికి వెళ్లనున్నారు.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.