ETV Bharat / sports

ఐపీఎల్​ చూడటానికి మా ఫ్యామిలీలు రావొచ్చా? - franchises seek clarity on family traveling

ఐపీఎల్​ కోసం తమ కుటుంబ సభ్యుల ప్రయాణానికి సంబంధించి లిఖిత పూర్వక వివరణ కావాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. వీటితో పాటు కరోనా మార్గదర్శకాలపైనా ఓ స్పష్టత ఇవ్వాలని సూచించాయి.

IPL
ఐపీఎల్​
author img

By

Published : Aug 4, 2020, 8:49 PM IST

Updated : Aug 4, 2020, 9:09 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​ కోసం యూఏఈకి తమ కుటుంబ సభ్యుల ప్రయాణంతో పాటు, మార్గదర్శకాలపై లిఖిత పూర్వక వివరణ కావాలని సంబంధిత ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి. మార్చి-మే నెలల్లో ఐపీఎల్​ నిర్వహించాల్సి ఉంది. అయితే, కరోనా కారణంగా వాయిదా పడింది. ఇటీవలే యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఈ లీగ్​ను జరపనున్నట్లు బీసీసీఐ స్పష్టం చేసింది.

IPL
ఐపీఎల్​

"కొన్ని ఫ్రాంచైజీలు ప్రయాణం కోసం ఇప్పటికే దుబాయ్​లోని కొన్ని హాటల్స్​ను ఖరారు చేశాయి. చార్టర్డ్​ విమానాలు బుక్​ చేస్తున్నారు. ఆగస్టు 20 తర్వాత అందరూ యూఏఈకి ప్రయాణించే అవకాశం ఉంది. తాత్కాలిక ప్రణాళిక, తేదీల గురించి ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి ముందుగానే తెలియజేశాం. అయితే, వారి కుటుంబ సభ్యుల ప్రయాణాలపై మాకు స్పష్టత కావాలి."

-ఐపీఎల్​ ఫ్రాంచైజీల అధికారులు

ఇటీవలే బయో సెక్యూర్​ విధానంతో పాటు, నియమ నిబంధనలపై ఐపీఎల్​ పాలకమండలితో ఫ్రాంచైజీలు చర్చించాయి. 53 రోజుల పాటు ఈ బయో బబుల్​ వాతావరణంలో తమ కుటుంబ సభ్యులు ఎంత వరకు సురక్షితమనే విషయంపై ఫ్రాంచైజీలు ఆందోళన వ్యక్తం చేస్తున్నాయి. ఒకవేళ కుటుంబ సభ్యుల్లో ఎవరైనా నిబంధనలను అతిక్రమిస్తే.. ఎదుర్కొనే పరిణామాలపై స్పష్టత కావాలని ఫ్రాంచైజీలు బీసీసీఐని కోరాయి.

Last Updated : Aug 4, 2020, 9:09 PM IST
ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.