ETV Bharat / sports

ఇక ఐపీఎల్​ మజా.. కౌంట్​డౌన్ షురూ! - indian premiere league

టెస్టు, టీ20, వన్డే సిరీస్ ముగిసిపోయింది. ఇక ఐపీఎల్ సందడి షురూ కానుంది. ఏప్రిల్ 9న ప్రారంభమయ్యే ఈ లీగ్​ కోసం క్రికెట్ అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తున్నారు.

IPL
ఐపీఎల్​
author img

By

Published : Mar 30, 2021, 6:29 AM IST

టెస్టు సిరీస్‌ అయిపోయింది.. టీ20 సిరీస్‌ ముగిసిపోయింది.. వన్డే సిరీస్‌ పూర్తయ్యింది.. అంతేనా..! ఇంకా చాలా ఉంది. మహా క్రికెట్‌ సంబరం ముందుంది. ఇంటిల్లిపాదికి వినోదాన్ని పంచే వేడుక వచ్చేస్తోంది. మండే వేసవిలో సాయంత్రం కాగానే ఆహ్లాదాన్ని పంచే ఐపీఎల్‌ సరికొత్తగా ముస్తాబవుతోంది. సిక్సర్ల మెరుపులకు.. ఉత్కంఠభరిత పోరాటాలకు.. కళ్లు చెదిరే విన్యాసాలకు వేదికైన ఈ మెగా టీ20 లీగ్‌ ఈసారి సొంతగడ్డపైనే జరగనుంది.

మరో పది రోజుల్లోనే..!

కొవిడ్‌ భయం ఇంకా వెంటాడుతూనే ఉన్నా.. బయో బుడగ వాతావరణంలో ప్రపంచం మెచ్చిన ఈ లీగ్‌ మరో పదిరోజుల్లో కనువిందు చేయనుంది. ప్రత్యక్షంగా చూసే అవకాశం ఉందో లేదో గానీ.. బుల్లితెరల ముందు ఫుల్లుగా వినోదం పంచడం ఖాయం. ఈసారి ఆరు నగరాలకే పరిమితమైన ఈ టోర్నీలో అన్ని జట్లూ తటస్థ వేదికల్లోనే మ్యాచ్‌లు ఆడడం, ఎప్పటిలా కాకుండా అరగంట ముందే (మధ్యాహ్నం 3.30, రా.7.30) మ్యాచ్‌లు ఆరంభం కావడం విశేషం.

లీగ్‌ ఆరంభానికి ముందు ఆటగాళ్లందరూ వారం రోజుల పాటు క్వారంటైన్‌లో ఉండనున్నారు. చెన్నై, పంజాబ్‌ లాంటి జట్లు ఇప్పటికే ప్రాక్టీస్‌ను షురూ చేశాయి. రోహిత్‌శర్మ, హార్దిక్‌ పాండ్యా, కృనాల్‌ పాండ్యా, సూర్యకుమార్‌ యాదవ్‌ (ముంబయి ఇండియన్స్‌), రిషబ్‌ పంత్‌, అశ్విన్‌తో పాటు అక్షర్‌ పటేల్‌, వోక్స్‌, ప్రధాన కోచ్‌ పాంటింగ్‌ (దిల్లీ క్యాపిటల్స్‌) సోమవారం తమ జట్లలో చేరారు. ఒకట్రెండు రోజుల్లో జట్లన్నీ పూర్తిస్థాయిలో ఆటగాళ్లతో నిండిపోనున్నాయి. ఏప్రిల్‌ 9న డిఫెండింగ్‌ ఛాంపియన్‌ ముంబయి ఇండియన్స్‌, బెంగళూరు రాయల్‌ ఛాలెంజర్స్‌ మధ్య మ్యాచ్‌తో ఈ టీ20 మేళాకు తెరలేవనుంది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.