ఐపీఎల్ చరిత్రలో ఎక్కువ విజయాలు అందుకున్న జట్టుగా చెన్నైకు రికార్డు ఉంది. మొత్తం 150 మ్యాచ్‌లాడిన సూపర్ కింగ్స్ జట్టు 91 విజయాలు అందుకుని 60.67 శాతం గెలుపు రేటుతో దూసుకెళ్తోంది. 169 మ్యాచ్‌లాడిన ఆర్సీబీ 79 మ్యాచ్‌ల్లో గెలిచింది. గత సీజన్లో పరస్పరం రెండుసార్లు తలపడగా రెండింటిలోనూ బెంగళూరు జట్టు ఓటమి పాలైంది. మరి ఈసారి ప్రత్యర్థిని ఏ మేరకు కట్టడి చేస్తుందో చూడాలి.
ఐపీఎల్ ప్రారంభమైనప్పటి నుంచి చెన్నై, బెంగళూరు 23 సార్లు తలపడ్డాయి. చెన్నై 15 మ్యాచ్‌ల్లో గెలిచింది. బెంగళూరు ఏడింటిలో నెగ్గగా, ఓ మ్యాచ్ వర్షం వల్ల రద్దయింది. ఎక్కువ మ్యాచ్‌లో చెన్నై గెలిచినప్పటికీ కోహ్లీని కట్టడి చేయడంలో విఫలమైంది ధోనీ జట్టు. విరాట్ తన వ్యక్తిగత స్కోరులో 732 పరుగులు చెన్నైపైనే చేయగా, ధోనీ ఆర్సీబీపై 710 పరుగుల నమోదు చేశాడు.
ఈసారి చెన్నైపై ఎలాగైనా గెలవాలనే పట్టుదలతో ఉంది కోహ్లీ సేన. హెట్మైర్, శివమ్ దుబే, హెన్రిచ్ క్లాసన్ వంటి కొత్త ఆటగాళ్లను జట్టులోకి తీసుకుంది ఆర్సీబీ. మార్కస్ స్టాయినిస్నూ వేలంలో దక్కించుకుంది. చెన్నై గత ఏడాది ఆడిన వాళ్లకే అవకాశం కల్పించింది. మోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్ మినహా కొత్తవాళ్లను తీసుకోలేదు.
రెండు జట్లలోనూ స్టార్ ఆటగాళ్లకు కొదవలేదు. ఆర్సీబీ బ్యాటింగ్, బౌలింగ్‌లో సుస్థిరత సాధించి చెన్నైకు షాకిచ్చినా ఆశ్చర్యపోనక్కర్లేదు.
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టు..
దేశీయ ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ(కెప్టెన్), పార్థివ్ పటేల్, చాహల్, ఉమేశ్ యాదవ్, నవదీప్ సైనీ, కుల్వంత్, వాషింగ్టన్ సుందర్, పవన్ నేగి, మహమ్మద్ సిరాజ్, ప్రాయాస్ బర్మన్, దేవ్ దత్ పాడిక్కల్, శివమ్ దుబె, హిమ్మత్ సింగ్, ప్రయాస్ రే బర్మాన్, మన్దీప్ సింగ్, గుర్క్రీత్ సింగ్.
విదేశీయులు: ఏబీ డివిలియర్స్, సౌథీ, నాథన్ కౌల్టర్ నైల్, మొయిన్ అలీ, హెన్రిచ్ క్లాసన్, గ్రాండ్ హోమ్, హెట్మైర్.
కీలక ఆటగాళ్లు: విరాట్ కోహ్లీ, డివిలియర్స్, గ్రాండ్ హోమ్, చాహల్, ఉమేశ్ యాదవ్, కౌల్టర్‌నైల్, సౌథి, మొయిన్ అలీ.
చెన్నై సూపర్ కింగ్స్ జట్టు:
ధోనీ(కెప్టెన్), సురేశ్ రైనా, దీపక్ చాహర్, కెఎమ్ అసీఫ్, కరణ్ శర్మ, ధ్రువ్ షెరోయ్, ఎమ్ విజయ్, రవీంద్ర జడేజా, కేదార్ జాదవ్, రాయుడు, హర్భజన్ సింగ్, జగదీశన్, శార్దుల్ ఠాకుర్, మోను కుమార్, చైతన్య, మోహిత్ శర్మ, రుతురాజ్ గైక్వాడ్.
విదేశీయులు: డుప్లెసిస్, శ్యామ్ బిల్లింగ్స్, డేవిడ్ విల్లే, బ్రావో, షేన్ వాట్సన్, ఎంగిడి, ఇమ్రాన్ తాహిర్
కీలక ఆటగాళ్లు: ధోనీ, డుప్లెసిస్, బ్రావో, రైనా, రాయుడు, హర్భజన్, జడేజా, తాహిర్