ఐపీఎల్‌లో ఇప్పటి వరకు 12 సీజన్లు జరిగాయి. వచ్చే ఏడాది వేసవిలో 13వ సీజన్ ప్రారంభం కానుంది. స్టార్ ఆటగాళ్లకు కొదవలేని ఆర్‌సీబీ.. ఇప్పటి వరకు ఒక్కసారైనా టైటిల్‌ను గెలవలేకపోయింది. 2009, 2011, 2016లో ఫైనల్స్‌కు వెళ్లినా, రన్నరప్‌గానే నిలిచింది. గత మూడు సీజన్లలో పేలవ ప్రదర్శన చేస్తూ ప్లేఆఫ్స్‌కు చేరలేకపోయింది. వచ్చే సీజన్‌లోనైనా టైటిల్‌ను గెలవాలని పట్టుదలతో ఉంది. ఈ నేపథ్యంలో అన్ని రంగాల్లో జట్టును బలోపేతం చేసుకుంటామని ఇటీవల కోహ్లీ అభిమానులకు చెప్పాడు.
అంటిపెట్టుకున్న ఆటగాళ్లు
విరాట్ కోహ్లీ(కెప్టెన్), మొయిన్ అలీ, చాహల్, డివిలియర్స్, పార్థివ్ పటేల్, మహ్మద్ సిరాజ్, పవన్ నేగి, ఉమేశ్ యాదవ్, గుర్కీరత్ మన్, దేవదూత్ పడిక్కల్, శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ
వదులుకున్న క్రికెటర్లు
మార్కస్ స్టొయినిస్, హెట్మయిర్, అక్షదీప్ నాథ్, నాథన్ కౌల్టర్‌నైల్, కొలిన్ డి గ్రాండ్‌హోమ్, ప్రయాస్ రాయ్ బర్మన్, టిమ్ సౌతీ, కుల్వంత్ కేజ్రోలియా, హిమ్మత్ సింగ్, హెన్రిచ్ క్లాసన్, మిలింద్ కుమార్, డేల్ స్టెయిన్
ఉన్న నగదు: రూ.27.90 కోట్లు
మిగిలున్న స్థానాలు: 12(స్వదేశీ 6, విదేశీ 6)
వ్యూహం
ఆర్‌సీబీ.. ఈ ఏడాది నిరాశజనక ప్రదర్శనే చేసింది. స్టార్ క్రికెటర్లు జట్టులో ఉన్న కప్పు కొట్టడంలో విఫలమైంది. అయితే ఆనందించే విషయం ఏంటంటే.. శివమ్ దూబే, వాషింగ్టన్ సుందర్, నవదీప్ సైనీ వంటి యువ భారత క్రికెటర్లు వెలుగులోకి రావడం.
మిగిలున్న ఆరు విదేశీ క్రికెటర్ల స్థానాలను భర్తీ చేసేందుకు సిద్ధమవుతోంది. అయితే వాటిని స్టార్లతో నింపాలా? ప్రతిభ ఉన్న యువ క్రికెటర్లను ఎంచుకోవాలా? అనే విషయమై మేనేజ్మెంట్ ఆలోచన చేస్తోంది.
దృష్టి సారించే ఆటగాళ్లు
క్రిస్ లిన్, టామ్ బాంటన్, అలెక్స్ కేరీ, కమిన్స్, సామ్ కరన్, గ్లెన్ మాక్స్వెల్, క్రిస్ మోరిస్, షెల్డన్ కాట్రెల్, విరాట్ సింగ్, హెట్మయిర్, డేవిడ్ మిల్లర్, జేమ్స్ నీషమ్, మిచెల్ మార్ష్, అల్జారీ జోసెఫ్, ప్రవీణ్ దూబే, లుక్మన్ మెరివాలా, క్రిస్ జోర్డాన్, జలజ్ సక్సేనా, రాబిన్ ఉతప్ప, జార్జ్ గార్టెన్