ETV Bharat / sports

ఐపీఎల్​: స్టేడియంలోకి మీడియాకు నో ఎంట్రీ - ఐపీఎల్​ తొలి మ్యాచ్​

ఐపీఎల్​ మ్యాచ్​లు జరిగేటప్పుడు మీడియాను స్టేడియంలోకి అనుమతించట్లేదని బీసీసీఐ స్పష్టం చేసింది. మ్యాచ్​ పూర్తయిన తర్వాత వర్చువల్​గా సమావేశం ఉంటుందని వెల్లడించింది.

IPL Advisory
ఐపీఎల్
author img

By

Published : Sep 18, 2020, 10:20 PM IST

ఈ ఏడాది ఐపీఎల్​లో మ్యాచ్​లు జరిగే సమయంలో మీడియాకు అనుమతి లేదని బీసీసీఐ శుక్రవారం వెల్లడించింది. కరోనా వ్యాప్తి వల్ల కఠిన నిబంధనలు విధించిన కారణంగానే ఈ నిర్ణయం తీసుకున్నట్లు తెలిపింది. మ్యాచ్​కు ముందు ప్రెస్​ కాన్ఫరెన్స్​లనూ నిర్వహించడం లేదని అధికారులు స్పష్టం చేశారు. అయితే మ్యాచ్​ ముగిసిన తర్వాత వర్చువల్​గా మీడియా సమావేశం ఏర్పాటు చేయనున్నట్లు చెప్పారు.

యూఏఈ వేదికగా సెప్టెంబరు 19(శనివారం) నుంచి టోర్నీ ప్రారంభం కానుంది. తొలి మ్యాచ్​ ముంబయి, చెన్నై జట్ల మధ్య జరగనుంది. భారత కాలమానం ప్రకారం రాత్రి 7.30 గంటలకు మొదలవుతుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.