ETV Bharat / sports

ఐపీఎల్ వేలం: ఫ్రాంఛైజీల ఉత్తమ, అనూహ్య నిర్ణయాలు ఇవే! - ఐపీఎల్ వేలం డేవిడ్ మలన్

ఈసారి ఐపీఎల్ మినీ వేలం రసవత్తరంగా సాగింది. కొందరు భారీ ధరతో ఆశ్చర్యపరచగా.. మరికొందరు ఫ్రాంఛైజీల నమ్మకాన్ని పొందలేక అలాగే మిగిలిపోయారు. ఈ నేపథ్యంలో ఈసారి వేలంలో ఫ్రాంఛైజీలు తీసుకున్న వ్యూహాత్మక, అనూహ్య నిర్ణయాలపై ఓ లుక్కేద్దాం.

IPL 2021
ఐపీఎల్
author img

By

Published : Feb 19, 2021, 8:43 PM IST

ఐపీఎల్ 14వ సీజన్​ కోసం జరిగిన మినీ వేలం ముగిసింది. కొంతమంది భారీ ధర దక్కించుకోగా మరికొంత మంది అనూహ్యంగా కనీసం చోటు దక్కించుకోలేకపోయారు. యువ ఆటగాళ్లు కోట్ల ధర పలికి ఆశ్చర్యానికి గురిచేశారు. కొందరు లీగ్​లోకి చాలా కాలం తర్వాత అడుగుపెట్టబోతున్నారు. ఇలా ఎన్నో విశేషాల నడుమ ముగిసిన వేలంలో ఫ్రాంఛైజీలు కొన్ని అద్భుత నిర్ణయాలతో ఆకట్టుకోగా.. కొన్ని అసలు వారికి పనికి రాని స్లాట్స్​ను భారీ ధరకు కొనుగోలు చేశాయి. అలా ఈ ఏడాది వేలంలో ఫ్రాంఛైజీలు తీసుకున్న ఉత్తమ, చెత్త నిర్ణయాలు ఏంటో చూద్దాం.

1. రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు

మ్యాక్స్​వెల్-వ్యూహాత్మకం

గతేడాది ఐపీఎల్​లో తీవ్రంగా నిరాశపర్చాడు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్ గ్లెన్ మ్యాక్స్​వెల్. అయినా అవేమీ పట్టించుకోకుండా ఇతడిని రూ 14.25 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది ఆర్సీబీ. కానీ మిడిలార్డర్​లో పేలవంగా ఉన్న ఈ జట్టుకు మ్యాక్సీ అనుభవం పెద్ద ప్లస్​గా చెప్పుకోవచ్చు. కోహ్లీ, డివిలియర్స్ లాంటి అగ్రశ్రేణి ఆటగాళ్ల తర్వాత ఇతడు ఈ జట్టుకు అండగా నిలిచే అవకాశం ఉంది. ఇతడు అటు బ్యాటింగ్​తోనే కాకుండా ఆఫ్ స్పిన్ బౌలింగ్, అద్భుత ఫీల్డింగ్​తో ఆకట్టుకుంటే ఆర్సీబీకి తిరుగుండకపోవచ్చు.

IPL 2021
మ్యాక్స్​వెల్

కైల్ జేమిసన్-అనూహ్యం

ఈ ఏడాది అంతర్జాతీయ స్థాయిలో మంచి ప్రదర్శన చేసి జట్టుకు విజయాలను అందించి అందరి దృష్టినీ ఆకర్షించాడు న్యూజిలాండ్ యువ పేసర్ కైల్ జేమిసన్. దీంతో ఇతడు ఈసారి వేలంలో ప్రత్యేకార్షణగా నిలిచాడు. దీనిని నిజం చేస్తూ ఇతడిని ఆర్సీబీ ఏకంగా రూ 15 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇతడు ఆర్సీబీ డెత్ బౌలింగ్​కు పెద్ద ప్లస్​ అయినా.. కనీస ధర 75 లక్షలు ఉన్న ఆటగాడిని రూ. 15 కోట్ల ధరకు కొనుగోలు చేయడం వారి వ్యూహంలోని లోపాలను చెబుతోంది. అతడి ప్రదర్శన బాగున్నా, జట్టు ప్రణాళికలు ఎలా ఉన్నా జేమిసన్​కు అంత భారీ ధర వెచ్చించడం సరికాదని అంటున్నారు విశ్లేషకులు.

2. కోల్​కతా నైట్​రైడర్స్

షకీబుల్ హసన్-వ్యూహాత్మకం

గత సీజన్​ ప్రారంభంలో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్న కేకేఆర్.. తర్వాత అంచనాల్ని అందుకోవడంలో విఫలమైంది. ఈసారి తక్కువ మిగులు బడ్జెట్ ఉన్న రెండో జట్టుగా వేలంలో పాల్గొంది. కానీ వారి డబ్బులను ఎక్కడ ఖర్చు చేయాలో సరిగ్గా వేచి చూసిన ఈ జట్టు బంగ్లాదేశ్ ఆల్​రౌండర్ షకీబుల్ హసన్​ను రూ 3.2 కోట్ల ధరకు కొనుగోలు చేసి మంచి పని చేసింది. వీరికి ఇప్పటికే ఆండ్రూ రసెల్, సునీల్ నరైన్ లాంటి ఆల్​రౌండర్లు ఉన్నా.. షకీబ్​ చేరిక జట్టుకు మరింత బలాన్ని చేకూర్చనుంది.

IPL
షకీబుల్

హర్భజన్ సింగ్-అనూహ్యం

వేలం మొదటి రౌండ్​లో ఎవ్వరినీ ఆకట్టుకోనీ టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్​ను రెండో రౌండ్​లో కనీస ధర రూ 2 కోట్లకు కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్. అనుభవం పరంగా, ఐపీఎల్ రికార్డు పరంగా భజ్జీని స్టార్ ఆటగాడిగా చెప్పుకోవచ్చు. ఇప్పటివరకు 160 మ్యాచ్​లు ఆడిన ఇతడు 150 వికెట్లు దక్కించుకున్నాడు. కానీ ప్రస్తుతం ఈ 40 ఏళ్ల స్పిన్నర్ జట్టుకు ఏ విధంగా ఉపయోగపడకపోవచ్చు. ఎందుకంటే ఇదే వేలంలో వీరు తీసుకున్న షకీబ్​ను కాదని భజ్జీని ఎంపిక చేసే అవకాశం లేకపోవచ్చు. ఇతడు సుదీర్ఘ కాలంగా ఐపీఎల్​కు దూరంగా ఉండటం కూడా పెద్ద మైనస్.

3. చెన్నై సూపర్ కింగ్స్

మొయిన్ అలీ - వ్యూహాత్మకం

గత సీజన్​లో అభిమానుల అంచనాల్ని తలకిందులు చేస్తూ ఏడో స్థానంలో నిలిచింది ధోనీ సారథ్యంలోని చెన్నై సూపర్ కింగ్స్. జట్టు ప్రధాన ఆటగాళ్లు సురేశ్ రైనా, హర్భజన్ సింగ్​ ఈ లీగ్​కు దూరమవడం వల్ల జట్టు సమతుల్యం దెబ్బతిని ఆకట్టుకోలేకపోయింది. షేన్ వాట్సన్ రిటైర్మెంట్​తో ఓవర్సీస్ స్లాట్​ను ఖాళీ చేసుకున్న ఈ జట్టు మొయిన్ అలీ రూపంలో మంచి ఆల్​రౌండర్​ను తీసుకుంది. ఇతడు స్పిన్​తో పాటు పించ్ హిట్టింగ్​తో ఆకట్టుకోగలడు.

IPL 2021
మొయిన్ అలీ

కృష్ణప్ప గౌతమ్ - అనూహ్యం

రూ 9.25 కోట్ల భారీ ధరతో కృష్ణప్ప గౌతమ్​ను కొనుగోలు చేసి అందరినీ ఆశ్చర్యానికి గురి చేసింది చెన్నై సూపర్ కింగ్స్. ఇది ఇతడి కనీస ధర రూ 20 లక్షలకు 46 రెట్లు ఎక్కువ. ఇప్పటివరకు 24 ఐపీఎల్​ మ్యాచ్​లు ఆడిన గౌతమ్​ 186 పరుగులు మాత్రమే చేశాడు. ప్రస్తుతం దేశవాళీ టోర్నీల్లో సత్తాచాటినా.. డ్వేన్ బ్రావో, రవీంద్ర జడేజా, సామ్ కరన్ లాంటి ఆల్​రౌండర్లు ఉన్న జట్టులో ఇతడి పాత్ర ఏంటన్నది ప్రశ్నార్థకం.

4. ముంబయి ఇండియన్స్

కౌల్టర్​నీల్ - వ్యూహాత్మకం

ఐదు సార్లు విజేత ముంబయి ఇండియన్స్​ ఈసారి వేలంలోనూ వ్యూహాత్మకంగా వ్యవహరించింది. మొత్తం 7 స్లాట్స్ (4 ఓవర్సీస్) ఖాళీలతో వేలంలో పాల్గొన్న ఈ జట్టు వేలానికి ముందు విడుదల చేసిన కౌల్టర్​నీల్​ను తక్కువ ధరకు కొనుగోలు చేసింది. గతంలో ఇతడిని రూ 8 కోట్లకు తీసుకున్న ముంబయి.. ఈసారి రూ 3 కోట్లు తక్కువగా 5 కోట్లకు కొనుగోలు చేసింది. బౌల్ట్​కు బ్యాకప్​ బౌలర్​గా ఇతడు మంచి ప్రదర్శన చేస్తాడని జట్టు భావిస్తోంది. బ్యాటింగ్​ మెరుపులతో ఆకట్టుకునే ఇతడు అవకాశం వస్తే చెలరేగగలడని గత సీజన్​లో నిరూపించాడు.

అర్జున్ తెందుల్కర్ - అనూహ్యం

ఈసారి ఐపీఎల్ వేలానికి కంటే ముందు నుంచి అందరి చూపు గాడ్ ఆఫ్ క్రికెట్ సచిన్ తనయుడు అర్జున్ తెందుల్కర్ పైనే ఉంది. కనీస ధర రూ 20 లక్షలతో వేలంలో పాల్గొన్న ఇతడిని అదే ధరకు కొనుగోలు చేసింది ముంబయి. ఇది కాస్త తొందరపాటు నిర్ణయమని చెప్పొచ్చు. కేవలం భావోద్వేగంతోనే ఇతడిని తీసుకున్నట్లు తెలుస్తోంది. కానీ అతడి ప్రదర్శనను తక్కువ అంచనా వేయడానికి లేదు. సయ్యద్ ముస్తాక్ అలీలో ఇటీవల అరంగేట్రం చేసిన అర్జున్ రెండు టీ20ల్లో రెండు వికెట్లు సాధించాడు. అలాగే ముంబయి స్థానిక టోర్నీలో 26 బంతుల్లో 77 పరుగులు బాది అందరి దృష్టినీ ఆకర్షించాడు.

IPL 2021
అర్జున్ తెందుల్కర్

5. సన్​రైజర్స్ హైదరాబాద్

ముజిబుర్ రెహ్మాన్ - వ్యూహాత్మకం

ఈ లీగ్​లో తక్కువగా ముగ్గురినే తీసుకుంది సన్​రైజర్స్ హైదరాబాద్. ఇందులో అప్ఘనిస్థాన్ ఆల్​రౌండర్ ముజిబుర్​ను 1.5 కోట్ల కనీస ధర కొనుగోలు చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇప్పటికే ఈ జట్టులో రషీద్ ఖాన్, మహ్మద్ నబీ లాంటి ఆల్​రౌండర్లు ఉన్నా.. అవకాశం వస్తే ముజిబుర్​ బ్యాట్స్​మెన్​ను ముప్పతిప్పలు పెట్టగలడు.

IPL 2021
ముజిబుర్ రెహ్మన్

కేదార్ జాదవ్ - అనూహ్యం

మొదటి రౌండ్​లో ఎవ్వరూ ఆసక్తి చూపని టీమ్ఇండియా ఆల్​రౌండర్ కేదార్ జాదవ్​ను రెండో రౌండ్​లో కనీస ధర రూ 2 కోట్లకు కొనుగోలు చేసింది సన్​రైజర్స్. కానీ గతేడాది ఇతడి ప్రదర్శన ఏమాత్రం బాగోలేదు. 2020 ఐపీఎల్​లో 8 మ్యాచ్​లు ఆడిన ఇతడు 62 పరుగులు మాత్రమే చేశాడు. అంతర్జాతీయ క్రికెట్​కు చాలా కాలంగా దూరంగా ఉన్నాడు.

6. రాజస్థాన్ రాయల్స్

లైమ్ లివింగ్​స్టోన్ - వ్యూహాత్మకం

రూ 37.85 కోట్ల మిగులు బడ్జెట్​తో వేలంలో పాల్గొన్న రాజస్థాన్ రాయల్స్ ఈసారి ఆకట్టుకుంది. గత సీజన్ తర్వాత స్టార్ బ్యాట్స్​మన్ స్టీవ్ స్మిత్​ను వదిలేసి ఆశ్చర్యపరిచిన ఈ జట్టు ట్రేడింగ్ విండో ద్వారా రాబిన్ ఉతప్పను చెన్నైకి అప్పగించింది. అలాగే గత సీజన్​లో ఆకట్టుకోని ఓపెనర్ యశస్వీ జైస్వాల్​కు తోడు టాపార్డర్​లో మంచి స్లాట్​ కోసం లివింగ్​స్టోన్​ను తీసుకుంది. గత బిగ్​బాష్ లీగ్​లో అద్భుత ప్రదర్శన చేసిన లివింగ్​స్టోన్​ను కేవలం కసీన ధర రూ 50 లక్షలకే కొనుగోలు చేసి వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

క్రిస్ మోరిస్ - అనూహ్యం

ఈసారి వేలంలో క్రిస్ మోరిస్ ఐపీఎల్ చరిత్రలో అత్యధిక ధర రూ 16.25 కోట్లు పలికి రికార్డు సృష్టించాడు. ఇప్పటివరకు అత్యధిక ధర రూ 16 కోట్లతో ఉన్న యువరాజ్ సింగ్ రికార్డును తిరగరాశాడు. పంజాబ్ కింగ్స్​తో పోటీపడి ఇతడిని అంతటి రికార్డు ధరకు కొనుగోలు చేసింది రాజస్థాన్. అయితే గతేడాది రూ 10 కోట్లకు ఇతడికి కొనుగోలు చేసిన ఆర్సీబీ వేలానికి ముందు వదులుకుంది. రూ 10 కోట్ల ధరకే న్యాయం చేయలేని ఇతడిని రూ 16.25 కోట్లకు కొనుగోలు చేయడం కాస్త తొందరపాటే​. గత సీజన్​లో ఇతడు 5 ఇన్నింగ్స్​ల్లో 35 పరుగులు చేసి, 9 ఇన్నింగ్స్​ల్లో 11 వికెట్లు సాధించాడు.

IPL 2021
మోరిస్

7. పంజాబ్ కింగ్స్

డేవిడ్ మలన్ - వ్యూహాత్మకం

గత సీజన్​లో అందివచ్చిన అవకాశాల్ని వదులుకుని విఫలమైన పంజాబ్ కింగ్స్ ఈసారి భారీ మిగులు బడ్జెట్​తో వేలంలో పాల్గొంది. భారీ ధరకు కొనుగోలు చేసిన కొందరు ఆటగాళ్లను వదులుకున్న పంజాబ్ ఈసారి వేలంలో టీ20 నెంబర్ వన్ బ్యాట్స్​మన్ డేవిడ్ మలన్​ను కనీస ధర రూ 1.5 కోట్లకు దక్కించుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది.

రిలే మెరెడిత్ - అనూహ్యం

గతేడాది బిగ్​బాష్ లీగ్​లో అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు ఆస్ట్రేలియా యువ బౌలర్ మెరెడిత్. ఈ లీగ్​లో 16 వికెట్లతో సత్తాచాటాడు. డెత్ ఓవర్లలోనూ అద్భుత ప్రదర్శన చేయగలడు. కానీ కనీస ధర రూ 40 లక్షలకు వేలంలో పాల్గొన్న ఇతడిని రూ 8 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది పంజాబ్. ఇది ఒకింత ఆశ్చర్యానికి గురి చేసేదే.

8. దిల్లీ క్యాపిటల్స్

స్టీవ్ స్మిత్ - వ్యూహాత్మకం

గత సీజన్​లో రన్నరప్​తో సరిపెట్టుకున్న దిల్లీ క్యాపిటల్స్ ఈసారి తమ బ్యాటింగ్​ లైనప్​ను బలంగా చేసుకోవాలని వేలంలో స్టీవ్ స్మిత్​ను తీసుకుంది. జట్టులో అజింక్యా రహానే రూపంలో సీనియర్ ఆటగాడు ఉన్నా.. స్మిత్​ను తీసుకుని వ్యూహాత్మకంగా వ్యవహరించింది. ఇతడు బ్యాట్​తో పాటు అవసరమైన సమయంలో జట్టుకు తన కెప్టెన్సీ అనుభవంతో అండగా నిలవగలడు. గత సీజన్​లో అంతగా ఆకట్టుకోని ఇతడి అనుభవాన్ని అంత తక్కువ అంచనా వేయలేం.

IPL 2021
స్టీవ్ స్మిత్

టామ్ కరన్ - అనూహ్యం

గత సీజన్​లో 5 మ్యాచ్​లాడి కేవలం 3 వికెట్లు మాత్రమే దక్కించుకున్నాడు ఇంగ్లాండ్ ఆల్​రౌండర్ టామ్ కరన్. సన్​రైజర్స్​తో పోటీపడి ఇతడిని రూ 5.25 కోట్లకు దక్కించుకుంది దిల్లీ. ఇప్పటికే జట్టులో కగిసో రబాడ, ఎన్రిచో నోర్ట్జే, ఇషాంత్ శర్మ లాంటి పేసర్లు ఉండగా.. కరన్ ఎంపిక ప్రశ్నార్థకమే.

ఇవీ చూడండి: ఐపీఎల్​ 2021: ఏ జట్టులో ఎవరెవరు?

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.