ETV Bharat / sports

ఐపీఎల్​: ముంబయి జట్టులో కలిసిన రోహిత్​, పాండ్య

ఐపీఎల్​ 14వ సీజన్​ కోసం ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ముంబయి చేరుకుంటున్నారు. తాజాగా ముంబయి ఆటగాళ్లు రోహిత్​, సూర్య, హార్దిక్, కృనాల్​.. ముంబయి ఇండియన్స్​ జట్టుతో కలిశారు.

IPL 2021: Rohit Sharma arrives in Mumbai to join MI squad
ఐపీఎల్​: ముంబయికి చేరుకున్న రోహిత్, హార్దిక్
author img

By

Published : Mar 29, 2021, 4:37 PM IST

రానున్న ఐపీఎల్​ కోసం ముంబయి ఇండియన్స్​ ఆటగాళ్లు ఒక్కొక్కరుగా ముంబయికి చేరుకుంటున్నారు. రోహిత్​ శర్మ, సూర్యకుమార్ యాదవ్​, హార్దిక్​ పాండ్య, కృనాల్ పాండ్య.. ముంబయికి చేరుకున్నారు. ముంబయి ఇండియన్స్​ స్క్వాడ్​తో కలిశారు. ఈ విషయాన్ని ముంబయి ఫ్రాంచైజీ ధ్రువీకరించింది.

ట్విట్టర్​ వేదికగా స్పందించిన ముంబయి.. రోహిత్​తో పాటు సూర్య, హార్దిక్, కృనాల్​ జట్టుతో కలిసినట్లు ట్వీట్​ చేసింది. ఇటీవల ఇండియా-ఇంగ్లాండ్ సిరీస్​లో పాల్గొన్న క్రికెటర్లకు నేరుగా తమ జట్టుతో కలిసే అవకాశమిచ్చింది బీసీసీఐ. మిగతా వారికి వారం రోజుల తప్పనిసరి క్వారంటైన్ విధించింది.

"భారత్​కు ప్రాతినిధ్యం వహించడం చాలా సంతోషంగా ఉంది. దేశానికి ఆడటమనేది నా కల. ఒక మంచి జట్టు (టీమ్​ఇండియా)లో భాగమైనందుకు చాలా గొప్పగా ఉంది. ఇక ఐపీఎల్​లో భాగంగా నా సొంత జట్టు ముంబయితో కలిశాను" అని సూర్య మాట్లాడిన వీడియోను ముంబయి ఇండియన్స్​ ట్విట్టర్​ ఖాతాలో షేర్​ చేసింది. లీగ్​లో భాగంగా ముంబయి తమ తొలి మ్యాచ్ బెంగుళూరుతో ఆడనుంది. ఏప్రిల్​ 9న ఎంఏ చిదంబరం స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది. ​ ​

ఇదీ చదవండి: ''మ్యాన్​ ఆఫ్​ ది సిరీస్​' భువీకి రాకపోవడం ఆశ్చర్యం'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.