మహేంద్రసింగ్ ధోనీ మళ్లీ నెట్స్‌లో చెమటోడ్చుతున్నాడు. ఐపీఎల్ 14వ సీజన్ కోసం బ్యాట్ పట్టి సిక్సులు బాదుతున్నాడు. వచ్చేనెల ప్రారంభమయ్యే మెగా ఈవెంట్‌లో బ్యాట్ ఝుళిపించాలని తీవ్రంగా సాధన మొదలెట్టాడు. కొద్దిరోజుల క్రితమే చెన్నైకి చేరుకున్న మహి.. తాజాగా ప్రాక్టీస్ మొదలు పెట్టాడు. సాధన మొదలు పెట్టిన తొలి రోజే మైదానంలో సిక్సుల వర్షం కురిపించాడు. ప్రాక్టీస్ సందర్భంగా ధోనీ పలు బంతులను స్టాండ్స్‌లోకి తరలించిన వీడియోను చెన్నై ఫ్రాంచైజీ ట్విట్టర్లో అభిమానులతో పంచుకుంది. దీంతో తమ ఆరాధ్య క్రికెటర్ సాధన చేస్తున్న వీడియోను చూసిన అభిమానులు సంతోషం వ్యక్తం చేస్తున్నారు.
-
Mahi way all the way!!! 👀 on #Thala #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gU1TRD2ZP9
— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">Mahi way all the way!!! 👀 on #Thala #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gU1TRD2ZP9
— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021Mahi way all the way!!! 👀 on #Thala #WhistlePodu #Yellove 💛🦁 pic.twitter.com/gU1TRD2ZP9
— Chennai Super Kings (@ChennaiIPL) March 11, 2021
ధోనీ 2019 వన్డే ప్రపంచకప్ తర్వాత టీమ్‌ఇండియాకు దూరమయ్యాడు. తర్వాత ఐపీఎల్ కోసం గత మార్చిలో చెన్నైకి చేరుకుని కొద్దిరోజులు ప్రాక్టీస్‌లో పాల్గొన్నాడు. అయితే.. అప్పుడు లాక్‌డౌన్ విధించగా ఐపీఎల్ ఆరునెలలు వాయిదా పడింది. చివరికి 2020 సెప్టెంబర్-నవంబర్ కాలంలో యూఏఈలో లీగ్ 13వ సీజన్ జరిగింది.
అంతకుముందే ధోనీ చెన్నైలో రెండోసారి శిక్షణా శిబిరం ఏర్పాటు చేసిన సందర్భంగా ఆగస్టు 15న అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. ఇక తర్వాత ఐపీఎల్ కోసం యూఏఈకి వెళ్లిన జట్టులో పలువురు ఆటగాళ్లు కరోనా బారిన పడటం, అదే సమయంలో రైనా, భజ్జీ లాంటి సీనియర్లు వ్యక్తిగత కారణాలతో తప్పుకున్నారు. దీంతో చెన్నై గత సీజన్‌లో దారుణంగా విఫలమైంది. ధోనీ సైతం పెద్దగా ప్రభావం చూపలేకపోయాడు. టోర్నీ చరిత్రలో ఎన్నడూ లేని విధంగా ఆ జట్టు కనీసం ప్లేఆఫ్స్ చేరకుండానే ఇంటిముఖం పట్టింది. మరి ఈ సీజన్‌లో ధోనీ జట్టును ఎలా నడిపిస్తాడో చూడాలి.
ఇదీ చదవండి: రికార్డ్ అలర్ట్: మిథాలీ పది వేల పరుగులు