ETV Bharat / sports

ఐపీఎల్: వీరు​ అరంగేట్రంలోనే అదరగొడతారా?

ఈ శనివారం నుంచి ఐపీఎల్​ 13వ సీజన్​ ప్రారంభంకానుంది. ఈ నేపథ్యంలో తొలిసారి లీగ్​ బరిలో దిగనున్న టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

author img

By

Published : Sep 17, 2020, 10:30 AM IST

IPL
ఐపీఎల్​

ఐపీఎల్​.. క్రికెటర్లు తమ సత్తా నిరూపించుకోవడానికి ప్రపంచంలోనే చక్కని వేదిక. ఈ లీగ్​లో అద్భుత ప్రదర్శన కనబరిచి జాతీయ జట్టులో చోటు సంపాదించుకున్నవారు కూడా ఉన్నారు. అందుకే ఇందులో పాల్గొనాలని ఒక్క అవకాశం కోసం ఎంతోమంది ఆటగాళ్లు ఎదురుచూస్తుంటారు. అయితే ఈ ఏడాది కరోనా నేపథ్యంలో అనేక నాటకీయ పరిణామాల అనంతరం ఎట్టకేలకు దుబాయ్​ వేదికగా సెప్టెంబరు 19 నుంచి మెగాటోర్నీకి రంగం సిద్ధమైంది. ఈ సందర్భంగా ఐపీఎల్​ అరంగేట్రం చేయనున్న టాప్​ ఆటగాళ్లపై ఓ లుక్కేద్దాం.

యశస్వి జైస్వాల్

యశస్వి జైస్వాల్​.. అండర్​-19 ప్రపంచకప్​లో ఆరు మ్యాచుల్లో 400 పరుగులు చేసి వెలుగులోకి వచ్చాడు. ఫీల్డింగ్​, బ్యాటింగ్​లో అద్భుతంగా రాణించాడు. దీంతో రాజస్థాన్​ రాయల్స్​ వేలంపాటలో రూ.2.4కోట్లకు ఇతడిని కొనుగోలు చేసింది.

yasasvi
యశస్వి జైస్వాల్

రుతురాజ్​ గైక్వాడ్

రుతురాజ్​ గైక్వాడ్​.. ప్రస్తుతం కరోనా సోకడం వల్ల కొన్ని మ్యాచులకు అందుబాటులో ఉండకపోవచ్చు. ఇటీవల సీఎస్కేలో రైనా వైదొలగడం వల్ల.. అతడి స్థానంలో ఇతడు ఆడే అవకాశం ఉంది. లిస్ట్​-ఏ క్రికెట్​లో 54 మ్యాచుల్లోనే 2499 పరుగులు చేశాడు. అత్యధిక స్కోరు 187. ఈసారి వేలంలో చెన్నై జట్టు యాజమాన్యం రూ.20లక్షలకు కొనుగోలు చేసింది.

ruturaj
రుతురాజ్​

రవి బిష్ణోయ్​

రవి బిష్ణోయ్​.. కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ తరఫున​ ఈ ఏడాది ఐపీఎల్​ అరంగేట్రం చేయనున్నాడు. బ్యాటింగ్, బౌలింగ్​లోనూ రాణించగల సామర్థ్యం చూసి యాజమాన్యం ఇతడిని రూ.2 కోట్లకు కొనుగోలు చేసింది.

ravi bishnoi
రవి

అలెక్స్​ కారే

ఆస్ట్రేలియా వికెట్​ కీపర్​ బ్యాట్స్​మన్​ అలెక్స్​ కారే. 29ఏళ్ల ఈ ఆటగాడిని దిల్లీ క్యాపిటల్స్​ రూ.2.4కోట్లకు కొనుగోలు చేసింది. గతేడాది ప్రపంచకప్​లో ఆడిన 10మ్యాచుల్లో 375 పరుగులు చేశాడు. ఆస్ట్రేలియా బిగ్​బాష్ లీగ్​లో నిలకడమైన ఆడగాడిగా పేరు గాంచాడు.

alex
అలెక్స్​ కారే

షెల్డన్​ కాట్రెల్​(వెస్టిండీస్​)

కింగ్స్​ ఎలెవన్​ పంజాబ్​ ఇతడిని 8.50కోట్లకు దక్కించుకుంది. గత రెండేళ్లుగా అద్భుత ఆటగాడిగా రాణిస్తూ అభిమానుల మనసు దోచుకుంటున్నాడు. కరీబియన్​ ప్రీమియర్​ లీగ్​లో ఏడు మ్యాచుల్లో ఐదు వికెట్లు పడగొట్టాడు.

cotrell
షెల్డన్​ కాట్రెల్​

అలీ ఖాన్(అమెరికా)

ఐపీఎల్ చరిత్రలోనే తొలి అమెరికన్​ క్రికెటర్ అలీ ఖాన్​. కోల్​కతా నైట్​ రైడర్స్​ ఈ పేసర్​ను తీసుకుంది. సీపీఎల్​ 2020 విజేత ట్రింబాగో నైట్ రైడర్స్ జట్టు తరఫున అలీ ఖాన్ ఆడాడు. అందులో ఆడిన ఎనిమిది మ్యాచుల్లో ఎనిమిది వికెట్లు పడగొట్టాడు.

ali
అలీఖాన్​

ఇదీ చూడండి ఐపీఎల్2020: దిల్లీ క్యాపిటల్స్ బలాలు, బలహీనతలు ఇవే!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.