ఐపీఎల్ చరిత్రలో విజయవంతమైన జట్లలో చెన్నై సూపర్‌కింగ్స్ అగ్రస్థానంలో ఉంటుందనడంలో ఎలాంటి సందేహం లేదు. ధోనీ నాయకత్వంలో 12 సీజన్లలో 9 సార్లు ప్లేఆఫ్స్‌లోకి ప్రవేశించిన సీఎస్కే.. నాలుగుసార్లు రన్నరప్‌గా, మూడుసార్లు విజేతగా నిలిచింది. సీఎస్కే స్టామినా చెప్పేందుకు ఈ గణాంకాలు చాలు.
ప్రస్తుత సీజన్ కోసం అన్ని జట్లు సిద్ధమవుతుండగా, చెన్నై మాత్రం అనుకోని అవాంతరాల్ని ఎదుర్కొంటోంది. ఇప్పటికే సీనియర్ బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా, స్పిన్నర్ హర్భజన్ సింగ్ సేవలు కోల్పోయింది. క్రికెటర్స్ రుతురాజ్, దీపక్ చాహర్ సహా 11 మంది సహాయక సిబ్బంది కరోనా బారిన పడ్డారు. ఈ సమస్యలన్ని కలవరపాటుకు గురిచేస్తున్నాయి. ఈ నేపథ్యంలో సీఎస్కే బలాలు, బలహీనతలు, అవకాశాలపై కథనం.
బలాలు
ఉత్తమ స్పిన్ దళం
ఐపీఎల్ ప్రారంభం నుంచి చెన్నై జట్టు విజయవంతమవడానికి స్పిన్ దళమే ప్రధానాస్త్రం. రవీంద్ర జడేజా, కర్ణ శర్మ, పియూష్ చావ్లా, ఇమ్రాన్ తాహిర్, మిచెల్ సాంట్నర్ లాంటి అద్భుత స్పిన్నర్లు ఉన్నారు. ఎలాంటి పిచ్‌పై అయినా రాణిస్తారు. జట్టు విజయాల్లోనూ కీలక పాత్ర పోషిస్తున్నారు.
స్టంప్స్ వెనక ధోనీ ఉండనే ఉన్నాడు. సందర్భానుసారంగా ఆడటం, మిడిల్ ఓవర్లలో పరుగులు నియంత్రించడం, క్లాస్ స్పిన్నర్లను వినియోగించుకోవడంలో మహీ దిట్ట.
అనుభవజ్ఞులైన ఆటగాళ్లు
జట్లన్నింటిలో సీఎస్కే అత్యంత అనుభవజ్ఞులైన ఆటగాళ్లున్న జట్టు. ఎలాంటి పరిస్థితులోనైనా ప్రత్యర్థిని దీటుగా ఎదుర్కోగల సామర్థ్యం ఉంది. కాబట్టి ట్రోఫీని గెలుచుకునేందుకు వీరందరూ ఉండటం కలిసొచ్చే అంశం.
-
Vaathi Coming... #WhistlePodu #HappyTeachersDay @msdhoni 🦁💛 pic.twitter.com/thbXHrgoYC
— Chennai Super Kings (@ChennaiIPL) September 5, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Vaathi Coming... #WhistlePodu #HappyTeachersDay @msdhoni 🦁💛 pic.twitter.com/thbXHrgoYC
— Chennai Super Kings (@ChennaiIPL) September 5, 2020Vaathi Coming... #WhistlePodu #HappyTeachersDay @msdhoni 🦁💛 pic.twitter.com/thbXHrgoYC
— Chennai Super Kings (@ChennaiIPL) September 5, 2020
బలహీనతలు
సీఎస్క్కు పేస్ విభాగం ఓ సమస్య అని చెప్పుకోవచ్చు. ఈ ఐపీఎల్ వేలంలో సామ్ కరన్(ఇంగ్లాండ్) , జోష్ హేజిల్‌వుడ్‌ను(ఆస్ట్రేలియా) కొనుగోలు చేసింది. కరన్ టోర్నీలో బాగా ఆడుతాడని భావిస్తున్నప్పటికీ, హేజిల్‌వుడ్ ప్రదర్శనపై అనుమానాలు ఉన్నాయి.
దీపక్ చాహర్.. నిలకడగా రాణిస్తున్న బౌలర్. లాక్డౌన్ వల్ల దాదాపు ఐదునెలలు ఆటకు దూరమయ్యాడు. కరోనా సోకడం వల్ల ప్రస్తుతం క్వారంటైన్లో ఉన్నాడు. ఫలితంగా ఐపీఎల్ ప్రాక్టీసుకు దూరమయ్యాడు. ఈ ప్రభావం టోర్నీలో అతడి ప్రదర్శనపై చూపిస్తే ఇబ్బందులే.
డ్వేన్ బ్రావో (వెస్డిండీస్).. టీ20 చరిత్రలో 500 వికెట్లు తీసిన తొలి బౌలర్‌గా రికార్డు సాధించాడు. డెత్ ఓవర్లలో అద్భుతంగా ఆడే బ్రావో.. వయసు కారణాల రీత్యా మంచి ప్రదర్శన ఇవ్వలేకపోవచ్చు. లుంగీ ఎంగిడిపైనా అంచనాలు తక్కువే.
కరోనాతో శిక్షణ కొరత.. రైనా స్థానంలో ఎవరు?
దుబాయ్ చేరుకున్న సీఎస్కేకు అడుఅడుగునా కష్టాలే. మూడో స్థానం బ్యాట్స్‌మన్ సురేశ్ రైనా ఈ సీజన్ నుంచి వైదొలిగాడు. దీంతో అతడిని ఎవరితో భర్తీ చేయాలనేది యాజమాన్యానికి తలనొప్పిగా మారింది. రుతురాజ్ గైక్వాడ్, వికెట్ కీపర్ ఎన్ జగదీశన్ పేర్లను పరిశీలిస్తోంది.
ఏదేమైనప్పటికీ జట్లన్నీ ప్రాక్టీసు మొదలుపెట్టేసినా.. కరోనా ప్రభావంతో సీఎస్కే మాత్రం క్వారంటైన్లో గడిపి, ఇటీవలే ప్రాక్టీసు ప్రారంభించింది.
ఫీల్డింగ్
చెన్నై సూపర్‌కింగ్స్‌కు మరో అతిపెద్ద సమస్య ఫీల్డింగ్. జట్టులో వయసు పైబడినవారు ఎక్కువగా ఉండటం వల్ల క్యాచులు పట్టేందుకు.. వీరి ఇబ్బంది పడొచ్చు. గతంలో టీమ్ఇండియాకు ఆడినప్పుడు సచిన్, సెహ్వాగ్‌లను ఇదే కారణంతో పక్కన పెట్టాడు ధోనీ. మరి ప్రస్తుతమున్న షేన్ వాట్సన్, కేదర్ జాదవ్ లాంటి సీనియర్లతో ఫీల్డింగ్ బృందాన్ని ఎలా నడిపిస్తాడో చూడాలి.
అవకాశాలు
ఈ సీజన్ నుంచి సురేశ్ రైనా, హర్భజన్ సింగ్ తప్పుకున్నప్పటికీ.. ఆ స్థానాలను మెరుగైన ఆటగాళ్లతో భర్తీ చేసేందుకు సీఎస్కేకు మంచి అవకాశాలున్నాయి. అంబటిరాయుడు, మురళీ విజయ్ను, డు ప్లెసిస్ వీరిలో ఎవరినైనా తీసుకుంటే జట్టుకు కలిసిరావొచ్చు.
యువఆటగాళ్లకు అవకాశం కల్పించాలి..
గత కొన్ని సీజన్ల్ నుంచి సీఎస్కే.. తమ జట్టులో యువ ఆటగాళ్లకు అవకాశం కల్పించడంపై దృష్టి సారించలేదు. ప్రస్తుత సీజన్ కోసం యువ ఆటగాళ్లను జట్టులోకి తీసుకోవడంపై దృష్టి పెట్టాలి. తద్వారా నూతనోత్సాహం వస్తుంది.
ప్రమాదాలు
లాక్‌డౌన్‌తో ఆటగాళ్లు చాలాకాలం నుంచి ఆటకు దూరంగా ఉన్నారు. ఐపీఎల్ కోసం మిగతా జట్లన్నీ క్వారంటైన్‌ను పూర్తి చేసుకుని శిక్షణ ప్రారంభించాయి. సీఎస్కేలో మాత్రం ఆలస్యంగా మొదలుపెట్టింది. దీంతో ఆటగాళ్లకు ప్రాక్టీస్ కొరత ఏర్పడి, మెరుగైన ప్రదర్శన కనబరచకపోవచ్చని క్రీడా విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు. మరి ఈ ప్రభావం టోర్నీపై ఎలా ఉంటుందో చూడాలి.
మరోవైపు ఆటగాళ్లందరూ అనుభవజ్ఞులైనప్పటికీ వయసుపైబడటం వల్ల.. వారి శరీరం అన్ని విధాల సహకరించకపోవచ్చు. ఆడేటప్పుడు ఏదైనా గాయమైతే అది ప్రమాదకరంగా మారొచ్చు. జాదవ్‌కు మోకాలు వెనుక భాగంలో దెబ్బతగలడం వల్ల ఇంకా కోలుకోలేదు. డ్వేన్ బ్రావో, షేన్ వాట్సన్ కూడా చిన్న చిన్న గాయాలై కోలుకున్నారు. కాబట్టి ఈ టోర్నీలో వీరు చాలా జాగ్రత్తగా ఆడాల్సి ఉంటుంది.