ETV Bharat / sports

ధోనీ లేకుండా బ్రాడ్ హాగ్ ఐపీఎల్ జట్టు - రస్సెల్​

ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​ ఈ ఏడాది ఐపీఎల్​లో అత్యుత్తమ ఆటగాళ్లతో ఓ జట్టును ప్రకటించాడు. అయితే, ఇందులో ధోనీకి చోటు కల్పించకపోవడం గమనార్హం.

Brad Hogg
బ్రాడ్​ హాగ్​
author img

By

Published : Sep 14, 2020, 4:16 PM IST

ఐపీఎల్​ ప్రారంభానికి ఇంకా ఐదురోజులు మాత్రమే ఉంది. ఈ క్రమంలోనే మాజీ క్రికెటర్లు, ఇతర క్రికెట్​ నిపుణులు ఈ సీజన్​లో సత్తాచాటబోయే ఆటగాళ్ల గురించి అనేక విశ్లేషణలు చేస్తున్నారు. కొంత మంది మాజీలు లీగ్​లో తమ బెస్ట్​ ఎలెవెన్​ను ప్రకటించారు. ఇప్పుడు ఆస్ట్రేలియా మాజీ స్పిన్నర్​ బ్రాడ్​ హాగ్​ కూడా తన ఐపీఎల్​ టీమ్​ను రూపొందించాడు. ఆశ్చర్యకరంగా ఇందులో టీమ్​ఇండియా మాజీ కెప్టెన్​ ధోనీని ఎంపిక చేయలేదు.

ప్రపంచ వ్యాప్తంగా ఉన్న క్రికెట్ అభిమానులు.. ఈ లీగ్​లో ధోనీ ఆటను చూసేందుకు ఉత్సాహంగా ఎదురు చూస్తున్నారు. ఇర్ఫాన్​ పఠాన్​, ఆకాశ్​ చోప్రా వంటి కొంతమంది మాజీ క్రికెటర్లు కూడా యూఏఈ వేదికగా జరిగే టోర్నీలో మాహీ అదరగొడతాడని ఆశిస్తున్నట్లు పేర్కొన్నారు. అయితే, బ్రాడ్​ హాగ్​ ఇందుకు భిన్నంగా ఆలోచించాడు. అంతేకాదు, తన ఉత్తమ ఐపీఎల్​ జట్టులో డివిలియర్స్​, క్రిస్​ గేల్​ను కూడా ఎంపిక చేయలేదు.

kohli
కోహ్లీ

ఈ ఎలెవెన్​ టీమ్​కు కెప్టెన్​గా కేన్​ విలియమ్సన్​ను ప్రకటించాడు హాగ్. వీరితో పాటు, ముంబయి ఇండియన్స్​ కెప్టెన్​ రోహిత్​ శర్మ, సన్​రైజర్స్ హైదరాబాద్​ సారథి డేవిడ్​ వార్నర్​లను ఓపెనర్​లుగా నియమించాడు. కోహ్లీకి మూడో స్థానం కల్పించగా.. కేన్​ విలియమ్సన్​ను నాలుగో ఆటగాడిగా పేర్కొన్నాడు. పంత్​ ఐదో ఆటగాడిగా, వికెట్​ కీపర్​గానూ జట్టులో స్థానం దక్కించుకున్నాడు. ఇక ఆల్​ రౌండర్లుగా ఆండ్రూ రసెల్​, సునీల్​ నరైన్​, రవీంద్ర జడేజాలను ఎంపిక చేశాడు. బౌలర్లుగా భువనేశ్వర్​ కుమార్​, యుజ్వేంద్ర చాహల్​, జస్ప్రీత్​ బుమ్రాలను ఎంచుకున్నాడు.

rohit sharma
రోహిత్ శర్మ

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.