ETV Bharat / sports

'అడ్డంకులన్నీ తొలగిపోతే.. ఐపీఎల్​కు నేను సిద్ధం'

author img

By

Published : Jul 22, 2020, 7:37 PM IST

ఈ ఏడాది టీ20 ప్రపంచకప్​ వాయిదా పడిన నేపథ్యంలో.. క్రికెటర్లందరి దృష్టి ఐపీఎల్​పై నెలకొంది. తాజాగా ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​ మ్యాక్స్​వెల్​ ఈ లీగ్​పై ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.

maxwell
గ్లెన్​ మ్యాక్స్​వెల్

ఐపీఎల్​ నిర్వహణకు అన్ని అడ్డంకులు తొలగిపోతే తాను లీగ్​లో ఆడేందుకు సిద్ధంగా ఉన్నట్లు ఆస్ట్రేలియా ఆల్​రౌండర్​ గ్లెన్​​ మ్యాక్స్​వెల్​ అన్నాడు. ఇటీవలే టీ20 ప్రపంచకప్​ వాయిదా పడటం వల్ల.. లీగ్ జరిపేందుకు ప్రణాళికలు రచిస్తోంది బీసీసీఐ. ఈ క్రమంలోనే క్రికెటర్లందరి దృష్టి ఈ లీగ్​పైనే నెలకొంది. కరోనా సోకకుండా వైద్య సంరక్షణ పరమైన అన్ని జాగ్రత్తలు తీసుకుంటే.. తాను ఈ ఐపీఎల్​​లో పాల్గొనేందుకు ఆసక్తి చూపుతున్నట్లు గ్లెన్​ పేర్కొన్నాడు.

"ప్రస్తుతం మనం వేచి చూడాల్సిందే. ప్రయాణ సదుపాయాలు, క్వారంటైన్​ సమయం తదితర విషయాలన్నింటిపై ఓ స్పష్టత కావాలి. సమస్యలన్నింటికీ పరిష్కారం చూపగలిగితే నేను ఐపీఎల్​ ఆడేందుకు సిద్ధంగా ఉన్నా. విదేశీ ఆటగాళ్లు అందులో ఆడుతున్నారు. ఈ లీగ్​ను అందరూ ప్రపంచ కప్​ మాదిరిగానే భావిస్తున్నారు."

-గ్లెన్​ మ్యాక్స్​వెల్​, ఆస్ట్రేలియా క్రికెటర్.

కింగ్స్ ఎలెవన్​ పంజాబ్​ తరఫున ఈ ఏడాది జరిగే ఐపీఎల్​లో గ్లెన్​ ఆడాల్సింది. అయితే కరోనా కారణంగా లీగ్​ను నిరవధిక వాయిదా వేశారు. ప్రస్తుతం టీ20 ప్రపంచకప్ వచ్చే ఏడాదికి వాయిదా పడటం వల్ల అక్టోబర్-నవంబర్​లో ఈ లీగ్ నిర్వహణకు సన్నాహాలు చేస్తోంది బీసీసీఐ. ​

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.