ఐపీఎల్లో పాల్గొనేందుకు మహేంద్రసింగ్ ధోనీ ఆగస్టు 14న చెన్నైకి చేరుకున్నాడు. ఆగస్టు 15 నుంచి సీఎస్కే శిక్షణా శిబిరంలో ప్రారంభమయ్యే ఐదు రోజుల ప్రీ సెషన్లో పాల్గొననున్నాడు. మహీతో పాటు సీఎస్కే జట్టు ఆటగాళ్లు సురేశ్ రైనా, కరణ్ శర్మ, దీపక్ చాహర్, పియూష్ చావ్లా కూడా చెన్నైకి చేరుకున్నారు. ఖాళీ స్డేడియంలోనే ఆటగాళ్లు శిక్షణ ప్రారంభించనున్నారు.
ఇప్పటికే వీరందరూ చెన్నైకి చేరుకునేముందు కరోనా పరీక్షలు చేయించుకున్నారు. ఆ వైద్య పరీక్షల్లో నెగెటివ్ వచ్చినట్లు సీఎస్కే ఫ్రాంచైజీ తెలిపింది. యూఈఏ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు.. బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ జరగనుంది.
ధోనీ రీఎంట్రీ
గతేడాది ప్రపంచకప్‌లో చివరగా బరిలోకి దిగిన ధోనీ.. ఆ తర్వాత మైదానంలో అడుగుపెట్టలేదు. ఐపీఎల్‌తో మళ్లీ ఎంట్రీ ఇస్తాడని అనుకున్నారు. అయితే మార్చిలో కరోనా రావడం, లీగ్ నిరవధిక వాయిదా పడటం, టీ20 ప్రపంచకప్ రద్దు.. ఇలా చాలానే అనుకోని సంఘటనలు జరిగాయి. దీంతో మహీ కెరీర్ సందిగ్ధంలో పడింది. అయితే యూఏఈ వేదికగా ఐపీఎల్ నిర్వహణకు ఇటీవల బీసీసీఐ గ్రీన్‌సిగ్నల్ ఇవ్వగా.. ధోనీ మళ్లీ మైదానంలో కనువిందు చేయనున్నాడు. ఈ లీగ్ ప్రదర్శనతో టీమ్ఇండియాలోకి మహీ రీఎంట్రీ ఇస్తాడని అభిమానులు ఆశిస్తున్నారు.
ఇదీ చూడండి ఇటాలియన్ ఓపెన్ టెన్నిస్ షెడ్యూల్ ఇదే