దుబాయ్ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు బయోసెక్యూర్ వాతావరణంలో ఐపీఎల్ 13వ సీజన్ జరగనుంది. అయితే ఈ మెగా లీగ్‌లో దిల్లీ క్యాపిటల్స్‌కు ప్రాతినిధ్యం వహించాల్సిన ఇంగ్లాండ్ క్రికెటర్ క్రిస్ వోక్స్ అందుబాటులో ఉండట్లేదు. భవిష్యత్త్ టోర్నీల మీద దృష్టి సారించేందుకు ఈ లీగ్ నుంచి తప్పుకుంటున్నట్లు తెలిపాడు. అయితే అతడి స్థానంలోకి దక్షిణాఫ్రికా పేసర్ ఎన్రిచ్ నోర్జ్టేను తీసుకుంది జట్టు యాజమాన్యం. ఈ విషయాన్ని దిల్లీ ఫ్రాంచైజీ స్పష్టం చేసింది.
-
And we can't wait to watch you steam in and let it rip 🔥
— Delhi Capitals (Tweeting from 🏠) (@DelhiCapitals) August 18, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
Welcome to the Capitals, @AnrichNortje02 🙌🏻#WelcomeAnrich#IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/ZyoPm0Cw5v
">And we can't wait to watch you steam in and let it rip 🔥
— Delhi Capitals (Tweeting from 🏠) (@DelhiCapitals) August 18, 2020
Welcome to the Capitals, @AnrichNortje02 🙌🏻#WelcomeAnrich#IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/ZyoPm0Cw5vAnd we can't wait to watch you steam in and let it rip 🔥
— Delhi Capitals (Tweeting from 🏠) (@DelhiCapitals) August 18, 2020
Welcome to the Capitals, @AnrichNortje02 🙌🏻#WelcomeAnrich#IPL2020 #YehHaiNayiDilli pic.twitter.com/ZyoPm0Cw5v
ఈ లీగ్‌లో ఆడేందుకు తానెంతో ఉత్సాహంగా ఎదురుచూస్తున్నట్లు తెలిపాడు ఎన్రిచ్. గతేడాది ఇతడు కోల్‌కతా నైట్‌రైడర్స్ తరఫున ఐపీఎల్లో అరంగేట్రం చేయాల్సి ఉండగా.. భుజం గాయం వల్ల దూరమయ్యాడు.
2019లో భారత్‌తో తొలి టెస్టు మ్యాచు ఆడాడు ఎన్రిచ్. మొత్తంగా ఆరు టెస్టులు(19 వికెట్లు), ఏడు వన్డేలు(14 వికెట్లు), మూడు టీ20(2 వికెట్లు) ఆడాడు.
ఇది చూడండి ఐపీఎల్ స్పాన్సర్‌గా 'డ్రీమ్ ఎలెవన్' ఖరారు