ఐపీఎల్ ఫ్రాంచైజీ దిల్లీ క్యాపిటల్స్ బౌలింగ్ కోచ్‌గా ఆస్ట్రేలియా మాజీ పేసర్ రియాన్ హ్యారిస్‌ను ఎంపిక చేసింది జట్టు యాజమాన్యం. గత రెండు సీజన్లలో క్యాపిటల్స్ జట్టుకు జేమ్స్ హోప్స్ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు. ఇప్పుడు అతని స్థానంలో హ్యారిస్‌ను ఎంపిక చేశారు. అయితే, వ్యక్తిగత కారణాల వల్ల ఈ ఏడాది జట్టుకు దూరంగా ఉండనున్నాడు.
"ఐపీఎల్‌లోకి తిరిగి అడుగుపెట్టడం చాలా ఆనందంగా ఉంది. ట్రోఫీని సొంతం చేసుకోవాలన్న దిల్లీ క్యాపిటల్స్ ఆశయాలను నెరవేర్చేందుకు నాకు ఇదొక గొప్ప అవకాశం. జట్టులో అద్భుతమైన బౌలర్లు ఉన్నారు. వారితో కలిసి పని చేసేందుకు చాలా ఆసక్తిగా ఉన్నా".
రియాన్ హ్యారిస్, ఆస్ట్రేలియా మాజీ పేసర్
రియాన్ హ్యారిస్ తన కెరీర్ మొత్తంగా టెస్టుల్లో 113 వికెట్లు, వన్డేల్లో 44, టీ20ల్లో 4 వికెట్ల చొప్పున పడగొట్టాడు. గాయాల కారణంగా 2015లో రిటైర్మెంట్ ప్రకటించాల్సి వచ్చింది. అప్పటి నుంచి హ్యారిస్ ఆస్ట్రేలియా జట్టు, బిగ్‌బాష్ లీగ్ జట్టు బ్రిస్బేన్ హీట్‌కు కోచ్‌గా బాధ్యతలు నిర్వర్తిస్తున్నాడు. గతంలో కింగ్స్ ఎలెవెన్ పంజాబ్‌కూ బౌలింగ్ కోచ్‌గా వ్యవహరించాడు.