ETV Bharat / sports

స్పెయిన్​ ల్యాబ్‌లో క్రికెటర్ల నమూనాల పరీక్ష.. - IPL 2020 latest news in doping

ఐపీఎల్​ ప్లేయర్లకు సెప్టెంబర్​ 19 నుంచి డోపింగ్​ పరీక్షలు నిర్వహించనుంది నాడా. మొత్తం మూడు విడతల్లో నవంబర్​ 10 వరకు పరీక్షలు చేయనున్నారు. వాటిని స్పెయిన్​లోని బార్సిలోనా ల్యాబ్​కు పంపనున్నారు.

dopina latest news
స్పెయిన్​ ల్యాబ్‌లో క్రికెటర్ల నమూనాల పరీక్ష..!
author img

By

Published : Sep 13, 2020, 9:06 AM IST

నేషనల్​ డోప్​ టెస్టింగ్​ ల్యాబొరేటరీ(ఎన్​డీటీఎల్)పై నిషేధం కొనసాగుతున్న నేపథ్యంలో కీలక నిర్ణయం తీసుకుంది జాతీయ డోపింగ్ నిరోధక​ సంస్థ(నాడా). ఐపీఎల్‌ సందర్భంగా క్రికెటర్ల నుంచి సేకరించే డోప్‌ నమూనాలను స్పెయిన్​లోని బార్సిలోనా ల్యాబ్‌లో పరీక్షించనున్నారు.

తొలిసారి..

ఎన్​డీటీఎల్​పై వేటు తర్వాత ఎప్పుడూ ఖతార్​లోని దోహా ల్యాబ్​కే నమూనాలు పంపించేంది బీసీసీఐ. అయితే తొలిసారి బార్సిలోనా క్లబ్​కు చెందిన​ కాటలోనియన్‌ యాంటీ డోపింగ్‌ ల్యాబొరేటరీ తెరపైకి వచ్చింది. యూఏఈ నేషనల్​ యాంటీ డోపింగ్​ ఆర్గనైజేషన్​(నాడో) నిబంధనల మేరకే ఈ కొత్తల్యాబ్​ను ఎంచుకున్నారట. ఇందువల్ల బీసీసీఐపై భారీగానే భారం పడనుంది. దోహా ల్యాబ్​లో మూత్ర నమూనాలు పరీక్షించేందుకు ఒక్కో శాంపిల్​కు 120 డాలర్లు ఖర్చయితే.. బార్సిలోనా ల్యాబ్​లో దానికి దాదాపు 10 రెట్లు చెల్లించాలట.

ఆటగాళ్ల మూత్ర నమూనాలు తీసుకునే డీసీఓల.. ప్రయాణాలు, వారి ఆతిథ్యం కోసం ఐపీఎల్​ నిర్వాహకులు లక్షలు ఖర్చుపెట్టనున్నారు. మొత్తం ఐదుగురు అధికారులు చొప్పున మూడు బృందాలు టెస్టులు నిర్వహిస్తాయి. సెప్టెంబర్​ 19 నుంచి నవంబర్​ 10 మధ్య మూడు విడతల్లో పరీక్షలు చేయనున్నారు. ఇందుకోసం ఆతిథ్య దేశంలో ప్రత్యేకంగా 5 డోపింగ్​ నియంత్రణ కేంద్రాలను ఏర్పాటు చేయనున్నారు.

మ్యాచ్​లు జరిగే దుబాయ్​, షార్జా, అబుదాబి స్డేడియాల్లో ముూడు కేంద్రాలు, ఆటగాళ్లు సాధన చేసే ఐసీసీ అకాడమీ, జాయెద్​ క్రికెట్​ స్టేడియాల్లో మిగతా రెండు కేంద్రాలు ఉంటాయి.​ వీటిల్లో విరాట్​, ధోనీ, రోహిత్​ వంటి స్టార్​ క్రికెటర్లు సహా మొత్తం 50 మంది శాంపిల్స్​ తీసుకుంటారు. సెప్టెంబర్​ 19 నుంచి ఐపీఎల్​ మొదలుకానుంది.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.