దేశంలో కొవిడ్-19 తగ్గుముఖం పట్టిన తర్వాత ఐపీఎల్ నిర్వహించాలని భారత క్రికెట్ నియంత్రణ మండలి యోచిస్తోంది. సెప్టెంబరు 25 నుంచి నవంబరు 1 మధ్య టోర్నీ జరిపే విషయాన్ని పరిశీలిస్తున్నట్లు సమాచారం. దేశంలో కరోనా కేసులు అప్పటికి తగ్గుముఖం పట్టవచ్చనే ఆశాభావంతో ఈ నిర్ణయానికి వచ్చింది. అయితే దీనితో పాటు అనేక విషయాలపై త్వరలో చర్చించనుంది బీసీసీఐ.
ఈ విషయంపై ఓ ఐపీఎల్ ఫ్రాంచైజీ అధికారి మాట్లాడుతూ .."అవును, మేము ఈ తేదీలపై దృష్టిసారించాం. కానీ, అదంతా దేశంలో కరోనా పరిస్థితిపై ఆధారపడి ఉంటుంది. అయితే దేశంలో కేసుల సంఖ్య త్వరలోనే తగ్గుముఖం పట్టొచ్చని ఆశిస్తున్నాం" అని తెలిపాడు.
ప్రణాళిక ప్రకారం టీ20 ప్రపంచకప్‌ను ఆస్ట్రేలియాలో అక్టోబర్ 18 నుంచి నవంబర్ 15 వరకు నిర్వహించాల్సి ఉంది. కానీ, ఇలాంటి పరిస్థితిలో టోర్నీని యథావిధిగా నిర్వహించడమనేది అసాధ్యమని ఆసీస్ క్రీడాకారులు అభిప్రాయపడుతున్నారు. దీంతో ఒకవేళ ఈ టోర్నీ వాయిదా పడితే ఇదే సమయంలో ఐపీఎల్ నిర్వహించవచ్చని బీసీసీఐ ఆలోచిస్తోంది.
ఇదీ చూడండి.. తారక్‌కు వార్నర్ 'పక్కా లోకల్' గిఫ్ట్