ETV Bharat / sports

దుబాయ్​ ఎయిర్​లైన్స్​తో బీసీసీఐ చర్చలు

దుబాయ్​లో ఐపీఎల్ నిర్వహించే యోచనలో ఉన్న బీసీసీఐ.. ఆటగాళ్ల ప్రయాణాలపై ఆ దేశ ఎయిర్​లైన్స్​ అధికారులతో చర్చలు జరుపుతోంది. ఈ విషయాన్ని బోర్డు సన్నిహిత వర్గాలు స్పష్టం చేశాయి.

ipl
ఐపీఎల్​
author img

By

Published : Jul 23, 2020, 8:17 PM IST

ఇండియన్​ ప్రీమియర్​ లీగ్​(ఐపీఎల్​) 13వ సీజన్​​ నిర్వహణకు బీసీసీఐ సన్నాహాలు ముమ్మరం చేసింది. అందుకోసం ప్రణాళికలను కూడా సిద్ధం చేస్తోంది. ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో జరగాల్సిన టీ20 ప్రపంచకప్​ను ఇటీవల ఐసీసీ వాయిదా వేయడం వల్ల... ఆ సమయంలోనే ఐపీఎల్​ను​ దుబాయ్​లో నిర్వహించాలని భారత బోర్డు యోచిస్తోంది.

ఈ నేపథ్యంలోనే ఆటగాళ్ల ప్రయాణాలపై యూఏఈ ఎయిర్​లైన్స్​ అధికారులతో చర్చలు జరుపుతోందని తెలుస్తోంది. ఈ విషయాన్ని బోర్డు సన్నిహిత వర్గాలు తెలిపాయి. తుది నిర్ణయాన్ని ఐపీఎల్​ గవర్నింగ్​ కౌన్సిల్​ సమావేశం జరిగాక అధికారికంగా ప్రకటించనున్నారు.

" భారత్​లోని దిల్లీ, ముంబయి, కోల్​కతా వంటి మహా నగారాల్లో తమ సేవలు ఎప్పుడు పునః ప్రారంభించనున్నాయో సహా పలు విషయాలపై యూఏఈ విమానాశ్రయ అధికారులతో బీసీసీఐ చర్చలు జరుపుతోంది. ఒకవేళ ఇది జరగకపోతే.. మరోవైపు ఫ్రాంచైజీలు చార్టెడ్​ విమానాల ద్వారా తమ ఆటగాళ్లను తీసుకెళ్లాలని యోచిస్తున్నాయి. ఇప్పటికే బస చేసేందుకు ఆ దేశంలోని కొన్ని హోటల్​ యాజామాన్యాలతోనూ ప్యాకేజీల గురించి జట్ల యాజమాన్యాలు చర్చిస్తున్నాయి".

-బీసీసీఐ సన్నిహిత వర్గాలు.

భారత ప్రభుత్వం నుంచి గ్నీన్​ సిగ్నల్​ రాగానే ఐపీఎల్​ను సెప్టెంబరు 26 నుంచి నవంబరు 8 వరకు జరపాలని బీసీసీఐ షెడ్యూల్​ సిద్ధం చేసింది.

ఇది చూడండి : ఒకే పిచ్​పై ఇద్దరు విరాట్​ కోహ్లీలు.. అదెలా సాధ్యం?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.