క్రికెట్ అభిమానులంతా ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్న ఐపీఎల్ కొద్దిరోజుల్లో మొదలుకానుంది. అయితే కరోనా ప్రభావం వల్ల భారత్ బదులు యూఏఈలో నిర్వహించనున్నారు. ఫ్రాంచైజీలన్నీ ఇప్పటికే దుబాయ్ చేరుకుని, హోటళ్లలో క్వారంటైన్లో ఉన్నారు. విదేశాల్లో లీగ్ జరగనుండటం ఇది మూడోసారి. గతంలో లోక్‌సభ ఎన్నికలుండటం వల్ల దక్షిణాఫ్రికా(2009), యూఏఈ(2014)లో లీగ్ జరిపారు.
ప్రస్తుత సీజన్ 53 రోజుల పాటు సాగనుంది. గతేడాది ఫైనల్లో తలపడ్డ ముంబయి ఇండియన్స్, చెన్నై సూపర్ కింగ్స్ జట్లు ఈసారి సెప్టెంబరు 19న తొలిమ్యాచ్ ఆడనున్నాయి. ఈ క్రమంలోనే ఐపీఎల్-2020 ప్రారంభం నుంచి ముంగింపు వరకు ఎలా జరగనుంది. ఏఏ సమయాల్లో మ్యాచ్‌లు నిర్వహించనున్నారు. లాంటి ఆసక్తికర విషయాలు మీకోసం.
ఐపీఎల్‌ను ఎక్కడ నిర్వహిస్తారు?
యూఏఈ వేదికగా సెప్టెంబరు 19 నుంచి నవంబరు 10 వరకు ఐపీఎల్ నిర్వహించనున్నారు. దుబాయ్, షార్జా, అబుదాబీ మైదానాల్లో మ్యాచ్‌లు జరగనున్నాయి.
ఫ్రాంచైజీలన్నీ ఎప్పుడు యూఏఈకి వస్తాయి? వారి బసతో పాటు, ప్రాక్టీసు ఎక్కడ చేస్తారు?
మొత్తం ఎనిమిది ఫ్రాంచైజీలు ఇప్పటికే యూఏఈకి చేరుకున్నాయి. దుబాయ్, అబుదాబీలోని హోటళ్లలో గదులు బుక్ చేసుకుని వారు ఉన్నారు. ఈ సమయంలో ఆరురోజుల్లో మూడుసార్లు కరోనా పరీక్షలు చేస్తారు. అందులో నెగటివ్ వస్తేనే బయో బబుల్‌లోకి అనుమతిస్తారు.
తొలి మ్యాచ్ ఎప్పుడు?
సెప్టెంబరు 19న చెన్నై సూపర్ కింగ్స్-ముంబయి ఇండియన్స్ మధ్య తొలి మ్యాచ్ జరగనుంది.
ఫైనల్ మ్యాచ్?
టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శన చేసిన జట్లు.. నవంబరు 10న జరిగే ఫైనల్లో ట్రోఫీ కోసం తలపడనున్నాయి. అయితే ఈ మ్యాచ్‌ను(మంగళవారం) వారం మధ్యలో జరపడం ఇదే తొలిసారి.
మ్యాచ్‌లు నిర్వహించే సమయం?
మధ్యాహ్నం 3.30 గంటలు(యూఏఈ సమయం 2.00) రాత్రి 7.30 గంటలు(యూఏఈ సమయం 6.00).
చెన్నై సూపర్ కింగ్స్
గతేడాది రన్నరప్ గా నిలిచిన సీఎస్కే.. ఈ ఏడాది ప్రారంభ మ్యాచ్‌ల్లో సామ్ కరన్, జోష్ హేజిల్‌వుడ్‌లను మిస్ కానుంది. ప్రస్తుతం వారు తమ దేశం తరఫున అంతర్జాతీయ సిరీస్‌తో బిజీగా ఉన్నారు.
పేరు | జీతం |
ధోనీ | INR 150000000 |
సురేశ్ రైనా | INR 110000000 |
కేదార్ జాదవ్ | INR 78000000 |
రవీంద్ర జడేజా | INR 70000000 |
పియూష్ చావ్లా | INR 67500000 |
డ్వేన్ బ్రావో | INR 64000000 |
సామ్ కరన్ | INR 55000000 |
కర్ణ్ శర్మ | INR 50000000 |
షేన్ వాట్సన్ | INR 40000000 |
పేరు | జీతం |
శార్దూల్ ఠాకూర్ | INR 26000000 |
అంబటి రాయుడు | INR 22000000 |
హర్బజన్ సింగ్ | INR 20000000 |
మురళీ విజయ్ | INR 20000000 |
జోష్ హేజిల్‌వుడ్ | INR 20000000 |
డుప్లెసిస్ | INR 16000000 |
ఇమ్రాన్ తాహిర్ | INR 10000000 |
దీపక్ చాహర్ | INR 8000000 |
లుంగి ఎంగిడి | 5000000 |
పేరు | జీతం |
మిచెల్ సాంట్నర్ | INR 5000000 |
కేఎమ్ ఆసిఫ్ | INR 4000000 |
నారాయణ్ జగదీశన్ | INR 2000000 |
మోను కుమార్ | INR 2000000 |
రుతురాజ్ గైక్వాడ్ | INR 2000000 |
ఆర్. సాయి కిశోర్ | INR 2000000 |
దిల్లీ క్యాపిటల్స్
ఇంగ్లాండ్, ఆస్ట్రేలియా ద్వైపాక్షిక సిరీస్ కారణంగా.. ఈ ఏడాది దిల్లీ క్యాపిటల్స్.. అలెక్స్ క్యారీ, జేసన్ రాయ్, మార్కస్ స్టోయినిస్‌లు ప్రారంభ మ్యాచ్‌ల్లో మిస్ కానుంది.
పేరు | జీతం |
రిషబ్ పంత్ | INR 150000000 |
హెట్మెయిర్ | INR 77500000 |
రవిచంద్రన్ అశ్విన్ | INR 76000000 |
శ్రేయస్ అయ్యర్ | INR 70000000 |
అజింక్య రహానె | INR 52500000 |
శిఖర్ ధావన్ | INR 52000000 |
అక్సర్ పటేల్ | INR 50000000 |
మార్కస్ స్టోయినిస్ | INR 48000000 |
రబాడా | INR 42000000 |
పేరు | జీతం |
అమిత్ మిశ్రా | INR 40000000 |
అలెక్స్ క్యారీ | INR 24000000 |
జేసన్ రాయ్ | INR 15000000 |
క్రిస్ వోక్స్ | INR 15000000 |
పృథ్వీ షా | INR 12000000 |
ఇషాంత్ శర్మ | INR 11000000 |
అవేశ్ ఖాన్ | INR 7000000 |
కీమో పాల్ | INR 5000000 |
మోహిత్ శర్మ | INR 5000000 |
పేరు | జీతం |
హర్షల్ పటేల్ | INR 2000000 |
సందీప్ లమిచానె | INR 2000000 |
తుషార్ దేశ్‌పాండే | INR 2000000 |
లలిత్ యాదవ్ | INR 2000000 |
రాజస్థాన్ రాయల్స్
2008లో ఐపీఎల్ ఛాంపియన్‌గా నిలిచిన రాజస్థాన్ రాయల్స్.. ఈసారి జోఫ్రా ఆర్చర్, జోస్ బట్లర్, టామ్ కరన్, స్టీవ్ స్మిత్, బెన్ స్టోక్స్ లాంటి ఆటగాళ్లు లేకుండానే లీగ్ ప్రారంభించనుంది.
పేరు | జీతం |
బెన్ స్టోక్స్ | INR 125000000 |
స్టీవ్ స్మిత్ | INR 125000000 |
సంజు శాంసన్ | INR 80000000 |
జోఫ్రా ఆర్చర్ | INR 72000000 |
జోస్ బట్లర్ | INR 44000000 |
అంకిత్ రాజ్‌పుత్ | INR 30000000 |
రాహుల్ తెవాటియా | INR 30000000 |
రాబిన్ ఊతప్ప | INR 30000000 |
జయదేవ్ ఉనద్కత్ | INR 30000000 |
పేరు | జీతం |
వరుణ్ ఆరోన్ | INR 24000000 |
యశస్వి జైస్వాల్ | INR 24000000 |
మయాంక్ మార్కండే | INR 20000000 |
కార్తిక్ త్యాగి | INR 13000000 |
టామ్ కరన్ | INR 10000000 |
ఆండ్రూ టై | INR 10000000 |
అనుజ్ రావత్ | INR 8000000 |
డేవిడ్ మిల్లర్ | INR 7500000 |
ఒషానే థామస్ | INR 5000000 |
పేరు | జీతం |
శషాంక్ సింగ్ | INR 3000000 |
మహిపాల్ లోమ్రర్ | INR 2000000 |
మనన్ వోహ్రా | INR 2000000 |
రియాన్ పరాగ్ | INR 2000000 |
శ్రేయస్ గోపాల్ | INR 2000000 |
అనిరుధ్ జోషి | INR 2000000 |
ఆకాశ్ సింగ్ | INR 2000000 |
ముంబయి ఇండియన్స్
గతేడాది విజేతగా నిలిచిన ముంబయి జట్టు.. తమ ఓపెనర్ క్రిస్ లిన్, పేసర్ నాథన్ కౌల్టర్‌నైల్ లేకుండానే బరిలో దిగనుంది.
పేరు | ఐపీఎల్ 2020 జీతం |
రోహిత్ శర్మ | INR 150000000 |
హార్ధిక్ పాండ్య | INR 110000000 |
కృనాల్ పాండ్య | INR 88000000 |
నాథన్ కౌల్టర్ నైల్ | INR 80000000 |
జస్ప్రీత్ బుమ్రా | INR 70000000 |
ఇషాన్ కిషన్ | INR 62000000 |
కీరన్ పొలార్డ్ | INR 54000000 |
సూర్యకుమార్ యాదవ్ | INR 32000000 |
ట్రెంట్ బౌల్ట్ | INR 32000000 |
పేరు | జీతం |
క్విెంటన్ డి కాక్ | INR 28000000 |
మలింగ | INR 20000000 |
రూథర్‌ఫర్డ్ | INR 20000000 |
క్రిస్ లిన్ | INR 20000000 |
రాహుల్ చాహర్ | INR 19000000 |
మిచెల్ మెక్లెనగన్ | INR 10000000 |
అనుమోల్‌ప్రీత్ సింగ్ | INR 8000000 |
కులకర్ణి | INR 7500000 |
జయంత్ యాదవ్ | INR 5000000 |
పేరు | జీతం |
సౌరభ్ తివారీ | INR 5000000 |
ఆదిత్య తారే | INR 2000000 |
అనుకుల్ రాయ్ | INR 2000000 |
దిగ్విజయ్ దేశ్‌ముఖ్ | INR 2000000 |
ప్రిన్స్ బల్వంత్ రాయ్ సింగ్ | INR 2000000 |
మోసిన్ ఖాన్ | INR 2000000 |
కింగ్స్ ఎలెవెన్ పంజాబ్
గ్లెన్ మ్యాక్స్‌వెల్, క్రిస్ జోర్డాలను లీగ్ ప్రారంభ వారంలో కింగ్స్ ఎలెవన్ పంజాబ్ మిస్ కానుంది.
పేరు | జీతం |
లోకేశ్ రాహుల్ | INR 110000000 |
గ్లెన్ మ్యాక్స్‌వెల్ | INR 107500000 |
షెల్డన్ కాట్రెల్ | INR 85000000 |
కృష్ణప్ప గౌతమ్ | INR 62000000 |
కరుణ్ నాయర్ | INR 56000000 |
మహ్మద్ షమి | INR 48000000 |
నికోలస్ పూరన్ | INR 42000000 |
ముజీబర్ రెహ్మాన్ | INR 40000000 |
క్రిస్ జోర్డాన్ | INR 30000000 |
పేరు | జీతం |
క్రిస్ గేల్ | INR 20000000 |
రవి బిష్ణోయ్ | INR 20000000 |
మన్దీప్ సింగ్ | INR 14000000 |
మయాంక్ అగర్వాల్ | INR 10000000 |
హార్డస్ వెజోలిన్ | INR 7500000 |
ప్రభుసిమ్రాన్ సింగ్ | INR 5500000 |
దీపక్ హుడా | INR 5000000 |
జిమ్మీ నీషమ్ | INR 5000000 |
దర్శన్ నల్కండే | INR 3000000 |
పేరు | జీతం |
సర్ఫరాజ్ ఖాన్ | INR 2500000 |
అర్ష్‌దీప్ సింగ్ | INR 2000000 |
హర్‌ప్రీత్ బ్రార్ | INR 2000000 |
జగదీశ్ సుచిత్ | INR 2000000 |
మురుగన్ అశ్విన్ | INR 2000000 |
తాజిందర్ సింగ్ | INR 2000000 |
ఇషాన్ పొరెల్ | INR 2000000 |
కోల్‌కతా నైట్ రైడర్స్
రెండుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన కేకేఆర్.. కమ్మిన్స్, క్రిస్ గ్రీన్, హ్యారీ గుర్ని, టామ్ బాంటన్ లేకుండానే టోర్నీ ప్రారంభించనుంది.
పేరు | జీతం |
కమ్మిన్స్ | INR 155000000 |
సునీల్ నరైన్ | INR 125000000 |
ఆండ్రూ రస్సెల్ | INR 85000000 |
దినేశ్ కార్తిక్ | INR 74000000 |
కుల్దీప్ యాదవ్ | INR 58000000 |
ఇయాన్ మోర్గాన్ | INR 52500000 |
వరుణ్ చక్రవర్తి | INR 40000000 |
నితీశ్ రానా | INR 34000000 |
కమలేశ్ నాగర్కోటి | INR 32000000 |
పేరు | జీతం |
శివమ్ మావి | INR 30000000 |
శుభ్‌మన్ గిల్ | INR 18000000 |
ల్యూక్ ఫెర్గూసన్ | INR 16000000 |
టామ్ బాంటన్ | INR 10000000 |
రింకూ సింగ్ | INR 8000000 |
హ్యారీ గర్నీ | INR 7500000 |
రాహుల్ త్రిపాఠి | INR 6000000 |
ప్రసిద్ధ్ కృష్ణ | INR 2000000 |
సందీప్ వారియర్ | INR 2000000 |
పేరు | జీతం |
సిద్ధేశ్ లాడ్ | INR 2000000 |
క్రిస్ గ్రీన్ | INR 2000000 |
నిఖిల్ నాయక్ | INR 2000000 |
ప్రవీణ్ తంబే | INR 2000000 |
మణిమారన్ సిద్ధార్థ్ | INR 2000000 |
రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు
కోహ్లీ నేతృత్వంలోని బెంగళూరు.. తొలి వారంలో మొయిన్ ఆలీ, ఆరోన్ ఫించ్, జోష్ ఫిలిప్, కేన్ రిచర్డ్స్‌లను కోల్పోనుంది. వీరంతా ఇంగ్లాండ్Xఆస్ట్రేలియా సిరీస్ జరిగిన తర్వాత ఆర్సీబీతో చేరతారు.
పేరు | జీతం |
విరాట్ కోహ్లీ | INR 170000000 |
ఏబీ డివిలియర్స్ | INR 110000000 |
క్రిస్ మోరిస్ | INR 100000000 |
యజ్వేంద్ర చాహల్ | INR 60000000 |
శివమ్ దూబె | INR 50000000 |
ఆరోన్ ఫించ్ | INR 44000000 |
ఉమేశ్ యాదవ్ | INR 42000000 |
కేన్ రిచర్డ్సన్ | INR 40000000 |
వాషింగ్టన్ సుందర్ | INR 32000000 |
పేరు | జీతం |
నవదీప్ సైనీ | INR 30000000 |
మహమ్మద్ సిరాజ్ | INR 26000000 |
డేల్ స్టెయిన్ | INR 20000000 |
మొయిన్ ఆలీ | INR 17000000 |
పార్థివ్ పటేల్ | INR 17000000 |
పవన్ నేగి | INR 10000000 |
గుర్కీరత్ మన్ సింగ్ | INR 5000000 |
ఇసురు ఉదాన | INR 5000000 |
దేవదత్ పడిక్కల్ | INR 2000000 |
పేరు | జీతం |
షాబాజ్ అహ్మద్ | INR 2000000 |
జాషువా ఫిలిప్ | INR 2000000 |
పవన్ దేశ్‌పాండే | INR 2000000 |
సన్‌రైజర్స్ హైదరాబాద్
2016 ఛాంపియన్ సన్‌రైజర్స్ హైదరాబాద్.. తమ రెగ్యులర్ ఓపెనర్లు జానీ బెయిర్‌స్టో, డేవిడ్ వార్నర్‌లు లేకుండానే లీగ్ ప్రారంభించనుంది. ఆస్ట్రేలియా క్రికెటర్లు మిచెల్ మార్ష్, బిల్లీ స్టాన్లేక్లనూ కొన్నిరోజుల పాటు కోల్పోనుంది.
పేరు | జీతం |
డేవిడ్ వార్నర్ | INR 125000000 |
మనీశ్ పాండే | INR 110000000 |
రిషబ్ ఖాన్ | INR 90000000 |
భువనేశ్వర్ కుమార్ | INR 85000000 |
సిద్దార్థ్ కౌల్ | INR 38000000 |
షాబాజ్ నదీమ్ | INR 32000000 |
విజయ్ శంకర్ | INR 32000000 |
కేన్ విలియమ్సన్ | INR 30000000 |
సందీప్ శర్మ | INR 30000000 |
పేరు | జీతం |
ఖలీల్ అహ్మద్ | INR 30000000 |
జానీ బెయిర్‌స్టో | INR 22000000 |
మిచెల్‌మార్ష్ | INR 20000000 |
ప్రియమ్ గార్గ్ | INR 19000000 |
విరాట్ సింగ్ | INR 19000000 |
వృద్ధిమాన్ సాహా | INR 12000000 |
మహమ్మద్ నబి | INR 10000000 |
శ్రీవత్స్ గోస్వామి | INR 10000000 |
బాసిల్ తంపి | INR 9500000 |
పేరు | జీతం |
అభిషేక్ శర్మ | INR 5500000 |
బిల్లీ స్టాన్లేక్ | INR 5000000 |
ఫాబియన్ అలెన్ | INR 5000000 |
టి.నటరాజన్ | INR 4000000 |
సందీప్ బవనక | INR 2000000 |
సంజయ్ యాదవ్ | INR 2000000 |
అబ్దుల్ సమద్ | INR 2000000 |