ముగిసిన వేలం..
ఐపీఎల్-14 మినీ వేలం ముగిసింది. 8 ఫ్రాంఛైజీలు రూ. 145.3 కోట్లు వెచ్చించి.. 57 మంది ఆటగాళ్లను కొనుగోలు చేశాయి. ఇందులో 22 మంది విదేశీ ఆటగాళ్లు. 29 మంది అన్క్యాప్డ్ ప్లేయర్లు.
యువరాజ్ సింగ్ అత్యధిక ధర రికార్డును క్రిస్ మోరిస్(రూ. 16.25 కోట్లు) బద్దలు కొట్టాడు. కైల్ జేమిసన్(రూ. 15 కోట్లు), మ్యాక్స్వెల్(రూ. 14.25 కోట్లు), జే రిచర్డ్సన్(రూ.14 కోట్లు), రిలె మెరిడిత్(రూ. 8 కోట్లు), షారుక్ ఖాన్( రూ. 5.25 కోట్లు) వంటి కుర్రాళ్లు కోట్ల రూపాయలు పలికారు. దేశవాళీ ఆల్‌రౌండర్ కృష్ణప్ప గౌతమ్(రూ. 9.25 కోట్లు) భారీ మొత్తం సొంతం చేసుకున్నాడు