ETV Bharat / sports

ఐపీఎల్: అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లు వీరే! - ఐపీఎల్ అత్యధిక పారితోషికం ధోనీ

ఐపీఎల్ 13వ సీజన్ వేలం మరికొద్ది రోజుల్లో జరగనుంది. ఈసారి మినీ వేలం కోసం ఫ్రాంచైజీలు ఇప్పటికే వారి ప్రణాళికల్ని సిద్ధం చేసుకున్నాయి. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు జరిగిన వేలాల్లో ఏ ఆటగాడు అత్యధిక ధర పలికాడో చూద్దాం.

Most expensive player in each IPL season
అత్యధిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లు వీరే
author img

By

Published : Feb 11, 2021, 5:39 PM IST

ఐపీఎల్​కు ముందు జరిగే వేలం అందరి దృష్టినీ ఆకర్షిస్తుంది. ఏ ఫ్రాంచైజీ ఏ ఆటగాళ్లను తీసుకుంటుంది? వారి కోసం ఎంత ఖర్చు చేస్తుంది? లీగ్ కోసం వారి ప్లాన్స్ ఎలా ఉన్నాయి? ఏ ఆటగాడు ఎక్కువ ధర పలుకుతాడు? మొదలైన అంశాల గురించి అభిమానులు ఆత్రుతగా ఎదురుచూస్తుంటారు. 13వ సీజన్​ కోసం వేలం ఫిబ్రవరి 18న జరగనుంది. ఈ నేపథ్యంలో ప్రతి సీజన్​లో ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లెవరో తెలుసుకుందాం.

ఐపీఎల్ మొదటి సీజన్​లో టీమ్ఇండియా మాజీ సారథి ఎంఎస్ ధోనీ అత్యధిక ధర పలికాడు. 2007 టీ20 ప్రపంచకప్​లో భారత జట్టును విజేతగా నిలిపిన ధోనీ సామర్థ్యాల పట్ల ఫ్రాంచైజీలు ఎక్కువ నమ్మకాన్ని ఉంచాయి. దీంతో ఇతడికి భారీ డిమాండ్ లభించింది. ఈ కారణంగా మహీని 9.5 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది చెన్నై సూపర్ కింగ్స్. అప్పటి నుంచి చెన్నైకే ఆడుతున్న ధోనీ ఈ ఫ్రాంచైజీకి మూడు ఐపీఎల్ టైటిల్స్ అందించాడు.

తర్వాత ఏడాది (2009) జరిగిన వేలంలో ఇంగ్లాండ్ ఆటగాళ్లు కెవిన్ పీటర్సన్, ఆండ్రూ ఫ్లింటాఫ్​ ఎక్కువ ధర పలికారు. 2010లో వెస్టిండీస్ విధ్వంసకర ఆటగాడు కీరన్ పొలార్డ్, న్యూజిలాండ్ పేసర్ షేన్ బాండ్ ఈ ఘనత సాధించారు. అనంతరం 2011 ఐపీఎల్ వేలంలో కోల్​కతా నైట్​రైడర్స్.. గౌతమ్ గంభీర్​ను 11.4 కోట్ల భారీ ధరకు కొనుగోలు చేసింది. ఇక తర్వాత యువరాజ్ సింగ్ (రెండుసార్లు), బెన్ స్టోక్స్ (రెండు సార్లు), రవీంద్ర జడేజా, జయదేవ్ ఉనద్కత్ వరుస సీజన్లలో ఎక్కువ రేట్​కు అమ్ముడుపోయారు. గత సీజన్​లో ఆస్ట్రేలియా పేసర్ ప్యాట్ కమిన్స్​ను అత్యధిక ధరకు కొనుగోలు చేసింది కోల్​కతా నైట్​రైడర్స్.

ఎక్కువ ధర పలికిన ఆటగాళ్లు (సీజన్​ వారిగా)

Most expensive player in each IPL season
సీజన్​ వారిగా అత్యదిక పారితోషికం అందుకున్న ఆటగాళ్లు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.