ఇంగ్లాండ్‌తో శుక్రవారం ప్రారంభమయ్యే టెస్టు సిరీస్‌తో భారత్‌లో మళ్లీ క్రికెట్ కోలాహలం మొదలుకానుంది. స్వదేశంలో మ్యాచ్‌లపై అభిమానుల్లో భారీ ఆసక్తి, అంచనాలుంటాయి. అలాంటిది గతేడాది జనవరి 19న ఆస్ట్రేలియాతో జరిగిన వన్డే మ్యాచ్ తర్వాత భారత్‌లో అంతర్జాతీయ క్రికెట్ మ్యాచ్‌లు జరగలేదు.
బెంగళూరులోని చిన్నస్వామి స్టేడియంలో జరిగిన ఈ మ్యాచ్‌లో గెలిచిన భారత్.. 2-1తో వన్డే సిరీస్ కైవసం చేసుకుంది. ఆఖరి మ్యాచ్‌లో రోహిత్ శర్మ శతకంతో చెలరేగిపోయాడు. అనంతరం మార్చిలో స్వదేశంలోనే దక్షిణాఫ్రికాతో వన్డే సిరీస్ ఆడాల్సింది టీమ్ఇండియా. మార్చి 12న జరగాల్సిన తొలి మ్యాచ్ రద్దు కాగా.. మార్చి 15, 18 తేదీల్లో నిర్వహించాల్సిన మిగిలిన మ్యాచ్‌లు కొవిడ్ కారణంగా తొలుత వాయిదా పడగా.. చివరకు మొత్తానికే నిలిచిపోయాయి.
2019 నవంబర్‌లో చివరి టెస్టు..
కోల్‌కతాలోని ఈడెన్ గార్డెన్స్‌లో బంగ్లాదేశ్‌తో నవంబర్ 22- 24 మధ్య జరిగిన పింక్ బాల్ టెస్టే.. సుదీర్ఘ ఫార్మాట్లో స్వదేశంలో భారత్ ఆడిన చివరి మ్యాచ్. ఇంగ్లాండ్‌తో తొలి టెస్టు ఫిబ్రవరి 5 నుంచి 9 వరకు ప్రేక్షకులు లేకుండానే జరగనుంది. రెండో టెస్టు నుంచి ప్రేక్షకులకు అనుమతి ఇచ్చే అవకాశాలున్నాయి.
ఇదీ చూడండి: చెపాక్‌ను చుట్టేసేదెవరు? తొలి పోరులో హిట్టయ్యేదెవరు?