ఆస్ట్రేలియా పర్యటన అంతిమ ఘట్టానికి చేరుకుంది. బ్రిస్బేన్ వేదికగా శుక్రవారం నుంచి టీమ్ ఇండియా ఆఖరి టెస్టు ఆడనుంది. ఈ సందర్భంగా భారత ఆటగాళ్లు సాధనలో చెమటోడ్చారు. తొలి ప్రాక్టీస్ సెషన్ విజయవంతంగా ముగించారు. అయితే కీలక ఆటగాళ్లు దూరమైన నేపథ్యంలో తుదిజట్టుపై ఆసక్తి పెరిగింది. సాధనలో కుల్‌దీప్ బంతిని గింగరాలు తిప్పుతుండటం వల్ల జడేజా స్థానంలో అతడు స్థానం దక్కించుకుంటాడనిపిస్తోంది.
-
After an epic fightback in Sydney, it is time to regroup. We have begun our preparations for the final Test at the Gabba! #TeamIndia #AUSvIND pic.twitter.com/oAUJboM5bH
— BCCI (@BCCI) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
">After an epic fightback in Sydney, it is time to regroup. We have begun our preparations for the final Test at the Gabba! #TeamIndia #AUSvIND pic.twitter.com/oAUJboM5bH
— BCCI (@BCCI) January 13, 2021After an epic fightback in Sydney, it is time to regroup. We have begun our preparations for the final Test at the Gabba! #TeamIndia #AUSvIND pic.twitter.com/oAUJboM5bH
— BCCI (@BCCI) January 13, 2021
నెట్స్‌లో సాధన చేస్తున్న గిల్‌కు కుల్‌దీప్ బౌలింగ్ చేశాడు. స్పిన్, వేగంతో దూసుకొచ్చిన బంతుల్ని ఎదుర్కోవడానికి గిల్ కాస్త ఇబ్బంది పడ్డాడు. ఆఫ్ స్టంప్‌కు అవతల వేసిన ఓ బంతి గింగరాలు తిరుగుతూ గిల్ ప్యాడ్‌కు తగలింది. బ్యాట్స్‌మన్‌కు సమాధానం దొరకని ఆ బంతిని చూసి గిల్ ఆశ్చర్యంగా చూశాడు. ఈ వీడియోను బీసీసీఐ ట్విట్టర్‌లో పంచుకుంది. ‘కుల్‌దీప్ వేసిన బంతి ఎలా ఉంది? అది ఔట్ అంటారా?’ అని దానికి వ్యాఖ్య జత చేసింది.
-
How is that from @imkuldeep18.😯
— BCCI (@BCCI) January 13, 2021 " class="align-text-top noRightClick twitterSection" data="
Would you give that OUT? 🤔 #TeamIndia #AUSvIND pic.twitter.com/ZkZwT6r6xD
">How is that from @imkuldeep18.😯
— BCCI (@BCCI) January 13, 2021
Would you give that OUT? 🤔 #TeamIndia #AUSvIND pic.twitter.com/ZkZwT6r6xDHow is that from @imkuldeep18.😯
— BCCI (@BCCI) January 13, 2021
Would you give that OUT? 🤔 #TeamIndia #AUSvIND pic.twitter.com/ZkZwT6r6xD
గాయంతో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రా సాధనలో పాల్గొనప్పటికీ బౌలింగ్ కోచ్ అరుణ్‌తో కలిసి పేసర్లకు మార్గనిర్దేశం చేశాడు. కోచ్‌తో కలిసి కంగారూలకు కళ్లెం వేయడానికి ప్రణాళికలు రచించడంలో సాయం చేస్తున్నాడు. మరోవైపు రోహిత్ శర్మ యువ ఆటగాళ్లకు స్ఫూర్తిని నింపుతున్నాడు. కీలక ఆటగాళ్లు దూరమైనా సమష్టిగా పోరాడి విజయం సాధించాలని టీమిండియా పట్టుదలతో ఉంది. అయితే బుమ్రా గైర్హాజరీతో శార్దూల్ ఠాకూర్, నటరాజన్‌లో ఒకరు తుదిజట్టులో చోటు దక్కించుకునే అవకాశాలు ఉన్నాయి. నలుగురు పేసర్లతో బరిలోకి దిగాలనుకుంటే సిరాజ్, సైనితో పాటు శార్దూల్, నట్టూ ఇద్దరికీ అవకాశం వస్తుంది.