ETV Bharat / sports

ఒక్కో బ్యాట్స్​మన్ కోసం ఒక్కో ప్లాన్: కోహ్లీ - బోర్డర్​ గావస్కర్​ ట్రోఫీ వార్తలు

ఆసీస్​తో టెస్టు సిరీస్​ కోసం పక్కా ప్రణాళికతో సిద్ధమయ్యామని చెప్పాడు టీమ్​ఇండియా కెప్టెన్​​ కోహ్లీ. గులాబి​ టెస్టులో పగలు రాత్రి మార్పు కారణంగా బాట్స్​మన్​ ఇబ్బంది పడే అవకాశముందని చెప్పాడు.

India's tour of Australia: We are ready with our plans to face any situation, says Kohli
ఆస్ట్రేలియాతో సిరీస్​కు సిద్ధంగా ఉన్నాం: కోహ్లీ
author img

By

Published : Dec 16, 2020, 5:52 PM IST

ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో ఎలాంటి సవాళ్లయినా సరే ఎదుర్కొనేందుకు సిద్ధంగా ఉన్నామని టీమ్​ఇండియా కెప్టెన్​ విరాట్​ కోహ్లీ అన్నాడు. గురువారం మొదలయ్యే డే/నైట్ టెస్టులో(తొలి మ్యాచ్) ఆచితూచి వ్యవహరించాల్సిన అవసరముందని అభిప్రాయపడ్డాడు. రాత్రివేళలో బ్యాటింగ్ చేయడం కొంచెం కష్టమయ్యే అవకాశముందని చెప్పాడు.

"టెస్టుల్లో ప్రణాళికలతో రాణించగలరని భావించడం లేదు. టెస్టు క్రికెట్​లో పరిస్థితులను ఎదుర్కొవడం సహా అందుకు తగ్గట్టు ఉత్తమంగా స్పందించడమే కీలకం. కొన్నిసార్లు దూకుడుగా ఆడాలి. డిఫెండ్ చేయాల్సిన క్రమంలో ఆచితూచి ఆడాల్సిన అవసరం ఎంతైనా ఉంది. సాధారణ టెస్టులతో పోలిస్తే పింక్​-బాల్​ మ్యాచ్​కు అనేక వ్యత్యాసముంది. డే/నైట్​ మ్యాచ్​ కాబట్టి రాత్రివేళలో బ్యాటింగ్​ కొంచెం కష్టం కావొచ్చు. ఇదే సమయంలో బౌలర్లు మరింత క్రమశిక్షణతో బౌలింగ్​ చేయాలి. టెస్టులు ఆడేప్పుడు సరైన సమయంలో స్పందించాల్సి ఉంటుంది. దీంతో పాటు పక్కాగా ప్రణాళికలు అమలు చేయాలి. ఆస్ట్రేలియాతో టెస్టు సిరీస్​లో ప్రతి బ్యాట్స్​మన్​ కోసం ఒక్కో ప్రణాళికలతో సంసిద్ధమవుతున్నాం. మైదానంలో వాటిని అమలుచేస్తాం"

- విరాట్​ కోహ్లీ, టీమ్​ఇండియా కెప్టెన్​

పింక్ బాల్ వార్మప్​ గేమ్ సెంచరీ చేసి ఆకట్టుకున్నా పంత్​కు నిరాశే ఎదురైంది. ఆస్ట్రేలియాతో తొలి టెస్టు కోసం టీమ్​ఇండియా బుధవారం జట్టు ప్రకటించింది. ఇందులో పంత్​తో పాటు కేఎల్​ రాహుల్​కూ చోటు దక్కలేదు. ఓపెనర్​గా పృథ్వీషాకు అవకాశం దక్కగా.. సాహాకు వికెట్​ కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.

టీమ్​ఇండియా: మయాంక్ అగర్వాల్, పృథ్వీషా, విరాట్​ కోహ్లీ(కెప్టెన్), పుజారా, అజింక్య రహానె, హనుమ విహారి, వృద్ధిమాన్ సాహా, రవిచంద్రన్​ అశ్విన్, ఉమేశ్ యాదవ్, మహ్మద్​ షమి, జస్​ప్రీత్​ బుమ్రా.

ఇదీ చూడండి:

టీమ్​ఇండియాకు నూతన ప్రతినిధిగా కోహ్లీ!

పంత్​కు నిరాశ.. గులాబీ టెస్టులో దక్కని చోటు

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.