ETV Bharat / sports

ఆ సిరీస్​ కోసం దుబాయ్​కి పుజారా, విహారి - ravisastri to dubai

ఆస్ట్రేలియా పర్యటన కోసం టెస్టు ఆటగాళ్లు చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, కోచ్​ రవిశాస్త్రి దుబాయ్​ వెళ్లనున్నారు. అక్కడ మెగాలీగ్​​ పూర్తవ్వగానే టీమ్​ఇండియా బృందంతో కలిసి ఆస్ట్రేలియాకు బయల్దేరుతారు.

India's Test team
చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి
author img

By

Published : Oct 25, 2020, 4:46 PM IST

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా టెస్టు జట్టు ఆటగాళ్లు చెతేశ్వర్​ పుజారా, హనుమ విహారి, ప్రధాన కోచ్​ రవిశాస్త్రి, సహాయక సిబ్బంది దుబాయ్​ వెళ్లనున్నారు. రవిశాస్త్రి సోమవారం బయలుదేరుతుండగా.. మిగతా వారు ఆదివారం వెళ్లనున్నారు. అక్కడికి చేరుకోగానే ఆరు రోజుల పాటు క్వారంటైన్​లో ఉంటారు. ఐపీఎల్ అనంతరం టీమ్​ఇండియా బృందం ఆస్ట్రేలియాకు వెళ్తుంది.

India's Test team
టీమ్​ఇండియా

నవంబర్​లో జరగబోయే ఆస్ట్రేలియా-భారత్​ పరిమిత ఓవర్ల సిరీస్​కు.. సిడ్నీ, కాన్​బెర్రా ఆతిథ్యం ఇవ్వనున్నాయి. ఈ మైదానాల్లోనే మూడు వన్డేలు, మూడు టీ20ల్లో తలపడనున్నాయి ఇరుజట్లు.

అయితే ఈ ​ పర్యటనలో భాగంగా టీమ్​ఇండియా తొలుత సిడ్నీకి చేరుకోనుంది. అక్కడే పద్నాలుగు రోజుల పాటు క్వారంటైన్ పూర్తి చేసుకొని ప్రాక్టీస్​లో పాల్గొంటుంది. తుది జట్టులో పాల్గొనే ఆటగాళ్ల ఎంపిక ప్రక్రియ ఇంకా పూర్తికాలేదు. దీనిపై ప్రస్తుతం చర్చలు జరుగుతున్నాయి. వచ్చే వారం నాటికి స్పష్టత వచ్చే అవకాశం ఉంది.

India's Test team
టీమ్​ఇండియా

ఇదీ చూడండి దసరా విషెస్ తెలిపిన క్రికెటర్లు

For All Latest Updates

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.