ETV Bharat / sports

'ఆసీస్​ గడ్డపై గెలిచే సత్తా భారత్​కు ఉంది'

డిసెంబర్​లో జరగబోయే బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్​లో టీమ్​ఇండియా రాణించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైక్​ అథర్టన్​. ఉత్తమ బౌలింగ్ లైనప్​తో ఆసీస్​ గడ్డపై భారత్​ విజయాలు సాధించగలదని అభిప్రాయపడ్డాడు. ​

India's strong bowling attack should give them hope in Aus: Atherton
'బౌలింగ్​ ఎటాక్​తో టీమ్​ఇండియా రాణిస్తుంది'
author img

By

Published : Jun 26, 2020, 5:02 PM IST

Updated : Jun 26, 2020, 5:08 PM IST

బౌలింగ్​ లైనప్​ బలంగా ఉన్న కారణంగా ఆస్ట్రేలియాతో జరిగే టెస్టు సిరీస్​లో భారత్​ రాణించగలదని ఆశాభావం వ్యక్తం చేశాడు ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​ మైక్​ అథర్టన్​. బోర్డర్​-గావస్కర్​ టెస్టు సిరీస్ కోసం నవంబర్​లో ఆస్ట్రేలియాకు బయలుదేరనుంది టీమ్​ఇండియా.

'బౌలింగ్​ ఎటాక్​తో టీమ్​ఇండియా రాణిస్తుంది'
ట్రోఫీతో అలెన్​ బోర్డర్​, సునీల్​ గావాస్కర్​

"వారికున్న ఉత్తమ బౌలింగ్​ ఎటాక్​తో భారత్ ఆస్ట్రేలియాకు బలమైన పోటీ ఇస్తుందని ఆశిస్తున్నా. ఎందుకంటే బలమైన బౌలింగ్​ లైనప్​ లేకుండా ఆసీస్​తో తలపడటం కష్టం. టీమ్​ఇండియాను కొన్నేళ్లుగా గమనిస్తే ఆ జట్టు తయారు చేసే ఫాస్ట్​ బౌలర్ల సంఖ్య గణనీయంగా పెరిగింది. 1993లో నేను భారత గడ్డపై ఆడిన సమయంలో ఆ జట్టులో ఎక్కువమంది స్పిన్నర్లే ఉండేవారు. ఫాస్ట్ బౌలర్లు కూడా ఉన్నా.. ఇప్పుడున్నంత లోతైన పేస్​ ఎటాక్ లేదు".

- మైక్​ అథర్టన్​, ఇంగ్లాండ్​ మాజీ కెప్టెన్​

ప్రస్తుత బ్యాట్స్​మెన్లలో రోహిత్​ శర్మ అత్యుత్తమ ప్రతిభ కలిగినవాడని కొనియాడాడు అథర్టన్​. పరిమిత ఓవర్ల ఫార్మాట్​లో ఉత్తమ ప్రదర్శన చేస్తున్న హిట్​మ్యాన్​.. టెస్టుల్లోనూ విజయవంతమవుతాడని​ అభిప్రాయపడ్డాడు​. రోహిత్​ ఆటతీరు సహజంగా ఉంటుందని తెలిపాడు.

"ఇంగ్లాండ్​ ఆటగాళ్ల కంటే భారత ఆటగాళ్లు ఎందుకు అంత సహజంగా ఆడగలరని రాహుల్​ ద్రవిడ్​ను అడిగా. 'భారత ఆటగాళ్లకు ఏడాదంతా ప్రాక్టీస్​ చేసే సౌలభ్యం ఉంటుంది. కానీ, ఇంగ్లాండ్​లోని వాతావరణం దృష్ట్యా క్రికటర్లు ఆరు మాసాలే ప్రాక్టీస్​ చేయగలరు' అని ద్రవిడ్​ వివరించాడని" తెలిపాడు అథర్టన్.

ఇదీ చూడండి... 'సన్​రైజర్స్​ జట్టులో ఆడటం నా కెరీర్​కు మలుపు​'

Last Updated : Jun 26, 2020, 5:08 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.