ETV Bharat / sports

'భారత బౌలింగ్​ దళంతో ఆసీస్​ టాప్​ఆర్డర్​కు కష్టమే'

త్వరలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​లో స్టార్​ బ్యాట్స్​మన్​ డేవిడ్ వార్నర్​ గైర్హాజరీ ఆస్ట్రేలియా జట్టుపై ప్రభావం చూపుతుందని అన్నాడు వ్యాఖ్యాత ఆకాశ్ చోప్రా. భారత పేస్​ విభాగానికి ఆసీస్​ టాప్​ ఆర్డర్​ను కట్టడి చేయగల సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు.

India
భారత బౌలింగ్​ దళం
author img

By

Published : Dec 13, 2020, 9:46 AM IST

టీమ్​ఇండియా బౌలింగ్ దళంపై ప్రశంసల జల్లు కురిపించాడు వ్యాఖ్యాత​ ఆకాశ్​ చోప్రా. త్వరలో ప్రారంభంకానున్న టెస్టు సిరీస్​లో భారత బౌలర్లకు ఆస్ట్రేలియా టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయగలిగే సత్తా ఉందని అభిప్రాయపడ్డాడు. బుమ్రా, షమీ, మహ్మద్​ సిరాజ్​, ఉమేశ్​ యాదవ్​, నవదీప్​ సైనీతో బౌలింగ్​ విభాగం పటిష్ఠంగా ఉందని తెలిపాడు.

"బుమ్రా, షమీ ఇక మూడో పేసర్​గా సైనీ, ఉమేశ్​, సిరాజ్​ ఎవరైనా గానీ.. వీరికి ఆసీస్​ టాప్​ ఆర్డర్​ బ్యాట్స్​మెన్​ను కట్టడి చేయగలిగే సత్తా ఉంది. దీనిపై నాకు పూర్తి విశ్వాసం ఉంది."

-ఆకాశ్​ చోప్రా, వ్యాఖ్యత.

తొలి టెస్టుకు వార్నర్​ దూరమవ్వడం ఆస్ట్రేలియా జట్టుకు తీరని లోటు అని అన్నాడు చోప్రా. "వార్నర్​ లేడు. జో బర్న్స్​ ఫామ్​లో లేడు. విల్​ పుకోవిస్కీ తలకు గాయం తగలడం వల్ల అతడు ఆడతాడో లేదో అనుమానమే. కాబట్టి ప్రత్యర్థి జట్టు టాప్​ ఆర్డర్​ బలహీనంగా ఉంటుంది. సులభంగానే వారిని దెబ్బతీయొచ్చు" అని అన్నాడు.

డిసెంబరు 17వ తేదీ నుంచి టెస్టు సిరీస్ ప్రారంభంకానుంది. డిసెంబర్‌ 17-21 వరకు అడిలైడ్‌లో తొలి మ్యాచ్​ జరుగుతుంది. ఆ తర్వాత టెస్టులకు మెల్‌బోర్న్‌ (26-30), సిడ్నీ (జనవరి 7-11, 2021), బ్రిస్బేన్‌ (జనవరి 15-19) ఆతిథ్యమిస్తాయి.

ఇదీ చూడండి : ఆ సిరీస్​ కోసం సూర్యకుమార్, ఇషాన్!

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.