అడిలైడ్‌లో జరిగిన తొలి టెస్టులో ఘోరంగా విఫలమైన టీమ్ఇండియా.. రెండో ఇన్నింగ్స్‌లో 36 పరుగులే చేయగలిగింది. దీంతో ఆస్ట్రేలియా 8 వికెట్ల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ ఫార్మాట్ చరిత్రలోనే అత్యల్ప స్కోరు నమోదు చేసింది.
విచిత్రమేమిటంటే సరిగ్గా 19 ఏళ్ల క్రితం ఇదే రోజున(డిసెంబరు 19) ఓ ఇన్నింగ్స్‌లో అత్యధిక స్కోరు(759/7) కూడా చేసింది. చెన్నై వేదికగా ఇంగ్లాండ్‌తో ఐదో టెస్టులో ఈ గణాంకాల్ని భారత్ జట్టు సృష్టించింది.
ఆస్ట్రేలియాతో తొలి టెస్టులో ఓడిన భారత్.. రెండో మ్యాచ్(బాక్సింగ్ డే టెస్టు) ఈనెల 26 నుంచి ఆడనుంది. మెల్బోర్న్ వేదికగా ఈ పోరు జరగనుంది.
పితృత్వ సెలవుల కారణంగా తొలి టెస్టు అనంతరం స్వదేశానికి వెళ్లిపోనున్నాడు కెప్టెన్ కోహ్లీ. అతడు ఉన్నప్పుడే ఘోరంగా ఆడిన టీమ్ఇండియా.. మరి విరాట్ గైర్హాజరీతో ఏం చేస్తుందో చూడాలి.
ఇవీ చదవండి: