ETV Bharat / sports

షెఫాలీ.. నువ్విలాగే మెరవాలి, స్ఫూర్తిగా నిలవాలి! - indian womens cricketer shafali verma

క్రికెట్ ఆడటం కోసం అబ్బాయిగా తయారై, సాధన చేయాల్సిన పరిస్థితి. ఆడపిల్ల పుట్టడమే ఓ పెద్ద శాపంగా భావించే సమాజంలో పుట్టిన షెఫాలీ... పేదరికంతోనూ పోరాడాల్సి వచ్చింది. పిన్నవయసులోనే భారత మహిళా క్రికెట్ జట్టులో చోటు దక్కించుకున్న హరియాణాకు చెందిన షెఫాలీ వర్మ కథ ఇది. 9 ఏళ్ల వయసులో బ్యాట్ పట్టుకున్న షెఫాలీ.. 15 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అర్ధశతకం బాదిన క్రికెటర్​గా చరిత్ర సృష్టించింది.

shefali verma
షెఫాలీ.. నువ్విలాగే మెరవాలి, స్ఫూర్తిగా నిలవాలి!
author img

By

Published : Sep 24, 2020, 11:51 AM IST

షెఫాలీ.. నువ్విలాగే మెరవాలి, స్ఫూర్తిగా నిలవాలి!

హరియాణా రోహ్​తక్​కు చెందిన షెఫాలీ వర్మ పేరు...క్రికెట్ ప్రపంచంలో ప్రస్తుతం అందరినోటా వినిపిస్తోంది. ఈ 16 ఏళ్ల బ్యాట్స్ఉమన్...అద్భుతమైన షాట్లతో అదరగొడుతోంది. క్రికెట్ దిగ్గజం సచిన్ సైతం ఆమె ఆటకు ఫిదా అయ్యాడు. భారత మహిళా క్రికెట్జట్టులో అతిచిన్న వయసులోనే ప్రవేశించిన మొట్ట మొదటి ప్లేయర్​గా రికార్డుకెక్కింది షెఫాలీ వర్మ. ఈ విజయం తనకు రాత్రికి రాత్రే రాలేదు.

"మొదట్లో అమ్మాయిల కోసం క్రికెట్ అకాడమీలు ఉండేవి కాదు. అబ్బాయిలతో కలిసి ఆడేదాన్ని. తర్వాత ఈ అకాడమీలో చేరాను. ఇక్కడికి సైకిల్​పై వచ్చేదాన్ని. చాలా కష్టంగా ఉండేది. బడి అయిపోయిన తర్వాత అకాడమీకి రావడం కష్టంగా అనిపించేది. మా ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉండేది. ప్రాక్టీస్​ తర్వాత ఎవరికీ కనిపించకుండా కిట్​ను లోపల దాచేదాన్ని. విరిగి పోయిన బ్యాట్​తోనే ఆడేదాన్ని."

-షెఫాలీ వర్మ, క్రికెటర్

అబ్బాయిలకే ప్రాధాన్యమిచ్చే సమాజంలో ఆడపిల్ల పుట్టడమే ఓ పెద్దశాపంగా భావిస్తారు. అలాంటి పరిస్థితులతో పాటు.. పేదరికంతోనూ షెఫాలీ పోరాడాల్సి వచ్చింది. కుమార్తె గురించి మాట్లాడే సమయంలో.. షెఫాలీ తండ్రి కళ్లు చెమర్చుతాయి, స్వరం గద్గదంగా మారుతుంది. తడబడుతున్న గొంతుతోనే...కుమార్తె పడ్డ కష్టాన్ని చెప్పుకొచ్చారు.

"చాలా కష్టపడ్డాం. ఉదయం ఐదింటింకే లేచి, 3గంటలు ప్రాక్టీసు చేసేది. తర్వాత బడికి వెళ్లేది. అకాడమీకి వెళ్లి, రాత్రి 11, 12 గంటల వరకు సాధన చేసేది. అప్పుడు మా పరిస్థితి దయనీయంగా ఉండేది. 4 నెలలైతే ఎలా గడిపామో తెలియదు. బ్యాట్, గ్లవ్స్ కావాలని కూడా అడగలేదు. బ్యాట్ వేరే వాళ్లది అడిగి ఆడించేవాళ్లం. ఇప్పుడు మేం చాలా సంతోషంగా ఉన్నాం. భగవంతుడి ఆశీస్సులు మాకు దక్కాయి."

-సంజీవ్​ వర్మ, షెఫాలీ తండ్రి

భారత మహిళా క్రికెట్ జట్టులో అందరికంటే చిన్న వయస్కురాలైన షెఫాలీ వర్మ బ్యాటింగే కాదు.. వికెట్​కీపర్​గానూ అదరగొడుతోంది. అప్పుడప్పుడూ బౌలింగ్​లోనూ ప్రతిభ చూపుతుంది. కానీ.. ఒకప్పుడు ఈ ఆట ఆడేందుకు తను అబ్బాయిలా తయారు కావాల్సి వచ్చింది. అమ్మాయిలకు ఏ అకాడమీలో ప్రవేశం దొరక్కపోవడం వల్ల.. అబ్బాయిలతో కలిసి క్రికెట్ ఆడేది. చుట్టుపక్కల వారంతా తమను నిందించిన రోజులు కూడా ఉన్నాయని చెబుతారు షెఫాలీ తల్లి. చాలా మంది ఆమెను క్రికెట్ మాన్పించాలని ఉచిత సలహాలిచ్చేవారట.

షెఫాలీ మొదట బ్యాట్​ పట్టుకున్నప్పుడు ఆమె వయసు 9 సంవత్సరాలు. మొదట్లో క్రికెట్ ఆమె అన్న ఆడేవాడు. ఓసారి అనారోగ్యం కారణంగా తను ఆడలేకపోవడంతో షెఫాలీ జట్టులో చేరింది. అన్న జెర్సీ వేసుకుని, ఆమె క్రికెట్ ఆడడం అదే మొదటిసారి.

ఇలాగే మెరవాలి

భారత క్రికెట్లో షెఫాలీ వర్మ పేరు సుపరిచితం. 15 ఏళ్లకే అంతర్జాతీయ స్థాయిలో అర్ధశతకం బాదిన అతిచిన్న మహిళా క్రికెట్ ప్లేయర్​గా చరిత్ర సృష్టించింది. క్రికెట్ దిగ్గజం సచిన్ తెందూల్కర్ రికార్డును బద్దలు కొట్టింది షెఫాలీ. నిరంతరం అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకుంటోంది. ఆమె ఇలాగే తన ఆట కొనసాగిస్తూ, హరియాణాకే కాదు భారత్​కే గర్వకారణంగా నిలవాలని ఆశిద్దాం.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.