వెస్టిండీస్ మహిళా జట్టుతో జరిగిన చివరి టీ20లో భారత అమ్మాయిలు జోరు కొనసాగిస్తున్నారు. చివరి టీ20లో 61 పరుగుల తేడాతో విజయం సాధించారు. ఫలితంగా ఐదు మ్యాచ్ల సిరీస్ను 5-0 తేడాతో కైవసం చేసుకున్నారు. టీమిండియా నిర్దేశించిన 134 పరుగుల లక్ష్యాన్ని ఛేదించబోయి 73 పరుగులకే పరిమితమయ్యారు విండీస్ అమ్మాయిలు.
గయానా వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో మొదట బ్యాటింగ్ చేసిన టీమిండియా నిర్ణీత ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 134 పరుగులు చేసింది భారత్. రోడ్రిగ్స్(50), వేధా కృష్ణమూర్తి(60) అర్ధశతకాలతో ఆకట్టుకున్నారు. కరీబియన్ బౌలర్లలో మాథ్యూస్, ఆనిసా, అలెన్ చెరో వికెట్ తీశారు.
-
India finish their 20 overs on 134/3 – Veda Krishnamurthy top-scored with 57 not out from 48 balls.
— ICC (@ICC) November 20, 2019 " class="align-text-top noRightClick twitterSection" data="
Watch West Indies' chase here ⬇️ https://t.co/UMfjsm6bJO pic.twitter.com/CvgVl4Bwpj
">India finish their 20 overs on 134/3 – Veda Krishnamurthy top-scored with 57 not out from 48 balls.
— ICC (@ICC) November 20, 2019
Watch West Indies' chase here ⬇️ https://t.co/UMfjsm6bJO pic.twitter.com/CvgVl4BwpjIndia finish their 20 overs on 134/3 – Veda Krishnamurthy top-scored with 57 not out from 48 balls.
— ICC (@ICC) November 20, 2019
Watch West Indies' chase here ⬇️ https://t.co/UMfjsm6bJO pic.twitter.com/CvgVl4Bwpj
అనంతరం 135 పరుగుల లక్ష్య ఛేదనలో బరిలోకి దిగిన విండీస్ 7 వికెట్ల నష్టానికి 73 పరుగులు చేసింది. కరీబియన్ బ్యాట్స్ఉమెన్లో ఎవరూ రాణించలేక పోయారు. భారత అమ్మాయిల బౌలింగ్ ధాటికి వరుసగా పెవిలియన్కు క్యూ కట్టారు. కిశోనా నైట్దే(22) అత్యుత్తమ స్కోరు. టీమిండియా బౌలర్లలో అనుజా పాటిల్ రెండు వికెట్లతో ఆకట్టుకోగా.. రాధ, పూనమ్, పూజా వస్త్రాకర్, హర్లీన్ డియోల్ చెరో వికెట్ తీశారు.
ఇదీ చదవండి: 16 ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్లో అరంగేట్రం