ETV Bharat / sports

'ఒత్తిడి తట్టుకోలేక ప్రపంచకప్​ ఫైనల్​లో ఓడిపోయాం' - మహిళల టీ20 ప్రపంచకప్​ 2020

మహిళల టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో ఓడిపోవడానికి ఒత్తిడే ప్రధాన కారణమన్నారు ఉమెన్స్​ జట్టు చీఫ్​ సెలెక్టర్​ హేమలతా కాలా. తుదిపోరులో జట్టు పరాజయం పాలైనా లీగ్​ దశ నుంచి విజయాలను నమోదు చేసిందని వెల్లడించారు. హర్మన్​ప్రీత్​ ఉత్తమ క్రీడాకారిణి అని.. తన నాయకత్వంలో జట్టు బాగా రాణిస్తుందని అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు హేమలత.

Indian team unable to handle pressure of big finals: Outgoing women's chief selector Kala
'ఒత్తిడి తట్టుకోలేక టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో ఓడిపోయాం'
author img

By

Published : Jul 11, 2020, 6:01 AM IST

అధిక ఒత్తిడి వల్లే మహిళల టీ20 ప్రపంచకప్​ ఫైనల్​లో పరాజయం చవిచూసినట్లు తెలిపారు టీమ్​ఇండియా మహిళా​ జట్టు చీఫ్​ సెలెక్టర్​ హేమలతా కాలా. తుదిపోరులో ఓటమి ఎదురైనా కెప్టెన్​ హర్మన్​ప్రీత్​ కౌర్​ ఇప్పటికీ ఉత్తమ క్రీడాకారిణే అని ఆమె అభిప్రాయపడ్డారు.

"జట్టు సభ్యులు పెద్ద టోర్నీలు ఆడటానికి సిద్ధంగా ఉన్నా.. వారికి తగినంత అనుభవం లేదు. దాంతో పాటు బ్యాటింగ్​ వైఫల్యం టీ20 ప్రపంచకప్​లో టీమ్​ను వెంటాడింది. పూర్తి ఒత్తిడితోనే మ్యాచ్​ను ముగించారు. అదే విధంగా 2017 వన్డే ప్రపంచకప్​లోనూ బ్యాటింగ్​ పతనమైంది. ఆస్ట్రేలియా, ఇంగ్లాండ్​ జట్లు గతంలో టీమ్​ఇండియాను ఓడించడం వల్ల క్రీడాకారిణిలపై ఒత్తిడి పెరిగి తుదిపోరులో పరాజయానికి కారణమైంది. ఓటమి ఎదురైనా ప్రస్తుత జట్టుకు హర్మన్​ప్రీత్​ అద్భుతమైన నాయకురాలు అనడంలో ఎలాంటి సందేహం లేదు. వన్డే క్రికెట్​ క్రికెట్​ కెప్టెన్​గా మిథాలీ రాజ్​ తప్పుకున్న తర్వాత ఆ బాధ్యతలను హర్మన్​ప్రీత్​కు అందజేయనున్నాం".

- హేమలతా కాలా, భారత ఉమెన్స్​ జట్టు చీఫ్​ సెలెక్టర్​

"నేను చెప్పినట్లుగా ఫైనల్​లో ఒత్తిడి ఏ విధంగా వస్తుందో గుర్తించి.. దాన్ని నియంత్రించాల్సిన అవసరం ఎంతైనా ఉంది. 2021 వన్డే ప్రపంచకప్​లో ఒత్తిడిని కచ్చితంగా అధిగమిస్తామని ఆశిస్తున్నా" అని హేమలతా కాలా వెల్లడించారు.

మహిళల టీ20 ఛాలెంజ్​ నిర్వహించి బీసీసీఐ మంచి పని చేసిందని.. కానీ తాము నాలుగు జట్లకు పైగా సిద్ధంగా ఉన్నామని ఊహించలేదని ఆమె తెలిపింది. ఐపీఎల్​ కోసం ఆరు జట్లుగా ఏర్పడటానికి రెండు నుంచి మూడేళ్ల కాలం పట్టొచ్చనే విషయాన్ని తెలియజేసింది హేమలత.

మహిళల క్రికెట్​లో హేమలతా కాలా.. భారత జట్టు తరపున 78 వన్డేలు, 7 టెస్టులకు ప్రాతినిధ్యం వహించారు. 2015లో జట్టు సెలెక్టర్​గా, 2016లో ప్యానెల్​ చీఫ్​గా సేవలందించారు.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.