ETV Bharat / sports

ఇకపై టీ20 ఆటగాళ్లకూ బీసీసీఐ కాంట్రాక్ట్​

ఆటగాళ్లకు ప్రతి ఏటా ప్రకటించే కాంట్రాక్ట్​లో టీ20లనూ బీసీసీఐ జతచేసింది. ఇప్పటివరకు వన్డేలు, టెస్టు క్రీడాకారులకు మాత్రమే వార్షిక వేతనం ఇచ్చేవారు. ఇకపై పొట్టి ఫార్మాట్​ ఆటగాళ్లకు వేతనం అందనుంది.

BCCI news
ఇకపై టీ20లకూ బీసీసీఐ కాంట్రాక్ట్​ వర్తింపు..
author img

By

Published : Nov 20, 2020, 5:31 PM IST

భారత క్రికెట్​ బోర్డు(బీసీసీఐ) తమ వార్షిక కాంట్రాక్ట్​ నిబంధనలను సవరించింది. ఇకపై టీమ్​ఇండియా తరఫున ఆడే టీ20 ఆటగాళ్లకు సెంట్రల్​ కాంట్రాక్ట్​ పొందవచ్చు. ఇందుకు ఆటగాడు కనీసం పది టీ20లు ఆడాల్సి ఉంటుంది. గతంలో వార్షిక ఒప్పందాలు కేవలం వన్డే, టెస్టు క్రికెటర్లకు మాత్రమే ఉండేవి.

సుప్రీం నిర్ణయంతో..

సుప్రీంకోర్టు నియమించిన క్రికెట్‌ పాలకుల కమిటీ(సీఓఏ) గతంలోనే టీ20 ఫార్మాట్​ను ఒప్పందాల్లో చేర్చాలని సూచించినా.. బోర్డు అందుకు ఒప్పుకోలేదు. అయితే ఇప్పుడు దాదా పాలకవర్గం ఈ నూతన మార్పునకు గ్రీన్​సిగ్నల్​ ఇచ్చింది. ప్రస్తుతం నాలుగు కేటగిరీల్లో కాంట్రాక్ట్​లు ఉంటున్నాయి. ఏ+ కేటగిరీలో ఉన్నవారికి ఏడాదికి రూ.7 కోట్లు, ఏ కేటగిరిలో ఉంటే రూ.5 కోట్లు, బి కేటగిరిలో రూ.3 కోట్లు, సీ కేటగిరీలో రూ.1 కోటి వార్షిక వేతనంగా బీసీసీఐ ఇస్తుంది. అయితే ఈ కాంట్రాక్ట్​లో చోటు దక్కించుకోవాలంటే ఆటగాడు కనీసం 3 టెస్టులు లేదా 7 వన్డేలు ఆడాల్సి ఉండేది.

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.