విశాఖ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్టులో భారత్ 203 పరుగుల తేడాతో ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్‌లో ఓ ప్రపంచ రికార్డు బద్దలైంది. అత్యధిక సిక్సర్లు(37) నమోదైన సుధీర్ఘ మ్యాచ్‌గా ఘనత అందుకుంది.
2014లో న్యూజిలాండ్ - పాకిస్థాన్ మధ్య జరిగిన టెస్టు మ్యాచ్‌లో 35 సిక్సర్లు నమోదయ్యాయి. ఇప్పటివరకు ఇదే రికార్డు ముందు వరుసలో ఉంది. టీమిండియా-సఫారీ జట్ల మధ్య ఆఖరిరోజు ఆటలో దక్షిణాఫ్రికా బ్యాట్స్‌మన్ డేన్ కొట్టిన సిక్సర్‌తో ఆ రికార్డు బ్రేక్ అయింది.
రెండు ఇన్నింగ్స్‌ల్లో కలిపి 13 సిక్సర్లు కొట్టిన రోహిత్ శర్మ ఓ మ్యాచ్‌లో అత్యధిక సిక్సర్లు కొట్టిన ఆటగాడిగా రికార్డునూ సొంతం చేసుకున్నాడు. అంతకుముందు పాకిస్థాన్ దిగ్గజ క్రికెటర్ వసీం అక్రమ్ జింబాబ్వేపై 12 సిక్సర్లు బాదాడు.
ముత్తయ్యను సమం చేసిన అశ్విన్..
ఈ మ్యాచ్‌లో బౌలింగ్ ప్రదర్శనతో శ్రీలంక క్రికెటర్ ముత్తయ్య మురళీధరన్ సరసన చేరాడు రవిచంద్రన్ అశ్విన్. టెస్టుల్లో వేగంగా 350 వికెట్లు తీసిన బౌలర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు. 66 మ్యాచ్‌ల్లో ఈ ఘనత సాధించి లంక దిగ్గజ క్రికెటర్ రికార్డును సమం చేశాడు అశ్విన్.
ఇదీ చదవండి: బాలీవుడ్ హీరోయిన్‌తో క్రికెటర్ రాహుల్ డేటింగ్..!