ETV Bharat / sports

కరోనా ఎఫెక్ట్​: ఐపీఎల్​ ప్రైజ్​మనీ సగానికి కోత - ipl prize money

పొదుపు చర్యల్లో భాగంగా ఐపీఎల్ ఛాంపియన్స్​ నగదు బహుమతిలో కోత విధించనుంది బీసీసీఐ. గతేడాదితో పోలిస్తే యాభై శాతం తగ్గించనున్నట్లు భారత క్రికెట్​ బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

Indian Premier League's prize money cut by 50%
ఐపీఎల్
author img

By

Published : Sep 15, 2020, 5:21 PM IST

కరోనా వల్ల బీసీసీఐ ఖర్చులను తగ్గించుకునే చర్యలను చేపట్టింది. ఈ నేపథ్యంలో ఐపీఎల్ 13వ సీజన్​ ఛాంపియన్స్ ప్రైజ్ మనీలో యాభై శాతం కోత విధించనుంది. గతేడాదితో పోలిస్తే నగదు బహుమతి సగానికి తగ్గించాలని బీసీసీఐ నిర్ణయం తీసుకుంది. ఈ మేరకు అన్ని ఫ్రాంచైజీలకు సమాచారం ఇచ్చినట్లు బోర్డు వర్గాలు స్పష్టం చేశాయి.

ఖర్చులను తగ్గించుకునే చర్యల్లో భాగంగా నగదు బహుమతులను సవరించినట్లు బీసీసీఐ తన నోటిఫికేషన్​లో తెలిపింది. ఈ సీజన్​ ఛాంపియన్స్​కు ఇచ్చే రూ.20 కోట్లను రూ.10 కోట్లకు కుదించింది. రన్నరప్​ ప్రైజ్​మనీని 12.5 కోట్ల నుంచి రూ.6.25 కోట్లకు తగ్గించింది. క్వాలిఫయర్స్​లో ఓటమి పాలైన రెండు జట్లకు రూ. 4.375 కోట్లు ఇవ్వనుంది.

Indian Premier League's prize money cut by 50%
ఐపీఎల్

ఫ్రాంచైజీలు ఆర్థికంగా మంచి స్థితిలో ఉన్నాయని, ఆదాయాన్ని సమకూర్చుకోవడానికి వాటికి స్పాన్సర్ షిప్ వంటి పలు మార్గాలున్నాయని తెలిపాయి బీసీసీఐ వర్గాలు. అందువల్ల నగదు బహుమతి కోతపై ఈ నిర్ణయం తీసుకున్నట్లు వెల్లడించాయి.

ఇదీ చూడండి 'ఐపీఎల్​కు​ కరోనా బీమా వర్తించదు'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.