క్రికెట్లో ఆటగాళ్లు బంతికి ఉమ్ము రాసి రుద్దుతూ కనిపిస్తుంటారు. ప్రస్తుతం కరోనా వ్యాప్తి ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ విధంగా చేయడం తగ్గించాలనుకుంటున్నట్లు చెప్పాడు భారత పేసర్ భువనేశ్వర్ కుమార్. అయితే ఎందుకు ఆ విధంగా ఉమ్మాల్సి వస్తుందో కారణం వెల్లడించాడు. గురువారం నుంచి దక్షిణాఫ్రికా-భారత్ మధ్య తొలి వన్డే ప్రారంభం కానుంది.
![Indian players might reduce usage of saliva for shining ball: Pacer Bhuvneshwar](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/6370628_india.jpg)
" మేము(ఆటగాళ్లు) బంతిపై ఉమ్మడం పూర్తిగా మానేస్తామని చెప్పట్లేదు. ఎందుకంటే అలా చేయకపోతే బంతి మెరవదు. అప్పడు బ్యాట్స్‌మన్ ఎలా బౌలింగ్ చేసినా సులభంగా ఎదుర్కొంటాడు. అప్పుడు జనాలే మా బౌలింగ్‌పై నిందలు వేస్తారు. అయితే బంతిని ఉమ్ముతో రుద్దడంపై జట్టు సమావేశంలో నిర్ణయం తీసుకుంటాం. అంతేకాకుండా డాక్టర్ సూచనలనూ పాటిస్తాం"
-- భువనేశ్వర్ కుమార్, టీమిండియా పేసర్
ఇప్పటికే భారత్‌లో 40 కరోనా కేసులు నమోదయ్యాయి. అయితే ఈ వైరస్ ప్రభావం కారణంగా.. అభిమానులకు కరచాలనం చేయొద్దని భారత ఆటగాళ్లకు యాజమాన్యం ఆదేశాలు జారీ చేసింది.
ఇదీ చూడండి...