ETV Bharat / sports

భారత అభిమానిపైనా జాతివివక్ష వ్యాఖ్యలు! - భారత అభిమానిపై భద్రతా సిబ్బంది జాతివివక్ష

భారత క్రికెటర్లపై జాత్యహంకార వ్యాఖ్యల ఉదంతం మరవకముందే మరో ఘటన వెలికి చూసింది. ఈసారి మనదేశానికి చెందిన ఓ అభిమానితో భద్రతా సిబ్బంది దురుసుగా ప్రవర్తించినట్లు తెలుస్తోంది.

Indian fan complains of racism at SCG
క్రికెటర్లపైనే కాదు.. అభిమానిపైనా జాతివివక్ష వ్యాఖ్యలు
author img

By

Published : Jan 16, 2021, 4:07 PM IST

సిడ్నీ మైదానంలోని భద్రాతా సిబ్బంది తనపై జాత్యహంకార వ్యాఖ్యాలు చేశారని భారత అభిమాని ఒకరు పై అధికారులకు ఫిర్యాదు చేశారు. 'ఏ దేశానికి చెందినవాడివో అక్కడికే వెళ్లు' అంటూ అన్నట్లు పేర్కొన్నారు. టీమ్​ఇండియా క్రికెటర్లు బుమ్రా, సిరాజ్​లపై ఇదే మైదానంలో జరిగిన జాతివివక్ష ఘటనపై అధికారులు ఇప్పటికే దర్యాప్తు చేస్తున్నారు.

ఏం జరిగిందంటే?

సిడ్నీలో నివసిస్తున్న భారత సంతతి వ్యక్తి కృష్ణ కుమార్.. మూడో టెస్టు చివరి రోజు మ్యాచ్​ చూసేందుకు మైదానానికి వెళ్లారు. అంతకు ముందు రెండు రోజులూ టీమ్​ఇండియాపై జాతివివక్ష వ్యాఖ్యలకు నిరసనగా.. 'వైరం సరే.. వివక్ష సరికాదు', 'స్నేహితులారా జాతివివక్ష వద్దు', 'బ్రౌన్ ఇన్​క్లూజన్ మ్యాటర్స్', 'క్రికెట్ ఆస్ట్రేలియా.. మరింత భిన్నత్వానికి చోటివ్వండి' అని రాసున్న బ్యానర్లను ఆయన తీసుకొచ్చారు.

వాటిని మైదానంలోకి తీసుకెళ్లేందుకు భద్రతా సిబ్బంది అభ్యంతరం తెలిపారని సిడ్నీ మార్నింగ్ హెరాల్డ్ తెలిపింది. అందులో ఓ బ్యానర్​ విషయమై ఇద్దరి మధ్య వివాదం జరిగిందని రాసుకొచ్చింది. పై అధికారులను కలిసేందుకు అభిమాని ప్రయత్నించగా.. 'నువ్వు ఏ దేశం నుంచి వచ్చావో అక్కడికే వెళ్లు' అంటూ తనను భద్రతా అధికారి హెచ్చరించినట్లు వెల్లడించాడు.

దీంతో బ్యానర్లను తన కారులోనే పెట్టి మైదానంలోకి వెళ్లానని కృష్ణకుమార్ చెప్పారు. అయినా సరే తన వెంట భద్రతా సిబ్బందిలోని ఒకర్ని పంపించి, తనపై నిఘా పెట్టినట్లు తెలిపారు.

ఇదీ చూడండి: సిరాజ్​పై మళ్లీ జాత్యహంకార వ్యాఖ్యలు

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.