వీళ్లు బ్యాట్పడితే ప్రత్యర్థి బౌలర్లకు చుక్కలు... బౌలింగ్ వేస్తే ముచ్చెమటలు.. మైదానంలో బౌండరీలు, వికెట్లతో విజృంభించే క్రికెటర్లు వెండితెరపైనా తమ అదృష్టాన్ని పరీక్షించుకుంటున్నారు. ఇటీవలే టీమిండియా పేసర్ శ్రీశాంత్ హీరోగా మెప్పించాడు. తాజాగా ఇర్ఫాన్ పఠాన్, హర్భజన్‌సింగ్ తెరంగేట్రం చేయనున్నారు. ఇలా బిగ్స్క్రీన్పై మెరిసిన కొంత మంది క్రికెటర్లను ఇప్పుడు చూద్దాం.
సచిన్ తెందూల్కర్..
క్రికెట్ దేవుడు సచిన్ తెందూల్కర్ ఆట కోసం ప్రాణంపెట్టి అరుదైన రికార్డులు సొంతం చేసుకున్నాడు. అయితే తన బయోపిక్‌లో తానే నటించి మరో ఘనతనూ సాధించాడు. 'సచిన్ బిలియనీర్స్ డ్రీమ్' పేరుతో 2017లో వచ్చిన ఈ సినిమా మాస్టర్ ప్రస్థానాన్ని వెండితెరపై ఆవిష్కరింపజేసింది.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin-7.jpg)
యువరాజ్ సింగ్..
యువీ బ్యాటింగ్‌కు అభిమానులు ఫిదా అయిపోతుంటారు. ఒకవేళ క్రికెటర్ కాకపోయినట్లయితే హీరో అవుదామనుకునే ఆలోచనలో ఉండేవాడట ఈ సిక్సర్ల వీరుడు. అంతేకాదు చిన్నతనంలోనే ఓ పంజాబీ చిత్రంలో బాలనటుడిగానూ మెప్పించాడు. 2008లో వచ్చిన 'జుంబో' అనే యానిమేటెడ్ సినిమాలో ఓ పాత్రకు తన గొంతు అరువిచ్చాడు.
- " class="align-text-top noRightClick twitterSection" data="">
శ్రీశాంత్..
2017లో వచ్చిన 'అక్సర్ 2' చిత్రంతో నటనలో ఓనమాలు నేర్చుకున్నాడు శ్రీశాంత్. అనంతరం మలయాళ చిత్రాలు టీమ్5, కాబారెట్లో మెప్పించాడు. కన్నడలోనూ 'కెంపెగౌడ2' అనే సినిమాలో నటించాడు. 2013 స్పాట్ ఫిక్సింగ్ అనంతరం క్రికెట్‌కు దూరమైన శ్రీశాంత్... ఇటీవల ఓ వెబ్‌సిరీస్‌లోనూ అడుగుపెట్టేందుకు ఓకే చెప్పేశాడు.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/19510218_1516096145122248_3525906521986526933_n_1210newsroom_1570871760_604.jpg)
సునీల్ గావస్కర్..
క్రికెట్లో తనదైన ప్రదర్శనతో అత్యంత విజయవంతమైన ఆటగాడిగా పేరు తెచ్చుకున్నాడు సునీల్ గావస్కర్. ఓ పక్క క్రికెటర్‌గానే కాకుండా నటనతోనూ ఆకట్టుకున్నాడు. 1980లో 'సావ్లీ ప్రేమాచీ' అనే మరాఠీ చిత్రంలో నటించాడు. ఇందులో ఓ పాట కూడా ఆలపించాడు సన్నీ.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin-6.jpg)
అజయ్ జడేజా..
1990లో భారత స్టార్ క్రికెటర్‌గా గుర్తింపు తెచ్చుకున్నాడు అజయ్ జడేజా. అనంతరం మ్యాచ్ ఫిక్సింగ్ ఆరోపణలతో ఆటకు దూరమయ్యాడు. 2003లో వచ్చిన ఖేల్ చిత్రంలో హీరోగా తన అదృష్టాన్ని పరీక్షించుకున్నాడు. అయితే ఆ సినిమా అనుకున్నంత ఆడకపోవడం వల్ల ప్రస్తుతం వ్యాఖ్యాత అవతారమెత్తాడు.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin-5.jpg)
వినోద్ కాంబ్లీ..
సచిన్ తెందూల్కర్ స్నేహితుడు, మాజీ క్రికెటర్ వినోద్ కాంబ్లీ 2000లో క్రికెట్‌కు దూరమయ్యాడు. అనంతరం బాలీవుడ్లో 'అనర్థ్' అనే చిత్రంలో నటించాడు. ఇందులో సునీల్ శెట్టి హీరో. అయితే ఈ సినిమా అనుకున్నంత స్థాయిలో ఆడలేదు.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin-4.jpg)
కపిల్‌దేవ్...
భారత్‌కు తొలి ప్రపంచకప్ అందించిన దిగ్గజం కపిల్‌దేవ్. బ్యాటింగ్, బౌలింగ్ల్లో తనదైన ఆటతో సత్తాచాటిన కపిల్.. సినిమాల్లోనూ నటించి ఆల్‌రౌండర్ అనిపించుకున్నాడు. పూర్తి స్థాయిలో కాకపోయినా చిన్న చిన్న పాత్రల్లో కనిపించాడు. 'ఇక్బాల్', 'ముజ్ సే షాదీ కరోగే' లాంటి చిత్రాల్లో ప్రత్యేక పాత్రల్లో మెరిశాడు.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/kapil_dev-770x433_1110newsroom_1570772623_366.webp)
యోగ్‌రాజ్‌సింగ్...
యువరాజ్ సింగ్ తండ్రి యోగ్‌రాజ్‌సింగ్ భారత్ తరపున ఓ టెస్టుతో పాటు ఆరు వన్డేలకు ప్రాతినిధ్యం వహించాడు. అనంతరం 30 పంజాబీ చిత్రాల్లోనూ నటించాడు. 2013లో విడుదలైన 'బాగ్ మిల్కా బాగ్' చిత్రం యోగ్రాజ్సింగ్కు బాగా గుర్తింపు తీసుకొచ్చింది.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin.jpg)
వీళ్లే కాకుండా సయ్యద్ కిర్మాణీ, సందీప్ పాటిల్, సాలిల్ అంకోలా లాంటి క్రికెటర్లు... ఆటతో పాటు నటనతోనూ మెప్పించారు.
![Indian Cricketers](https://etvbharatimages.akamaized.net/etvbharat/prod-images/4763314_sachin-2.jpg)