ప్రస్తుత భారత టెస్టు క్రికెటర్లలో నిలకడైన ఆటగాళ్లలో ముందు వరుసలో ఉంటారు విరాట్ కోహ్లీ, రహానే. మరి వారిద్దరూ ఆట గురించి కాకుండా తాజాగా వంటకాల గురించి మాట్లాడారు. విరాట్ ప్రత్యర్థి వేసే బంతిని పూరీతో పోలిస్తే... రహానే వడాపావ్‌ను ఏ చట్నీతో తింటే మంచిదని ప్రశ్నించాడు.
విరాట్ పూరీపైనే దృష్టి...
-
Ball out of the Bowlers hand and Chholle Bhature for a cheat meal deserve the same kind of focus. 👀😄 pic.twitter.com/ctEs96bvQa
— Virat Kohli (@imVkohli) January 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Ball out of the Bowlers hand and Chholle Bhature for a cheat meal deserve the same kind of focus. 👀😄 pic.twitter.com/ctEs96bvQa
— Virat Kohli (@imVkohli) January 9, 2020Ball out of the Bowlers hand and Chholle Bhature for a cheat meal deserve the same kind of focus. 👀😄 pic.twitter.com/ctEs96bvQa
— Virat Kohli (@imVkohli) January 9, 2020
టీమిండియా సారథి విరాట్ కోహ్లీ ఫిట్‌నెస్‌కు ఎక్కువ ప్రాధాన్యమిస్తాడు. జిమ్‌లో కసరత్తులు చేయకుండా ఒక్కరోజూ ఉండడట. ఆహారానికీ అంతే ప్రాధాన్యం ఇస్తాడు. కెలొరీలు లెక్కలేసుకొని మరీ తింటాడు. నోరు ఊరుతుంది కదా అని తీపి, పిండి, కొవ్వు పదార్థాల జోలికి అస్సలు వెళ్లడు. శీతల పానీయాల సంగతి సరేసరి. విదేశాల నుంచి మంచినీరు తెప్పించుకుంటాడు.
దేహ దారుఢ్యం, ఆహారం విషయంలో ఎంతో నిక్కచ్చిగా ఉండే విరాట్ గురువారం సోషల్ మీడియాలో పంచుకున్న ఓ సంగతి అందరినీ ఆశ్చర్యపరిచింది. ఎందుకంటే బౌలర్ విసిరే బంతిపై అతడు తీక్షణంగా దృష్టి సారిస్తాడు. అంతే తీవ్రత తనకు పూరీ, శెనగల కూర పైనా ఉంటుందట.
" బౌలర్ చేతుల్లోంచి విడిచిన బంతి, ఛీట్ మీల్‌కు పూరీ, శెనగల కూరపై ఒకే రకమైన శ్రద్ధ అవసరం" అని ఇన్‌స్టాలో పెట్టాడు. ఈ పోస్టుపై అభిమానుల నుంచి భారీగా నవ్వు తెప్పించే రీట్వీట్లు వస్తున్నాయి. తమకూ ఆ వంటకం ఎంతో ఇష్టమని అంటున్నారు.
సాధారణంగా దిల్లీలో నివసించే వారు ఈ ఆహారాన్ని ఎక్కువగా ఇష్టపడతారు. గతంలోనూ 'బ్రేక్‌ఫాస్ట్ విత్ ఛాంపియన్స్' అనే కార్యక్రమంలో రాజౌరీ గార్డెన్‌లో పూరీ, శెనగల కూర రుచి గురించి విరాట్ ఎంతో గొప్పగా చెప్పాడు.
రహానే 'వడాపావ్'...
-
How do you like your vada pav? 😋
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 10, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
1. Vada pav with chai
2. Vada pav with chutney
3. Just Vada pav pic.twitter.com/nyOD5cdPrb
">How do you like your vada pav? 😋
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 10, 2020
1. Vada pav with chai
2. Vada pav with chutney
3. Just Vada pav pic.twitter.com/nyOD5cdPrbHow do you like your vada pav? 😋
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 10, 2020
1. Vada pav with chai
2. Vada pav with chutney
3. Just Vada pav pic.twitter.com/nyOD5cdPrb
టీమిండియా టెస్టు ఉప సారథి అజింక్య రహానే.. ఓ వడాపావ్ అంశంతో నెట్టింట చర్చనీయాంశంగా మారాడు. శుక్రవారం.. బయట సరదాగా ఈ వంటకం తిన్న స్టార్ క్రికెటర్ అభిమానులకు ఓ ప్రశ్న సంధించాడు. వడాపావ్ సాదాగా, ఛాయ్, చట్నీల్లో ఏ కాంబినేషన్లో తింటే బాగుంటుందా అని అడిగాడు. దీనికి మాస్టర్ బ్లాస్టర్ సచిన్ నుంచి ఊహించని స్పందన వచ్చింది.
" నాకైతే వడాపావ్‌ను కొంచెం ఎరుపు, గ్రీన్, నిమ్మకాయ చట్నీల్లో అలా అలా ముంచుకుని తింటే ఆ కాంబినేషన్ వేరు. దాని రుచి దేనికి సాటిరాదు".
-- సచిన్ తెందుల్కర్.
సచిన్ తెందుల్కర్‌కు వడాపావ్ అంటే చాలా ఇష్టం. చిన్నప్పుడు జింఖానా మైదానం వద్దనే ప్రాక్టీసులో గడిపేవాడు లిటిల్ మాస్టర్. ఆ పక్కనే వడాపావ్ ఉండేదని, తన ఫ్రెండ్స్‌తో కలిసి తినేవాడినని చెప్పాడు. తన కొడుకు అర్జున్‌తో కలిసి తరచుగా అక్కడకి వెళ్తానని 2011లో ఓ ఇంటర్వ్యూలో వెల్లడించాడు.
గురువారం రోహిత్‌శర్మ-రితికా జోడీతో భార్య రాధికా, తను కలిసి తీసుకున్న ఫొటోను షేర్ చేశాడు రహానే. ప్రస్తుతం న్యూజిలాండ్ సిరీస్ సన్నాహాల్లో ఉన్నాడు. ఫిబ్రవరి 7-10 మధ్య జరిగే సుదీర్ఘ ఫార్మాట్ మ్యాచ్‌ల్లో ఇతడు ఇండియా-ఏ తరఫున ఆడనున్నాడు. కివీస్‌తో రెండు టెస్టుల సిరీస్.. ఫిబ్రవరి 21 నుంచి ప్రారంభం కానుంది.
-
2020: Dinners filled with conversations about our daughters & parenting pic.twitter.com/b9Z8wKChXc
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 9, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">2020: Dinners filled with conversations about our daughters & parenting pic.twitter.com/b9Z8wKChXc
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 9, 20202020: Dinners filled with conversations about our daughters & parenting pic.twitter.com/b9Z8wKChXc
— Ajinkya Rahane (@ajinkyarahane88) January 9, 2020