ETV Bharat / sports

రెండోసారి తండ్రైన టీమిండియా వికెట్ కీపర్ - Wriddhiman Saha news

టీమిండియా వికెట్​ కీపర్​​ వృద్ధిమాన్​ సాహా.. మరోసారి తండ్రయ్యాడు. అతడి భార్య రోమీ.. పండంటి బాబుకు శుక్రవారం జన్మనిచ్చింది. ఆ ఫొటోలను సోషల్​ మీడియాలో పంచుకున్నాడీ​ క్రికెటర్​.

Indian Cricketer Wriddhiman Saha blessed with a boy on march 6th, 2020
రెండోసారి తండ్రైన భారత క్రికెటర్​ వృద్ధిమాన్​ సాహా
author img

By

Published : Mar 7, 2020, 1:48 PM IST

భారత క్రికెట్ జట్టు వికెట్​ కీపర్​ వృద్ధిమాన్​ సాహా, రోమీ దంపతులకు మగబిడ్డ పుట్టాడు. శుక్రవారం.. ఓ ప్రైవేటు ఆసుపత్రిలో బాబు జన్మించినట్లు వెల్లడించాడీ​ క్రికెటర్​. ఈ ఆనందాన్ని అభిమానులతో పంచుకున్నాడు. ఈ నేపథ్యంలోనే అభిమానులు, పలువురు క్రికెటర్ల నుంచి శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. ఇప్పటికే ఈ దంపతులకు అన్వి అనే పాప ఉంది.

Indian Cricketer Wriddhiman Saha blessed with a boy on march 6th, 2020
వృద్ధిమాన్​ సాహా

పాప అన్వితో సాహా, రోమీ దంపతులు

గతేడాది వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్​లో విఫలమైన కీపర్‌ రిషభ్ పంత్​ను పక్కనపెట్టింది టీమిండియా. ఆ తర్వాత దక్షిణాఫ్రికా, బంగ్లాదేశ్​తో మ్యాచ్​ల్లో బంగాల్‌ కీపర్‌ వృద్ధిమాన్‌ సాహాను కొనసాగించింది. ఇతడు కీపింగ్‌తో ఆకట్టుకోవడమే కాకుండా, అవసరమైన వేళ బ్యాట్‌తోనూ రాణించాడు. కోహ్లీ.. గతంలో మీడియాతో మాట్లాడుతూ.. "సుదీర్ఘ ఫార్మాట్‌లో సాహా ప్రపంచంలోనే అత్యుత్తమ కీపర్‌" అని మెచ్చుకున్నాడు.

పంత్‌కు ఎన్ని అవకాశాలిచ్చినా విఫలమవడం, సాహా ప్రదర్శన బాగుండటం వల్ల కివీస్‌తో టెస్టు సిరీస్‌కు బంగాల్‌ కీపర్‌నే ఎంపిక చేస్తారని అంతా భావించారు. అయితే, కెప్టెన్‌ కోహ్లీ అనూహ్యంగా సాహాను పక్కనపెట్టి పంత్‌కు మరో అవకాశమిచ్చాడు. ఈ నేపథ్యంలో వచ్చిన అవకాశాన్ని పంత్‌ చేతులారా వృథా చేసుకున్నాడు. తాజాగా ముగిసిన ఈ సిరీస్​లోనూ పెద్దగా రాణించలేదు రిషభ్.

ETV Bharat Logo

Copyright © 2025 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.