ETV Bharat / sports

'అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. నా స్థానంపైనా ఆలోచిస్తా'

వాంఖడే వేదికగా ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో... టీమిండియా అన్ని విభాగాల్లో విఫలమైందన్నాడు కెప్టెన్​ విరాట్​ కోహ్లీ. అంతేకాకుండా బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులపైనా పునరాలోచిస్తామని పేర్కొన్నాడు. మంగళవారం జరిగిన ఈ మ్యాచ్​లో ఆసీస్​ జట్టు 10 వికెట్ల తేడాతో గెలుపొందింది.

Indian Cricket Fans need to Relax and Not Panic by Virat Kohli on His Batting Position
'అన్ని విభాగాల్లో విఫలమయ్యాం.. నా స్థానంపైనా ఆలోచిస్తా'
author img

By

Published : Jan 15, 2020, 9:18 AM IST

టీమిండియాతో జరిగిన తొలి వన్డేలో ఆస్ట్రేలియా భారీ విజయం సాధించింది. ఒక్క వికెట్​ కోల్పోకుండా 255 పరుగుల లక్ష్యాన్ని ఛేదించింది కంగారూ జట్టు. ఓపెనర్లు వార్నర్​(128*), ఫించ్​(110*) మ్యాచ్​ను ముగించేశారు. వాంఖడేలో భారత్‌ అన్ని విభాగాల్లో విఫలమైందని టీమిండియా కెప్టెన్‌ విరాట్‌ కోహ్లీ మ్యాచ్‌ అనంతరం అంగీకరించాడు. ఆ విషయం తమ బ్యాటింగ్‌ అప్పుడే అర్థమైందని కోహ్లీ తెలిపాడు.

"ఈ మ్యాచ్‌లో కొన్ని సందర్భాల్లో మేం అతి జాగ్రత్తగా ఆడాం. అదే మా కొంప ముంచింది. ఆస్ట్రేలియా లాంటి పెద్ద జట్టుతో అలా ఆడాల్సింది కాదు. టీమిండియా ఇప్పుడు కోలుకోవాల్సిన సమయం. అయితే, ఈ రోజు మాత్రం ఆస్ట్రేలియాకే క్రెడిట్‌ దక్కుతుంది. అంతర్జాతీయ క్రికెట్‌ ఎప్పుడూ వెల కట్టలేనిది. ఈ రోజు మేం ఏ సందర్భంలోనూ ఆసీస్‌పై ఆధిపత్యం చెలాయించలేకపోయాం".

-- విరాట్​ కోహ్లీ, టీమిండియా సారథి.

బ్యాటింగ్​ ఆర్డర్​లో మార్పులు భారత్​ను దెబ్బ తీశాయి. ముగ్గురు ఓపెనర్లు (రాహుల్‌, రోహిత్‌, ధావన్‌)లను జట్టులో ఆడించడం కోసం చేసిన ప్రయోగం ఫలించలేదు. యువ ఆటగాళ్లకు అవకాశాలు ఇవ్వడం కోసం కెప్టెన్‌ కోహ్లీ తాను ఎప్పుడూ వచ్చే మూడో స్థానాన్ని వదులుకున్నాడు. ఈ మ్యాచ్‌లో రాహుల్‌ మూడో స్థానంలో రాగా.. విరాట్​ నాలుగులో వచ్చాడు. ఈ అంశంపైనా స్పందించాడు కోహ్లీ.

Indian Cricket Fans need to Relax and Not Panic by Virat Kohli on His Batting Position
విరాట్​ కోహ్లీ

"నేను నాలుగో స్థానంలో బ్యాటింగ్‌ చేయడంపై గతంలో చాలాసార్లు చర్చించాం. రాహుల్‌ రాణిస్తుండం వల్ల అతడిని బ్యాటింగ్‌ ఆర్డర్‌లో ముందుకు పంపాం. కానీ ఈ మార్పు సత్ఫలితాన్ని ఇచ్చిందని అనిపించడం లేదు. ఈ విషయంపై పునరాలోచన చేయాల్సి ఉంది. కుర్రాళ్లకు అవకాశాలు ఇస్తున్నాం. బ్యాటింగ్‌ ఆర్డర్‌లో మార్పులు చేసి పరీక్షిస్తున్నాం. ఒక మ్యాచ్‌ ఓటమితో భయపడాల్సిన అవసరం లేదు. ప్రయోగాలు చేసినప్పుడు ఒక్కోసారి వైఫల్యం తప్పదు. బలమైన ఆసీస్‌పై బాగా ఆడకపోతే మూల్యం చెల్లించక తప్పదు. బౌలర్లను తప్పు పట్టాల్సిన అవసరం లేదు"

-- విరాట్​ కోహ్లీ

>> అంతర్జాతీయ క్రికెట్​లో ఇప్పటివరకు 4వ స్థానంలో 7 ఇన్నింగ్స్​లు ఆడిన కోహ్లీ... 62 పరుగుల స్కోరు మాత్రమే సాధించాడు. సగటు 10.66గా నమోదైంది.

>> ఒక్క వికెట్‌ కూడా కోల్పోకుండా ఆసీస్‌ సాధించిన రెండో అతిపెద్ద విజయం ఇది. 2017లో బంగ్లాదేశ్‌పై 279 పరుగుల లక్ష్యాన్ని వికెట్‌ నష్టపోకుండా అందుకుంది. ఛేదనలో ఇద్దరు ఆసీస్‌ ఓపెనర్లు సెంచరీ చేయడం కూడా ఇది రెండోసారి మాత్రమే.

>> టీమిండియా వన్డేల్లో 10 వికెట్ల తేడాతో 5 సార్లు ఓడిపోయింది. స్వదేశంలో ఇది రెండోసారి.

>> అభేద్యమైన తొలి వికెట్‌కు వార్నర్‌-ఫించ్‌ 258 పరుగుల జోడించారు. భారత్‌పై ఇదే అత్యధిక ఓపెనింగ్‌ భాగస్వామ్యం.

RESTRICTION SUMMARY: AP CLIENTS ONLY
SHOTLIST:
ASSOCIATED PRESS - AP CLIENTS ONLY
Tagaytay, Philippines - 15 January 2020
1. Various of ash clouds rising from Taal Volcano
STORYLINE:
Plumes of smoke and ash continued to rise on Wednesday from a small volcano near the Philippine capital, as tens of thousands of people evacuated the area.
The Taal Volcano has been on alert level 4 since the eruption began on Sunday, indicating eruption is possible.
The next level up, level 5, means eruption is underway.
A UN spokesperson said more than 38,000 people have been relocated so far to over 200 evacuation centres.
The volcano lies in the middle of a lake in Batangas province south of Manila.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.