ప్రపంచ క్రికెట్ దిగ్గజం, భారత మాజీ క్రికెటర్ సచిన్ తెందుల్కర్... కోచ్‌గా బాధ్యతలు చేపట్టనున్నాడు. ఆస్ట్రేలియా మాజీ క్రికెటర్ రికీ పాంటింగ్ సారథ్యంలోని జట్టుకు ఈ సేవలందించనున్నాడు. మరోవైపు ప్రత్యర్థి జట్టుకు మరో దిగ్గజం, వెస్టిండీస్ మాజీ క్రికెటర్ కోర్ట్నే వాల్ష్ కోచ్‌గా పనిచేయనున్నాడు. ఇతడు షేన్ వార్న్ సారథ్యంలోని జట్టుకు తర్ఫీదు ఇవ్వనున్నాడు. సచిన్-కోర్ట్నే ఒక్కరోజే ఈ బాధ్యతల్లో కనిపించనున్నారు. స్టీవ్ వా, ఆస్ట్రేలియా మహిళా క్రికెటర్ మేల్ జోన్స్.. వ్యాఖ్యాతలుగా ఆకట్టుకోనున్నారు.
ఫిబ్రవరి 8న 'బుష్ఫైర్ క్రికెట్ బాష్'లో భాగంగా ఇది సాధ్యం కానుంది. ఈ ఛారిటీ మ్యాచ్ ద్వారా వచ్చిన నిధులను ఆస్ట్రేలియాలోని కార్చిచ్చు బాధిత కుటుంబాలకు అందించనున్నారు.
మూడు ప్రధాన మ్యాచ్‌లు...
బుష్ ఫైర్ క్రికెట్ బాష్‌తో పాటు ఆస్ట్రేలియా-భారత్ మధ్య మహిళల టీ20, బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ ద్వారా వచ్చిన విరాళాలను కూడా ఆస్ట్రేలియా రెడ్‌క్రాస్‌కు అందజేయనున్నారు. సచిన్ కోచ్‌గా పనిచేయనున్న 'బుష్ ఫైర్ క్రికెట్ బాష్' మ్యాచ్... బిగ్‌బాష్ లీగ్ ఫైనల్ ముందు జరగనుంది. జనవరి 31న ఈ మ్యాచ్ వేదికను ప్రకటిస్తారు.
సచిన్ తెందుల్కర్, వాల్ష్కు సాదర స్వాగతం పలుకుతూ ట్వీట్ చేసింది క్రికెట్ ఆస్ట్రేలియా. ఇద్దరినీ ఆస్ట్రేలియాకు పిలవడం గొప్ప అవకాశంగా భావిస్తున్నట్లు పేర్కొంది. ప్రత్యేకమైన రోజున దిగ్గజాలు ఇద్దరినీ కలవడం కోసం చాలా ఆసక్తిగా ఎదురుచూస్తున్నట్లు ట్వీట్ చేసింది.
-
Legends Sachin Tendulkar & Courtney Walsh have added some serious star power to the upcoming #BigAppeal bushfire relief match | https://t.co/92dwmyQzDo pic.twitter.com/gJUFhlgcpb
— cricket.com.au (@cricketcomau) January 21, 2020 " class="align-text-top noRightClick twitterSection" data="
">Legends Sachin Tendulkar & Courtney Walsh have added some serious star power to the upcoming #BigAppeal bushfire relief match | https://t.co/92dwmyQzDo pic.twitter.com/gJUFhlgcpb
— cricket.com.au (@cricketcomau) January 21, 2020Legends Sachin Tendulkar & Courtney Walsh have added some serious star power to the upcoming #BigAppeal bushfire relief match | https://t.co/92dwmyQzDo pic.twitter.com/gJUFhlgcpb
— cricket.com.au (@cricketcomau) January 21, 2020
మాజీల క్రికెట్...!
ఒకప్పుడు క్రికెట్‌ను ఏలిన మాజీ క్రికెటర్లు రికీ పాంటింగ్, షేన్ వార్న్‌తో పాటు ఆస్ట్రేలియా కోచ్ జస్టిన్ లాంగర్, మాజీ వికెట్ కీపర్ ఆడమ్ గిల్‌క్రిస్ట్, బ్రెట్‌లీ, షేన్ వాట్సన్, అలెక్స్ బ్లాక్వెల్, మైఖేల్ క్లార్క్ ఈ మ్యాచ్‌లో బరిలోకి దిగనున్నారు.
ఇటీవల కార్చిచ్చు కారణంగా ఆస్ట్రేలియాలో కోట్లాది జంతువులు చనిపోగా, వేలాది ఎకరాల అడవి దగ్ధమైంది. ఈ విపత్తులో చాలా మంది ప్రజలు నిరాశ్రయులయ్యారు. బాధితులకు సాయం చేసేందుకు పలు దేశాల్లోని క్రీడా సంఘాలూ ముందుకొస్తున్నాయి. ఇటీవల హాకీ ఇండియా కూడా రూ.17 లక్షలకు పైగా ఆర్థిక సాయం చేసింది. టెన్నిస్ ప్లేయర్లు, క్రికెటర్లు, పలు క్రీడారంగాల ఆటగాళ్లు తమ వంతు సాయం చేసేందుకు ముందుకొస్తున్నారు.