వెస్టిండీస్‌తో జరుగుతున్న నిర్ణయాత్మక మూడో వన్డేలో భారత్ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది. కటక్ వేదికగా జరుగుతున్న ఈ మ్యాచ్‌లో నెగ్గి సిరీస్ కైవసం చేసుకోవాలని భావిస్తున్నాయి ఇరు జట్లు. 1-1 తేడాతో సిరీస్ సమంగా ఉంది.
కటక్ బారబతి పిచ్ బ్యాటింగ్‌కు అనుకూలించే అవకాశముంది. గత 15 ఏళ్ల కాలంలో ఈ మైదానంలో భారత్ ఆరు వన్డేలాడగా ఒక్క మ్యాచ్‌లోనూ ఓడలేదు.
అయితే ఈ పిచ్‌పై విరాట్ కోహ్లీకి పేలవ రికార్డు ఉంది. ఇక్కడ జరిగిన నాలుగు అంతర్జాతీయ మ్యాచ్‌ల్లో కలిపి అతను కేవలం 34 పరుగులే చేశాడు. మూడు వన్డేల్లో వరుసగా 3, 22, 1 పరుగులు చేసిన విరాట్.. ఏకైక టీ20లో 8 పరుగులకే పరిమితమయ్యాడు.
జట్లు..
భారత జట్టు:
రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్, విరాట్ కోహ్లీ(కెప్టెన్), శ్రేయస్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), కేదార్ జాదవ్, రవీంద్ర జడేజా, మహ్మద్ షమీ, శార్దుల్ ఠాకుర్, నవదీప్ సైనీ.
వెస్టిండీస్ జట్టు:
షై హోప్(కీపర్), ఎవిన్ లూయిస్, షిమ్రన్ హెట్మెయిర్, నికోలస్ పూరన్, రోస్టన్ ఛేజ్, కీరన్ పొలార్డ్(కెప్టెన్), జేసన్ హోల్డర్, కీమో పాల్, అల్జారీ జోసెఫ్, షెల్డన్ కాట్రెల్,కేరీ పియరే.
ఇదీ చదవండి: ఫిఫా క్లబ్ ప్రపంచకప్ విజేతగా లివర్‌పుల్