ETV Bharat / sports

టీ20 ప్రపంచకప్​లో భారత్ రెండో విజయం

బంగ్లాదేశ్​పై సమష్టిగా రాణించి విజయం దక్కించుకుంది మహిళా భారత్. బ్యాటింగ్​లో షెఫాలీ వర్మ, బౌలింగ్ పూనమ్ యాదవ్ రాణించారు.​

టీ20 ప్రపంచకప్​లో భారత్ రెండో విజయం
షెఫాలీ వర్మ
author img

By

Published : Feb 24, 2020, 7:44 PM IST

Updated : Mar 2, 2020, 10:50 AM IST

టీ20ల్లో మరో అద్భుత విజయం సాధించింది మహిళా భారత్. పెర్త్ వేదికగా బంగ్లాదేశ్​తో ఈరోజు జరిగిన మ్యాచ్​లో 18 పరుగుల తేడాతో గెలిచింది. తొలి పోరులో ఆస్ట్రేలియాను మట్టికరిపించింది టీమిండియా.

ఈ మ్యాచ్​లో తొలుత బ్యాటింగ్ చేసిన భారత్.. నిర్ణీత 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 142 పరుగులు చేసింది. షెఫాలీ వర్మ(39), జెమీమా రోడ్రిగ్జ్(34) రాణించారు. మెరుపు వేగంతో బౌండరీలు కొట్టిన షెఫాలీ.. ఉన్నంతసేపు స్కోరు బోర్డును పరుగులు పెట్టించింది. పన్నా ఘోశ్ బౌలింగ్​లో భారీ షాట్​కు ప్రయత్నించి పెవిలియన్​కు చేరింది. బంగ్లా బౌలర్లలో సల్మా, పన్నా.. తలో రెండు వికెట్లు తీశారు.

team india women cricketers
భారత జట్టు మహిళా క్రికెటర్లు

అనంతరం ఛేదనలో బంగ్లా జట్టు.. నిర్ణీత ఓవర్లో 8 వికెట్ల నష్టానికి 124 పరుగులే చేయగలిగింది. ముర్షీదా ఖాతున్ 30, నిగర్ సుల్తానా 35 పరుగులు చేశారు. మిగతా బ్యాట్స్​ఉమెన్​లో అందరూ స్వల్ప స్కోర్లకే వెనుదిరిగారు. భారత బౌలర్లలో పూనమ్ యాదవ్ 3, అరుంధతి రెడ్డి 2, రాజేశ్వరి, శిఖా తలో వికెట్ పడగొట్టి సత్తాచాటారు.

bangladesh cricketer
బ్యాటింగ్​ చేస్తున్న బంగ్లా మహిళా క్రికెటర్

Last Updated : Mar 2, 2020, 10:50 AM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.