వన్డే సిరీస్‌ను 2-1 తేడాతో గెలిచిన భారత మహిళా జట్టు టీ20లో ఆ స్థాయి ప్రదర్శన కనబర్చలేకపోయింది. ఇప్పటికే సిరీస్ కోల్పోయిన మంధాన సేన... ఆఖరి మ్యాచ్‌లో అయినా గెలిచి పరువు నిలుపుకోవాలని భావిస్తోంది. పొట్టి ఫార్మాట్లో భారత్ ఇప్పటికే ఆరు మ్యాచులు వరుసగా ఓడిపోయింది. వచ్చే ఏడాది జరిగే ప్రపంచకప్ ముందు ఇలాంటి ప్రదర్శన జట్టు మేనేజ్మెంట్ను కలవరపెడుతోంది.
రెగ్యులర్ కెప్టెన్ హర్మన్ ప్రీత్ గాయంతో దూరమవగా స్మృతి మంధాన తాత్కాలిక కెప్టెన్‌గా వ్యవహరిస్తోంది. రెండు మ్యాచ్‌ల్లోనూ టాప్ ఆర్డర్ విఫలమవడం జట్టుకు ఆందోళన కలిగిస్తోంది.
"రెండో టీ20లో ప్రత్యర్థి ముందు 112 పరుగుల లక్ష్యాన్ని కాపాడుకోవడానికి బౌలర్లు కష్టపడ్డారు. మరో 10-15 పరుగులు సాధించి ఉంటే బాగుండేది. బౌలింగ్ విభాగం బాగున్నా బ్యాట్స్ ఉమెన్ రాణించాల్సిన అవసరం ఉంది".
-- స్మృతి మంధాన, కెప్టెన్
సిరీస్ గెలిచిన ఇంగ్లండ్ జట్టు క్లీన్ స్వీప్‌పై కన్నేసింది. ఆఖరి మ్యాచ్‌లోనూ గెలిచి సమరోత్సాహంతో స్వదేశానికి వెళ్లాలని భావిస్తోంది.
ఉదయం 11 గంటలకు ఆట ప్రారంభం కానుంది.
జట్ల అంచనా
భారత్
స్మృతి మంధాన (కెప్టెన్), మిథాలీ రాజ్, రోడ్రిగ్స్, దీప్తి శర్మ, తానియా భాటియా, భారతి ఫుల్మలి, అనుజా పాటిల్, శిఖా పాండే, కోమల్ జంజద్, అరుంధతి రెడ్డి, పూనమ్ యాదవ్, ఏక్తా బిస్త్, రాధా యాదవ్, వేదా కృష్ణమూర్తి, హర్లిన్ డియోల్.
ఇంగ్లండ్
హేతర్ నైట్ (కెప్టెన్), టామీ బ్యుమాంట్, కేథరిన్ బ్రంట్, కేట్ క్రాస్, సోఫీ, ఫ్రెయా డేవిస్, ఎల్విస్, ఎలెన్ జోన్స్, మార్ష్, సీవర్, అన్య, లిన్సీ స్మిత్, లారెన్ విన్ ఫీల్డ్, వైట్, అలెక్స్