ETV Bharat / sports

'వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ మనదే' - harbhajan on IPL

వచ్చే ఏడాది జరిగే టీ20 ప్రపంచకప్​లో భారత్​ విజేతగా నిలుస్తుందని టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్ ధీమా వ్యక్తం చేశాడు. ఆల్​ రౌండర్​ హార్దిక్​ పాండ్యా జట్టులో ముఖ్యమైన ఆటగాడని, బెస్ట్ ఫినిషర్ అని పేర్కొన్నాడు.

Harbhajan Sing
'వచ్చే ఏడాది టీ20 ప్రపంచకప్​ భారత్ గెలుస్తుంది'
author img

By

Published : Dec 8, 2020, 3:43 PM IST

రానున్న టీ20 ప్రపంచకప్​లో భారత్​ విజేతగా నిలుస్తుందని ధీమా వ్యక్తం చేశాడు టీమ్ఇండియా వెటరన్ స్పిన్నర్ హర్భజన్ సింగ్. ఆస్ట్రేలియాపై సిరీస్​ గెలిచిన నేపథ్యంలో ఈ వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం కోహ్లీసేన దృఢంగా ఉందని అన్నాడు.

ఐపీఎల్ దేశీయ యువ ఆటగాళ్లకు సరైన అవకాశం ఇస్తోందని భజ్జీ పేర్కొన్నాడు. చాలా మంది ఆటగాళ్లు తీవ్ర ఒత్తిడిలో కూడా తమ జట్టు విజయం కోసం కృషి చేశారని ఇది భారత్​కు ఉపయోగపడే విషయమని అన్నాడు.

మంచి ఫినిషర్..

ఆస్ట్రేలియాతో జరిగిన టీ20 సిరీస్​ గెలవడంలో కీలక పాత్ర పోషించిన ఆల్​ రౌండర్ హార్దిక్​ పాండ్యాను ప్రశంసించాడు హర్భజన్. రసెల్​ కన్నా హార్దిక్​ ప్రమాదకర బ్యాట్స్​మన్ అని కొనియాడాడు.

ఇదీ చదవండి:ముంబయి వీధుల్లో రోహిత్​ ప్రత్యక్షం.. ఎందుకంటే?

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.