ETV Bharat / sports

'ఇలాంటి ఫీల్డింగ్​తో భారత్​కు​ ప్రపంచకప్​లో​ కష్టమే'

author img

By

Published : Dec 10, 2020, 5:40 AM IST

ఆస్ట్రేలియా పర్యటనలో భాగంగా భారత జట్టు పేలవమైన ఫీల్డింగ్​పై కీలక వ్యాఖ్యలు చేశాడు భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్. ఇలాంటి ఫీల్డింగ్​ కొనసాగిస్తే రానున్న ప్రపంచకప్​లో భారత్ కీలక మ్యాచ్​ల్లో ఓడిపోయే ప్రమాదముందని హెచ్చరించాడు.

Mohammad Kaif
'ఫీల్డింగ్​ ఇలాగే ఉంటే ప్రపంచకప్​లో కష్టమే'

భారత జట్టు ఫీల్డింగ్​ ఇదేవిధంగా కొనసాగితే రానున్న టీ20 ప్రపంచకప్​లో మరిన్ని మ్యాచ్​లు ఓడిపోతుందని భారత మాజీ ఆటగాడు మహ్మద్ కైఫ్ అన్నాడు. జట్టు పేలవంగా ఫీల్డింగ్​ చేస్తోన్న నేపథ్యంలో కైఫ్​ కీలక వ్యాఖ్యలు చేశాడు.

"క్యాచ్​లు మిస్​ చేయడం, ఫీల్డింగ్​లో పొరపాట్లు జరగడం వంటివి ఆటలో భాగమవ్వకూడదు. 2021అక్టోబర్​లో జరిగే ప్రపంచకప్​ గెలవాలంటే భారత్​ ఈ రకమైన ఫీల్డింగ్​ విధానాన్ని మార్చుకోవాలి. లేదంటే కీలక మ్యాచ్​ల్లో ఓటమిపాలయ్యే అవకాశముంది"

- మహ్మద్ కైఫ్, భారత మాజీ ఆటగాడు.

ఆటగాళ్లు సరిగ్గా ఫీల్డింగ్​ చేయకపోతే యువ బౌలర్లపై దాని ప్రభావం పడుతుందని కైఫ్​ ఆవేదన వ్యక్తం చేశాడు. తాను జట్టులో ఉన్నప్పటి రోజులను గుర్తుచేసుకున్న మాజీ బ్యాట్స్​మన్.. మిస్​ ఫీల్డింగ్​ చేసిన ఆటగాళ్లకు ఎక్కువ సమయం శిక్షణ ఇచ్చేవారని తెలిపాడు.

ఇదీ చదవండి:ఆ లోటు సరిదిద్దుకోకపోతే టీమ్​ఇండియాకు కష్టమే

'మ్యాచ్​ మధ్యలో ఆ ప్లకార్డుల ప్రదర్శన తప్పే'

ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.