ఇంగ్లాండ్ ఆల్‌రౌండర్ బెన్ స్టోక్స్‌పై ప్రశంసల జల్లు కురిపించాడు టీమ్ఇండియా మాజీ ఫాస్ట్ బౌలర్ ఇర్ఫాన్ పఠాన్. అతడిలాంటి ఆల్‌రౌండర్ టీమ్ఇండియాలో ఒక్కడుంటే ప్రపంచంలో ఉన్న ఏ జట్టు కూడా భారత్‌ను ఓడించలేదని అభిప్రాయపడ్డాడు.
ప్రస్తుతం ఇంగ్లాండ్, వెస్డిండీస్‌తో ద్వైపాక్షిక సిరీస్ ఆడుతోంది. ఇందులో భాగంగా తొలి టెస్టులో ఇంగ్లీష్ జట్టు ఓడినా.. రెండో టెస్టులో 113 పరుగుల తేడాతో విండీస్‌పై విజయం సాధించి సిరీస్‌ను 1-1తో సమం చేసింది.
అయితే ఈ విజయంలో కీలక పాత్ర పోషించి 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్'గా నిలిచాడు స్టోక్స్. తొలి ఇన్నింగ్స్‌లో 176 పరుగులతో ఆకట్టుకున్న ఇతడు.. రెండో ఇన్నింగ్స్‌లో 78 పరుగులు చేశాడు. ఈ నేపథ్యంలో స్టోక్స్ అద్భుత ఆటతీరుపై క్రికెటర్లందరూ ప్రశంసలు కురిపిస్తున్నారు.
ఇది చూడండి : వహ్వా.. స్టోక్స్ తపన మెచ్చుకోవాల్సిందే