ETV Bharat / sports

విండీస్​పై సిరీస్​ నెగ్గాలంటే​ 316 కొట్టాల్సిందే..

కటక్​ వేదికగా భారత్​తో జరుగుతున్న మూడో వన్డేలో విండీస్​ భారీ స్కోరు సాధించింది. నికోలస్​ పూరన్​, పొలార్డ్​ అర్ధశతకాలతో రాణించగా.. హోప్​, ఛేజ్​, హెట్​మెయిర్​ ఫర్వాలేదనిపించారు. ఫలితంగా నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 రన్స్​ సాధించింది కరీబియన్​ జట్టు.

India vs West Indies, 3rd ODI
భారత్​ సిరీస్​ నెగ్గాలంటే 300 కొట్టాల్సిందే...
author img

By

Published : Dec 22, 2019, 5:35 PM IST

Updated : Dec 22, 2019, 5:47 PM IST

కటక్​ వేదికగా జరుగుతున్న మూడో వన్డేలో భారత్​ ముందు 316 పరుగుల భారీ లక్ష్యాన్ని ఉంచింది వెస్టిండీస్. కచ్చితంగా నెగ్గాలన్న కసితో ఆడారు కరీబియన్లు. పూరన్​, పొలార్డ్​ అర్ధశతకాలతో రాణించారు. వీరి బ్యాటింగ్​ ధాటికి నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 315 రన్స్​ సాధించింది విండీస్​ జట్టు. ఆఖరి పది ఓవర్లలో 118 పరుగులు రావడం విశేషం.

ఆరంభం అదుర్స్​...

విండీస్​ ఓపెనర్లు ఎవిన్​ లూయిస్​, షై హోప్​ మంచి ఆరంభాన్నిచ్చారు. ఇద్దరూ తొలి వికెట్​కు 57 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. అనంతరం 14వ ఓవర్​ ఆఖరి బంతికి జడేజా తొలి వికెట్​గా లూయిస్​(21(50 బంతుల్లో; 3 ఫోర్లు)ను పెవిలియన్​ చేర్చాడు. అయితే వెంటనే 42 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద ఉన్న హోప్​ను బౌల్డ్​ చేసి రెండో వికెట్​ తీశాడు సైనీ. ఈ మ్యాచ్​లో వన్డే కెరీర్​లో 3వేల పరుగుల మైలురాయిని చేరాడీ ఆటగాడు. ఈ ఘనతను తక్కువ ఇన్నింగ్స్​ల్లో అందుకున్న రెండో బ్యాట్స్​మన్​గా రికార్డు సృష్టించాడు.

మొదట హెట్​మెయిర్​... ఆఖర్లో పూరన్​

వన్​ డౌన్​లో వచ్చిన ఛేజ్​ 38(48 బంతుల్లో; 3 ఫోర్లు) ఫర్వాలేదనిపించాడు. అయితే హిట్టర్​ హెట్​మెయిర్​ మాత్రం మరోసారి భారత బౌలింగ్​ను చితక్కొట్టాడు. 33 బంతుల్లో 37 పరుగులు చేశాడు. ఇందులో రెండు ఫోర్లు, రెండు సిక్సర్లు ఉన్నాయి. కీలక సమయంలో మరోసారి బంతి అందుకున్న సైనీ.. హెట్​మెయిర్, ​ఛేజ్​లను ఔట్ చేశాడు.

ఆఖర్లో నికోలస్​ పూరన్​ 89(64 బంతుల్లో; 10 ఫోర్లు, 3 సిక్సర్లు) విధ్వంసకర ఇన్నింగ్స్​ ఆడాడు. పూరన్​ను 47వ ఓవర్​ ఆఖరి బంతికి పెవిలియన్​ చేర్చాడు శార్దుల్​. మరో ఎండ్​లో కీరన్​ పొలార్డ్​ 74( 51 బంతుల్లో 3 ఫోర్లు, 7 సిక్సర్లు)బాది అజేయంగా నిలిచాడు. ఫలితంగా వీరిద్దరూ 5వ వికెట్​కు 135 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. ఈ మ్యాచ్​లోనూ భారత్​ ఫీల్డింగ్​లో విఫలమైంది.

అరంగేట్రంలో ఫర్వాలేదనిపించాడు​....

దీపక్​ చాహర్​ గాయం కారణంగా వైదొలగడం వల్ల మూడో వన్డేలో అరంగేట్రం చేశాడు నవదీప్​ సైనీ. తొలిసారి అంతర్జాతీయ వన్డే మ్యాచ్​ ఆడిన ఈ 21 రెండేళ్ల ఫాస్ట్​ బౌలర్​.. మొదటి మ్యాచ్​లోనే సత్తా చాటాడు. రెండు వికెట్లు తీయడమే కాకుండా ఒక క్యాచ్​ పట్టాడు. 10 ఓవర్లు బౌలింగ్​ వేసి 5.80 సగటుతో 58 పరుగులు ఇచ్చాడు.

మిగిలిన బౌలర్లలో జడేజా, షమి, శార్దుల్​ తలో​ వికెట్​ తీసుకున్నారు. కుల్దీప్​ 100వ వికెట్​ రికార్డును అందుకోలేకపోయాడు. 10 ఓవర్లు వేసి 67 రన్స్​ ఇచ్చిన ఈ చైనామన్​ బౌలర్​.. వికెట్ మాత్రం తీయలేకపోయాడు.

RESTRICTION SUMMARY: MUST ON-SCREEN CREDIT NSW RFS
SHOTLIST:
TWITTER @NSWRFS - MUST ON-SCREEN CREDIT NSW RFS
Blackheath, New South Wales - 22 December 2019
++NIGHT SHOTS++
1. Fire raging among trees, firefighters retreating and damping down ground, fire moving closer to home
STORYLINE:
Gripping footage showed the extreme conditions firefighters have faced as they try to control Australia's sweeping bushfires.
New South Wales Rural Fire Service shared a video from the early hours of Sunday morning of their firefighters attempting to tackle a blaze raging close to homes in Blackheath.
A fire service official had said strong southerly winds fanned more than 100 fires in New South Wales alone on Saturday.
The bushfires have torn across several Australian states in recent weeks, destroying homes and claiming the lives of two volunteer firefighters.
===========================================================
Clients are reminded:
(i) to check the terms of their licence agreements for use of content outside news programming and that further advice and assistance can be obtained from the AP Archive on: Tel +44 (0) 20 7482 7482 Email: info@aparchive.com
(ii) they should check with the applicable collecting society in their Territory regarding the clearance of any sound recording or performance included within the AP Television News service
(iii) they have editorial responsibility for the use of all and any content included within the AP Television News service and for libel, privacy, compliance and third party rights applicable to their Territory.
Last Updated : Dec 22, 2019, 5:47 PM IST
ETV Bharat Logo

Copyright © 2024 Ushodaya Enterprises Pvt. Ltd., All Rights Reserved.